iDreamPost

బీజేపీలో బాబు బ్యాచ్ నోటికి తాళం, అధిష్టానం కీలక నిర్ణయం

బీజేపీలో బాబు బ్యాచ్ నోటికి తాళం, అధిష్టానం కీలక నిర్ణయం

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు సాగుతున్న వేళ బీజేపీ ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఎటువంటి సంకేతాలు వెళ్లకుండా జాగ్రత్తపడుతోంది. అవినీతి, అక్రమాల కేసుల్లో ప్రధాన ప్రతిపక్షానికి చెందిన పలువురు నేతలు అరెస్ట్ అవుతున్న క్రమంలో పలు జాగ్రత్తలు పాటిస్తోంది. ఇప్పటికే ఏపీ బీజేపీలో మూడు ముక్కలుగా కనిపిస్తోంది. చంద్రబాబు అనుకూల బీజేపీ, బాబు వ్యతిరేక బీజేపీలు కీలక భూమిక పోషిస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీని సమర్థించేలా పల్లెత్తు మాట కూడా వినిపించకూడదని బీజేపీ నిర్ణయించింది.

ఆ క్రమంలో కొందరు నేతలను కట్టడి చేసేందుకు పూనుకుంది. ఈ మేరకు ఆదేశాలు కూడా జారీ కావడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో పరిణామాలు చంద్రబాబుకి ఏమాత్రం రుచించేలా కనిపించడం లేదు. వాటికి తోడు తాజాగా తన తరుపున గొంతు విప్పే నేతలను కట్టడి చేసేందుకు కమలనాధులు పూనుకోవడం చంద్రబాబుకి మింగుడుపడే అవకాశం లేదు. భవిష్యత్ లో మరోసారి బీజేపీతో కలిసి ఏపీ రాజకీయాల్లో చక్రం తిప్పుతామని తన పార్టీ శ్రేణులకు బాబు భరోసా ఇస్తున్నారు. కానీ బీజేపీ మాత్రం మా దగ్గరకి రాకు అన్నట్టుగా వ్యవహరిస్తూ, చివరకు బాబుకి ప్రయోజనం కలిగించే అన్ని దారులు మూసేయాలని నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది.

Also Read:అధికారాంతము నందు – ఇందిరా గాంధీకి గెస్ట్ హౌస్ దక్కని అనుభవం

తాజాగా బీజేపీ అధిష్టానం స్పందించింది. క్రమక్షణా చర్యలకు పూనుకుంది. కొందరు నేతలపై ఘాటుగా వ్యవహరించింది. నోటీసులు కూడా జారీ చేసింది. పార్టీ క్రమశిక్షణ సంఘం కో కన్వీనర్ ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం పేరుతో విడుదలయిన నోటీసులు ఇప్పుడు ఆపార్టీలో తీవ్ర చర్చకు తెరలేపాయి.

ఇంకా చంద్రబాబు పరిస్థితి అగమ్యగోచరంగా మారుతున్న తరుణంలో తాము ఎదిగేందుకు ఉన్న అవకాశాలను వినియోగించుకోవాలని బీజేపీ భావిస్తున్నట్టు కనిపిస్తోంది. అదే సమయంలో టీడీపీకి వంత పాడేందుకు చేస్తున్న అన్ని ప్రయత్నాలను అడ్డుకోవాలని చూస్తున్నట్టు కనిపిస్తోంది. ఇకపై టీవీ చర్చల్లో పాల్గొనాల్సిన అధికార ప్రతినిధుల జాబితా కూడా సిద్ధం చేయడం విశేషం.

అచ్చెనాయుడుకి మద్దతుగా మాట్లాడటంపై కిలారు దిలీప్ కి కూడా నోటీసులు జారీ అయ్యాయి. సంజాయిషీ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. వారిద్దరితో పాటుగా బీజేపీలో బాబు భజన చేసే నేతల్లో ఒకరికిగా ముద్రపడిన చిన్నం రామకోటయ్యపై ఆంక్షలు విధించారు. మీడియాతో మాట్లాడకూదని ఆదేశాలు ఇచ్చారు. దాంతో క్రమశిక్షణా చర్యలకు పూనుకున్న బీజేపీ నాయకత్వం వ్యూహత్మకంగా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోంది. ఒకరిద్దరి నేతలపై చర్యలు తీసుకోవడం ద్వారా మిగిలిన వారందరికీ సూటిగా సందేశాలు ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. ఎవరు ముందుకెళ్లినా చర్యలు తప్పవని స్పష్టమైన సంకేతాలు పంపించినట్టు కనిపిస్తోంది. ఈ పరిణామాలతో సుజనా చౌదరి, సీఎం రమేష్ సహా అనేక బీజేపీ తీర్థం పుచ్చుకున్న మాజీ తమ్ముళ్లకు తలనొపిని తీసుకురావచ్చనే అంచనాలు కూడా ఉన్నాయి. మొత్తంగా ఏపీ బీజేపీలో సుదీర్ఘకాలం తర్వాత క్రమశిక్షణా చర్యలకు పూనుకోవడం వరకూ వచ్చిన పరిస్థితిని గమనిస్తే వ్యవహారం సీరియస్ గానే ఉన్నట్టు చెప్పవచ్చు.

Also Read:మీడియా స్వేచ్ఛ – మీడియా పోకడలు – మీడియా దుర్వినియోగం – మీడియా నియత్రణ

బీజేపీ నేత లక్ష్మీపతి రాజా పై సస్పెన్షన్ వేటు కూడా వేసింది. సాక్షి టీవీ లో ఆయన చేసిన వ్యాఖ్యలను సస్పెన్షన్ నోటీసులో కూడా ప్రస్తావించారు. ఇది అనేక మందిని కలవరపరుస్తోంది.బీజేపీ సాక్షి టీవీని బహిష్కరించలేదు కానీ అధ్యక్షుడి హోదాలో కన్నా లక్ష్మీనారాయణ ఏ ఛానల్ కు ఎవరు వెళ్లాలన్నది నిర్ణయించారట.. దాని ప్రకారం విష్ణువర్ధన్ రెడ్డి తో మరి కొందరు మాత్రమే సాక్షికి వెళ్ళాలి కానీ లక్ష్మీపతి రాజు కూడా సాక్షికి వెళుతుండటం మీద ఆగ్రహించిన కన్నా వ్యక్తిగతంగా తీసుకొని ఆయన్ను సస్పెండ్ చేయించారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.

ఏది ఏమైనా బీజేపీ తన నేతల కట్టడికి చర్యలు తీసుకోవటం ద్వారా క్యాడర్ కు ఒక స్పష్టమైన సందేశం ఇచ్చిఅంట్లు అయ్యింది…

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి