iDreamPost

Animal: ‘యానిమల్’ మూవీలోని ‘అర్జన్ వేల్లీ’ సాంగ్​ లిరిక్స్​కు అర్థం ఏంటో తెలుసా?

  • Published Dec 13, 2023 | 6:43 PMUpdated Dec 13, 2023 | 6:43 PM

సినిమా లిరిక్స్​కు అర్థాలు తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. సొంత భాషా మూవీస్ అయితే ఈజీగా అర్థమైపోతాయి. కానీ పరభాషా చిత్రాల్లోని పాటలు భాష తెలిసినా ఓ పట్టాన అర్థం కావు. ‘యానమిల్’ మూవీలోని ‘అర్జన్ వేల్లీ’ సాంగ్ ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే. అలాంటి ఈ పాట మీనింగ్ ఇప్పుడు తెలుసుకుందాం..

సినిమా లిరిక్స్​కు అర్థాలు తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. సొంత భాషా మూవీస్ అయితే ఈజీగా అర్థమైపోతాయి. కానీ పరభాషా చిత్రాల్లోని పాటలు భాష తెలిసినా ఓ పట్టాన అర్థం కావు. ‘యానమిల్’ మూవీలోని ‘అర్జన్ వేల్లీ’ సాంగ్ ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే. అలాంటి ఈ పాట మీనింగ్ ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Dec 13, 2023 | 6:43 PMUpdated Dec 13, 2023 | 6:43 PM
Animal: ‘యానిమల్’ మూవీలోని ‘అర్జన్ వేల్లీ’ సాంగ్​ లిరిక్స్​కు అర్థం ఏంటో తెలుసా?

సినిమాల్లో సక్సెస్ ఫార్ములా అనేది ఏదీ లేదు. ట్రెండ్​ను బట్టి, ఆడియెన్స్​ పల్స్​ను బట్టి మూవీస్​ను తీస్తూ పోవడమే. తమకు నచ్చిన కథ.. ప్రేక్షకులకూ నచ్చుతుందనే కాన్ఫిడెన్స్​తో ముందుకు వెళ్లాల్సిందే. అందుకే మూవీకి మొదటి వ్యూయర్ డైరెక్టర్ అని అంటుంటారు. స్టోరీ రాసేటప్పుడు, షూటింగ్ మొదలుపెట్టడానికి ముందే ఫిల్మ్ ఎలా ఉంటుందో అతడి బుర్రలో ఇమిడిపోవాలి. అప్పుడే అనుకున్న కథను అనుకున్నంత బాగా తీయగలడని అంటుంటారు. అయితే చాలా మటుకు ఒకే ఫార్ములా స్టోరీస్​తో సినిమాలు రావడం ఈ మధ్య కాలంలో ఎక్కువైంది. ఏదైనా ఒక జోనర్ సక్సెస్ అయితే దాన్ని పట్టుకొని మిగతావారూ అలాంటి మూవీస్ తీస్తున్నారు. దీంతో మూస ధోరణిలోకి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ వెళ్లిపోతోందనే కామెంట్స్ వస్తున్నాయి.

మూసను పోగొడుతూ స్టోరీ రైటింగ్, ఫిల్మ్ మేకింగ్, యాక్టింగ్​లో ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు రావాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు వచ్చిన ‘శివ’ అలాంటిదే. రామ్ గోపాల్ వర్మ తీసిన ఈ మూవీ ఇండస్ట్రీని ఒక్కసారిగా షేక్ చేసింది. ప్రతి పదేళ్లకోసారి అలాంటి ట్రెండ్ సెట్టింగ్ ఫిల్మ్స్ వస్తుండటం చూస్తూనే ఉన్నాం. ఇటీవల రిలీజైన ‘యానిమల్’ కూడా ఈ కోవలోకే వస్తుందని ప్రేక్షకులు సహా విమర్శకులు కూడా అంటున్నారు. ఇందులో సందీప్ రెడ్డి వంగా రైటింగ్, డైరెక్షన్ స్టైల్​కు, రణ్​బీర్ కపూర్ యాక్టింగ్​కు అందరూ ఫిదా అవుతున్నారు. అక్కడ, ఇక్కడ అనే తేడాల్లేకుండా రిలీజైన ప్రతి చోటా రికార్డు స్థాయి కలెక్షన్లతో దూసుకెళ్తోంది ‘యానిమల్’. ఈ మూవీ ఇప్పటికే రూ.338 కోట్ల నెట్ వసూలు చేసి.. రూ.500 కోట్ల క్లబ్​లోకి చేరేందుకు దూసుకెళ్తోంది.

రొటీన్ మూవీస్​కు భిన్నంగా ఉన్న ‘యానిమల్​’ను ఆడియెన్స్ అక్కున చేర్చుకున్నారు. ఈ మూవీ స్పీడ్ చూస్తుంటే గ్రాస్ పరంగా ఫుల్ రన్ ముగిసేసరికి రూ.1,000 కోట్ల క్లబ్​లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ మూవీ సక్సెస్​లో సందీప్ డైరెక్షన్, రణ్​బీర్ యాక్టింగ్​తో పాటు బీజీఎం, సాంగ్స్ కూడా కీలక పాత్ర పోషించాయి. ఈ ఫిల్మ్​లో వన్ ఆఫ్ ది హైలైట్స్​లో ‘అర్జన్ వేల్లీ’ సాంగ్ ఒకటని చెప్పొచ్చు. అయితే హిందీ సినిమా అయినప్పటికీ హీరో ఫ్యామిలీది పంజాబీ నేపథ్యం కావడంతో కొన్ని పాటల్ని ఆ భాష నుంచే తీసుకున్నారు. దీంతో ఆ పాటల అర్థం ఏంటో ఎవరికీ తెలియడం లేదు. ‘యానిమల్​’లోని ఇతర సాంగ్స్​ను తెలుగు, తమిళంలోకి డబ్ చేసినప్పటికీ ‘అర్జన్ వేల్లీ’ని మాత్రం అలాగే ఉంచేశారు సందీప్ రెడ్డి వంగా. డబ్ చేస్తే మీనింగ్ మారిపోతుందని, దాని విలువ పోతుందని అలాగే ఉంచేశారట. ఈ నేపథ్యంలో ‘అర్జన్ వేల్లీ’ సాంగ్ మీనింగ్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

‘అర్జన్ వేల్లీ’ లిరిక్​లోని వేల్లీ అంటే ధైర్యవంతుడని అర్థం. ‘హో కడే విచ్ దంగ్ ఖడ్​కే.. ఓత్తే హోగయి లడాయీ భారీ’ అంటే బరిలోకి దిగాక అందులో భారీ గొడవ జరుగుతుంది. దీంతో లాఠీ ఛార్జ్ నడుస్తుందనేది మీనింగ్. ఆ తర్వాత ‘అర్జన్ వేల్లీని ఓ పేర్ జోడ్​కే గందాసీ మారి’ అనే లైన్ వస్తుంది. దీనర్థం ధైర్యవంతుడైన అర్జున్ గొడవకు దిగాడని.. గందాసీ (గొడ్డలి లాంటి వెపన్) అనే ఆయుధాన్ని వాడాడని. అనంతరం వచ్చే లైన్స్​లో ఎలాంటి వెపర్స్​ను వినియోగిస్తాడో కూడా చెబుతారు. నెక్స్ట్ లైన్స్​లో వాళ్లు ఫైట్ చేసిన విధానాన్ని వివరిస్తారు. ‘ఓ సానాన్ వంగున్ జట్​ భిడ్​దే.. సఖి సుఖ్ నా దిస్సే భగ్​వానా’ అని ఉంటుంది. అంటే టీమ్ అంతా కలసి బుల్స్​లా ఫైట్ చేస్తున్నారని.. దీని వల్ల దరిదాపుల్లో శాంతి అనేది లేకుండా పోయిందని అర్థం. ‘ఓ లీరో లీర్ హో జావోగీ.. కేందే బచ్నో ది ఫుల్కారీ’ అనేది తర్వాతి లైన్. అంటే ఆ యుద్ధం ఎంత దారుణంగా ఉందంటే.. అందరూ ముక్కలు ముక్కలైపోతున్నారు.

‘కుండియాన్ ద సింగ్ ఫస్ గయే.. ’ అంటే ఇద్దరు సింగ్స్ ఫైట్స్ చేసుకుంటున్నారు. రెండు ఎడ్లు ఫైట్ చేసినప్పుడు వాటి కొమ్ములు ఇరుక్కుపోయిన మాదిరిగా అలా కొట్లాడుతున్నారట. ‘ధర్తీ తే ఖూన్ దుల్లేయా వే.. జీవే టిడ్కే ఘడే ఛో పానీ’ అనేది తర్వాతి లైన్. ధర్తీ అంటూ భూమి. ఖూన్ అంటే రక్తం. ఘడే ఛో పానీ అంటే కుండ కింద ఉన్న రక్తం. నెత్తురుతో నిండిన కుండ కింద పడిపోయినప్పుడు రక్తం ఎలా నేల మీద పారుతుందో.. ఈ ఫైట్ తర్వాతా అంత బ్లడ్ వస్తుందని చెబుతున్నారు. ‘ఓ షేరా వంగు యార్ ఖడ్​ గయే.. వేల్లి నాల్ సే జిన్నా దే యారీ’ అనేది నెక్స్ట్ వచ్చే లిరిక్. షేరా అంటే సింహాలు. వేల్లి నాల్ సే జిన్నా దే యారీ అంటే ధైర్యవంతులైన స్నేహితులనేది అర్థం. అర్జున్ తన ఫ్రెండ్స్ సింహాల్లా నిల్చున్నారు. ఆ తర్వాత అర్జున్ నరకడం, ప్రత్యర్థులను తుదముట్టించం గురించి వివరిస్తూ సాగుతుంది. మరి.. ‘యానిమల్’ సినిమాలో మీకే పాట నచ్చిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: కేశవ బెయిల్ కోసం పుష్ప టీమ్ ప్రయత్నాలు.. నిజమెంత?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి