iDreamPost

చిరు పేరుని లాక్ చేశారా ?

చిరు పేరుని లాక్ చేశారా ?

ఆచార్యను షూటింగ్ కు శుభం కార్డు వేసే పనిలో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా లూసిఫర్ రీమేక్ ని సెట్స్ పైకి తీసుకెళ్ళిపోతున్నారు. దర్శకుడు మోహన్ రాజా ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులను జెట్ స్పీడ్ తో కానిస్తున్నారు. వచ్చే నెల రెండో వారంలో మొదలుపెట్టి వీలైనంత వేగంగా పూర్తి చేసేలా పక్కా ప్లానింగ్ తో సిద్ధంగా ఉన్నారు. ఏవైనా అనూహ్య పరిణామాలు తలెత్తితే తప్ప డిసెంబర్ లోగా షూట్ ఫినిష్ చేయడం పెద్ద కష్టమేమి కాదు. దీంతో పాటే సమాంతరంగా బాబీ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ సినిమాను కూడా ప్లాన్ చేసుకున్నారట. వచ్చే ఏడాది ఖచ్చితంగా రెండు రిలీజులు ఉండాలనేది అసలు టార్గెట్.

Also Read: ఆచార్యలో ఈ పోరాటాలే కీలకం

ఇక విషయానికి వస్తే లూసిఫర్ రీమేక్ కి గాడ్ ఫాదర్ అనే టైటిల్ ఆల్మోస్ట్ ఫిక్స్ అయినట్టేనని తెలిసింది. నిజానికి ఈ పేరుకు వరల్డ్ సినిమాలో ఒక విశిష్ట స్థానం ఉంది. మాఫియా బ్యాక్ డ్రాప్ లో హాలీవుడ్ దర్శకుడు ఫ్రాన్సిస్ కొప్పల 1972లో రూపొందించిన ఈ మాస్టర్ పీస్ ని ఇప్పటికీ బెంచ్ మార్క్ గా ఫాలో అయ్యే డైరెక్టర్లు ఎందరో ఉన్నారు. ఆ మాటకొస్తే దీని ప్రభావం పడని న్యూ జనరేషన్ మేకర్స్ లేరంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు దీనికి ANRకి కనెక్షన్ ఏంటనుకుంటున్నారా. 1995లో అక్కినేని హీరోగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో గాడ్ ఫాదర్ టైటిల్ తో ఓ సినిమా వచ్చింది. గొప్పగా కాదు కానీ ఓ మోస్తరుగా ఆడింది

ఇప్పుడు మళ్ళీ ఇరవై అయిదు ఏళ్ళ తర్వాత ఆ టైటిల్ ని రిపీట్ చేయబోతున్నారన్న మాట. గతంలో కింగ్ మేకర్, బైరెడ్డి, మానాయకుడు అనే ఏవేవో పేర్ల గురించి ప్రచారం జరిగాయి కానీ ఫైనల్ గా చిరుతో సహా అధిక శాతం ఓటింగ్ గాడ్ ఫాదర్ కే పడిందట. మెయిన్ క్యాస్టింగ్ ఎవరో ఇప్పటిదాకా గుట్టుగానే ఉంచుతూ వచ్చారు. నయనతార, సత్యదేవ్ అన్నారు కానీ అఫీషియల్ గా అదీ ఖరారు కాలేదు. తమన్ మొదటిసారి చిరంజీవికి పూర్తి స్థాయి సంగీతం అందిస్తున్న ఈ గాడ్ ఫాదర్ లో చాలా కీలకమైన తమ్ముడి క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారనేది మాత్రం బయటికి రాలేదు. వచ్చే నెల నుంచి ఒక్కొక్కటిగా సస్పెన్స్ వీగిపోతుంది

Also Read: పండగ పోటీకి ప్రభాస్ సై ?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి