iDreamPost

సలార్ నుంచి కొత్త యాక్షన్ ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?

  • Published Dec 16, 2023 | 10:04 PMUpdated Dec 16, 2023 | 10:06 PM

పాన్ ఇండియా హీరో ప్రభాస్, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న యాక్షన్, సెంటిమెంట్ మూవీ ‘సలార్’ డిసెంబర్ 22 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

పాన్ ఇండియా హీరో ప్రభాస్, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న యాక్షన్, సెంటిమెంట్ మూవీ ‘సలార్’ డిసెంబర్ 22 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

  • Published Dec 16, 2023 | 10:04 PMUpdated Dec 16, 2023 | 10:06 PM
సలార్ నుంచి కొత్త యాక్షన్ ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?

సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రభాస్ నటిస్తున్న సలార్ మూవీ గురించిన టాక్ వినిపిస్తుంది. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సినిమాలు వరుసగా నిరాశపరుస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే కేజీఎఫ్ సీరీస్ తో ప్రభంజనం సృష్టించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తుండటంతో ఫ్యాన్స్ ఈ మూవీపో కొండంత ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ ప్రభాస్ లుక్, యాక్షన్ సీక్వెన్స్ కి ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోయారు. ట్రైలర్ రికార్డుల మోత మోగించింది. ఈ మూవీకి సంబంధించిన మరో ట్రైలర్ భారీ యాక్షన్ సీక్వెన్స్ తో వస్తుందని సోషల్ మీడియాలో తెగ టాక్ నడిచింది. తాజాగా సలార్ మూవీకి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న సెన్సెషనల్ మూవీ ‘సలార్’. ఎన్నో రోజుల నుంచి ప్రభాస్ ఫ్యాన్స్, ఆడియన్స్ ని ఊరిస్తూ వచ్చిన ఈ మూవీ ఎట్టకేలకు థియేటర్లలో డిసెంబర్ 22 న సందడి చేయబోతుంది. ఈ మూవీలో మాలీవుడ్ హీరో ఫృథ్విరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. సలార్ మూవీ ట్రైలర్ డిసెంబర్ 1 న రిలీజ్ అయ్యింది. ఈ ట్రైలర్ లో దేవ (ప్రభాస్), వరద రాజు మన్నార్ (పృథ్విరాజ్‍) మధ్య స్నేహ సంబంధం, ఖాన్సార్ సిటీ కోసం పోరాట, రాజకీయ కుతంత్రాలకు సంబంధించి చూపించారు. తన కోసం ఎప్పుడైన వస్తా ని చిన్ననాటి ప్రమాణం ప్రకారం, పృథ్విరాజ్‍ కోసం ప్రభాస్ రావడం.. కొన్ని యక్షన్ సీన్లు చూపించారు.

సలార్ మూవీ నుంచి మరో యాక్షన్ భరిత ట్రైలర్ డిసెంబర్ 17న రిలీజ్ కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రిలీజ్ ట్రైలర్ పేరుతో ఇది రాబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ ట్రైలర్ లో ఎక్కువ బాగం యాక్షన్ సీక్వెన్స్ ఉండబోతున్నట్లు తెలుస్తుంది. కొత్త ట్రైలర్ లో ఖాన్సార్ గురించి ఎలాంటి పోరాట సన్నివేశాలు ఉండబోతున్నాయి అనేది చూపిస్తారని ఫిలిమ్ వర్గాల్లో టాక్ నడుస్తుంది.. దీంతో ఈ మూవీపై మరిన్ని అంచనాలు పెంచే యోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మూవీకి రవి బస్రూర్ సంగతం అందించారు. హుంబాలే ఫిలిమ్ పథాకంపై రాబోతుంది. ప్రభాస్, పృథ్విరాజ్‍ సుకుమారన్, శ్రుతిహాసన్, జగపతిబాబు, టీనూ ఆనంద్ ముఖ్యపాత్రల్లో నటించారు. మరి ఈ ట్రైలర్ కట్ అభిమానులకు ఏ రేంజ్ లో ఉర్రూతలూగించబోతుందో చూడాలి. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి