iDreamPost

ప్రియుడితో నిశ్చితార్థం చేసుకున్న స్టార్ డైరెక్టర్ కుమార్తె! ఫొటోలు వైరల్..

  • Author Soma Sekhar Published - 06:02 PM, Fri - 4 August 23
  • Author Soma Sekhar Published - 06:02 PM, Fri - 4 August 23
ప్రియుడితో నిశ్చితార్థం చేసుకున్న స్టార్ డైరెక్టర్ కుమార్తె! ఫొటోలు వైరల్..

సినిమా ఇండస్ట్రీలో ఒక్కొక్కరుగా పెళ్లి పీటలెక్కుతున్నారు. పలువురు హీరోలు, హీరోయిన్ లు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూనే ఉన్నారు. తాజాగా ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కుమార్తె అలియా కశ్యప్ ఎంగేజ్ మెంట్ ఘనంగా జరిగింది. తన ప్రియుడు షేన్ గ్రెగోయిర్ తో గురువారం ముంబాయి లో అంగరంగ వైభవంగా నిశ్చితార్థం జరిగింది. ఈ ఫంక్షన్ లో బాలీవుడ్ స్టార్ కిడ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇక తన ఎంగేజ్ మెంట్ కు సంబంధించిన ఫోటోలను అలియా తన ఇన్ స్టాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ గారాల పట్టి అలియా కశ్యప్ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ముంబాయిలో అంగరంగ వైభవంగా తన ప్రియుడు షేన్ గ్రెగోయిర్ తో ఎంగేజ్ మెంట్ చేసుకుంది అలియా కశ్యప్. ఇక ఈ వేడుకకు బాలీవుడ్ స్టార్ కిడ్స్ అయిన సుహానా ఖాన్, పాలక్ తివారీ, ఇబ్రహీం అలీ ఖాన్, ఖుషీ కపూర్ లతో పాటుగా మరికొంత మంది హాజరైయ్యారు. కాగా.. అలియా కశ్యప్ ప్రస్తుతం యూట్యూబర్ గా రాణిస్తోంది. పలు వీడియోలు చేస్తూ.. ప్రేక్షకుల అభిమానాన్ని చురగొంటోంది. ఇక ఇంతకు ముందే తన లవర్ గ్రెగోయిర్ తనకు ప్రపోజ్ చేసిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది ఈ భామ. ఇక తనకు గ్రెగోయిర్ డైమండ్ రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేసినట్లుగా అలియా వెల్లడించింది. అనురాగ్ కశ్యప్ మెుదటి భార్య ఆర్తి బజాజ్ కూతురే అలియా. త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్న ఈ జంటకు పలువురు సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by aaliyah (@aaliyahkashyap)

 

View this post on Instagram

 

A post shared by aaliyah (@aaliyahkashyap)


ఇదికూడా చదవండి: ఈ పిల్లాడు.. నేషనల్ అవార్డు అందుకున్న యాక్టర్! ఎవరో గుర్తుపట్టారా?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి