iDreamPost

వాహనదారులకు గుడ్ న్యూస్.. ట్రాఫిక్‌ చలాన్లపై మరోసారి రాయితీ!

ఈ మధ్య రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిపోవడంతో ట్రాఫిక్ పోలీసులు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి చలాన్లు విధిస్తున్నారు.

ఈ మధ్య రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిపోవడంతో ట్రాఫిక్ పోలీసులు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి చలాన్లు విధిస్తున్నారు.

వాహనదారులకు గుడ్ న్యూస్.. ట్రాఫిక్‌ చలాన్లపై మరోసారి రాయితీ!

దేశంలో వాహనాల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు పట్టణాల్లో ఎక్కువగా ఉండే వాహనాల వాడకం ఇప్పుడు గ్రామాల్లో కూడా పెరిగిపోయాయి. ఇక రోడ్డు ప్రమాదాల సంఖ్య గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ప్రతిరోజూ పదుల సంఖ్యల్లో ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రమాదాల్లో ఎంతోమంది చనిపోవడం, వికలాంగులుగా మారడం చూస్తూనే ఉన్నాం. డ్రైవర్లు చేస్తున్న తప్పిదాలకు అమాయకులు శిక్ష అనుభవిస్తున్నారు. వీటిని అరికట్టేందుకు ట్రాఫిక్ అధికారులు ఎన్నో కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. నిబంధనలను ఉల్లంఘించిన వారికి భారీగా చలాన్లు విధిస్తున్నారు. తాజాగా వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పింది సర్కారు. వివరాల్లోకి వెళితే..

ఈ మద్య వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. అలాంటి వారిని నిఘా నేత్రాలు (సీసీ కెమెరాలు) పట్టేస్తున్నాయి.. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే అటోమెటిక్ గా ఫోటోలు తీయడంతో సదరు వాహనదారులకు మెసేజ్ పంపిస్తున్నారు అధికారులు. కొంతమంది చలాన్లు సరైన సమయానికి చెల్లించినా.. కొంతమంది పెండింగ్ పెడుతున్నారు. అలాంటి వారికోసం గతంలో రాయితీ కల్పించింది తెలంగాణ ప్రభుత్వం. తాజాగా మరోసారి వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ సర్కార్. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ట్రాఫిక్ చలాన్లు వసూళ్లు చేసేందుకు పోలీస్ శాఖ మరోసారి సిద్దమవుతుంది. వాహనదారులకు భారీగా రాయితీలు ఇచ్చేందుకు సమాయత్తం అవుతుంది. గత ఏడాది రాయితీ ప్రకటించడంతో ఏకంగా రూ.300 కోట్ల వరకు చలానా రుసుము వసూలయ్యింది. ఈ తరహాలోనే మరోసారి రాయితీ ప్రకటించి పెండింగ్ చలాన్లు వసూలు చేయాలని అధికారులు భావిస్తున్నారు.

Another discount on traffic challans!

హైదరాబాద్ పరిధిలో మూడు కమిషనరేట్లతో పాటు రాష్ట్రంలోని ఇతర కమిషనరేట్లు, జిల్లాస్థాయి, పట్టణాల స్థాయిలో ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించినవారికి చలాన్లు విధిస్తున్నారు. టెక్నాలజీ పెరితగిపోవడంతో కీలక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా  అటోమెటిక్ గా చలాన్లు విధిస్తున్నారు. అయితే కొంతమంది చలాన్లు కట్టకుండా పెండింగ్ లో ఉంచుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహించి సదరు వాహనంపై ఉన్న పెండింగ్ చలాన్లు వసూళ్లు చేయడం జరుగుతుంది. కానీ ఇది పూర్తి స్థాయిలో జరగకపోవడంతో ఒక్కో వాహనంపై పదుల సంఖ్యలో పెండింగ్ చలాన్లు ఉంటున్నాయి. 2022 మార్చి 31 నాటికి తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 2.4 కోట్ల మేర చలాన్లు పెండింగ్ లో ఉన్నాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వం ఒక ఆలోచనకు వచ్చి పెండింగ్ చలాన్లకు భారీ రాయితీ కల్పించింది. దీనికి మంచి రెస్పాన్స్ రావడం.. కేవలం 45 రోజుల్లోనే రూ.300 కోట్ల వరకు వసూలయ్యాయి. దాదాపు 65 శాతం చలానాలు చెల్లించారు. ఈ క్రమంలోనే మరోమారు రాయితీ ప్రకటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి