iDreamPost

జయప్రదకు మరో షాక్.. 15 రోజుల్లో లొంగిపోవాలని హైకోర్ట్ ఆదేశం

నటి జయప్రదకు వరుసగా కోర్టుల నుండి చుక్కెదురు అవుతుంది. 2019లో లోక్ సభ ఎన్నికల సమయంలో జయప్రద ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించారన్న ఆరోపణలపై స్వార్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో జయప్రదకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది కోర్టు. ఇప్పుడు మరో కేసులో ఆమెకు షాక్ తగిలింది.

నటి జయప్రదకు వరుసగా కోర్టుల నుండి చుక్కెదురు అవుతుంది. 2019లో లోక్ సభ ఎన్నికల సమయంలో జయప్రద ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించారన్న ఆరోపణలపై స్వార్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో జయప్రదకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది కోర్టు. ఇప్పుడు మరో కేసులో ఆమెకు షాక్ తగిలింది.

జయప్రదకు మరో షాక్.. 15 రోజుల్లో లొంగిపోవాలని హైకోర్ట్ ఆదేశం

సీనియర్ నటి, మాజీ ఎంపీ జయప్రద ఇటీవల వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల సమయంలో జయప్రద ఎన్నికల ప్రవర్తన నియమావళిని (ఎలక్షన్ కోడ్) ఉల్లంఘించారన్న ఆరోపణలపై స్వార్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాంపూర్ స్థానం నుండి పోటీ చేసిన జయప్రద.. సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి అజాంఖాన్ చేతిలో ఓటమి చెందారు. కాగా, ఉత్తరప్రదేశ్‌లోని రాం పూర్ కోర్టు ఆమెపై నమోదైన కేసును విచారిస్తుంది. విచారణ సందర్భంగా వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని పలుమార్లు న్యాయ స్థానం ఆదేశించినా.. ఆమె హాజరు కాలేదు. దీంతో ఈ కేసులో జయప్రదకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది కోర్టు.

తాజాగా ఇప్పుడు మరో కోర్టు ఆమెకు ఝలక్ ఇచ్చింది. చెన్నైలోని ఓ సినిమా థియేటర్ ఉద్యోగుల ఇవ్వాల్సిన చెల్లింపుల ఇష్యూపై చెన్నై ఎగ్మోర్ కోర్టు ఈ ఏడాది ఆగస్టులో ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఆమెతో పాటు మరో ముగ్గురికి ఈ శిక్ష ఖరారు చేస్తూ.. ఒక్కొక్కరికి రూ. 5 వేల జరిమానా విధించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ.. ఆమె హైకోర్టును ఆశ్రయించగా.. విచారణ చేపట్టిన న్యాయ స్థానం.. ఆ పిటిషన్‌ను తోసిపుచ్చింది. జైలు శిక్ష రద్దు చేయడం కుదరని తేల్చి చెప్పింది. ఈ కేసులో బెయిల్ కావాలంటే.. 15 రోజుల్లోగా మెజిస్ట్రేట్ ముందు లొంగిపోవాలని, రూ. 20 లక్షలు డిపాజిట్ చేయాలని ఆదేశించింది. ఇంతకు ఈ కేసు వివరాలేంటంటే..?

తమిళనాడులోని రాయపేటలో కొంత మందితో కలిసి జయప్రద గతంలో ఓ థియేటర్ నడిపారు. మొదట లాభాలు రాగా, ఆ తర్వాత వ్యాపారం బాగా తగ్గిపోయింది. దీంతో థియేటర్ మూసేశారు. అయితే థియేటర్ నడిపినంత కాలం కార్మికుల నుండి ఈఎస్ఐ రూపంలో కొంత డబ్బులు వసూలు చేశారు. థియేటర్ మూసివేయడంతో తిరిగి కార్మికులకు డబ్బులు చెల్లించాల్సి ఉండగా.. కార్మికులకు అంద జేయలేదు. దీంతో కార్మికులు బీమా కార్పొరేషన్‌ను ఆశ్రయించారు. దీంతో బీమా సంస్థ చెన్నై ఎగ్మోర్ కోర్టును ఆశ్రయించింది. థియేటర్ యాజమాన్యానికి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేసింది. జయపద్ర తిరిగి చెల్లిస్తామని చెప్పినప్పటికీ.. కార్మికులను మోసం చేసినందుకు.. ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ. 5 వేల జరిమానా విధించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి