iDreamPost

Manjot Singh: వీడియో: అమ్మాయిని కాపాడిన ‘యానిమల్’ యాక్టర్.. పరిగెత్తుకుంటూ వెళ్లి..!

  • Published Jan 05, 2024 | 10:18 PMUpdated Jan 06, 2024 | 11:15 AM

Animal: ‘యానిమల్’ సినిమా ద్వారా చాలా మంది గుర్తింపు సంపాదించారు. అందులో ఓ పాత్రలో నటించిన సర్దార్జీ ఒక అమ్మాయి ప్రాణాలను కాపాడాడు. దీనికి సంబంధించిన పూర్తి విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Animal: ‘యానిమల్’ సినిమా ద్వారా చాలా మంది గుర్తింపు సంపాదించారు. అందులో ఓ పాత్రలో నటించిన సర్దార్జీ ఒక అమ్మాయి ప్రాణాలను కాపాడాడు. దీనికి సంబంధించిన పూర్తి విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Jan 05, 2024 | 10:18 PMUpdated Jan 06, 2024 | 11:15 AM
Manjot Singh: వీడియో: అమ్మాయిని కాపాడిన ‘యానిమల్’ యాక్టర్.. పరిగెత్తుకుంటూ వెళ్లి..!

పాత్ బ్రేకింగ్స్ మూవీస్ ఎప్పుడో ఒకటి వస్తుంటాయి. రామ్​గోపాల్ వర్మ దర్శకత్వంలో అప్పట్లో వచ్చిన ‘శివ’ అలాంటి మూవీనే. కింగ్ నాగార్జునను స్టార్​ను చేసిందీ సినిమా. ఈ మధ్య కాలంలో చూసుకుంటే ‘అర్జున్ రెడ్డి’ కూడా పాత్ బ్రేకింగ్ ఫిల్మ్స్ కోవలోకే వస్తుంది. ఈ చిత్రాన్ని తీసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తక్కువ టైమ్​లోనే మళ్లీ ఓ సెన్సేషనల్ బ్లాక్​బస్టర్​ను అందించారు. అదే ‘యానిమల్’. గతేడాది ఆఖర్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. రణ్​బీర్ కపూర్ హీరోగా వచ్చిన ఈ మూవీ రూ.800 కోట్ల పైచిలుకు వసూళ్లతో సంచలనం సృష్టించింది. ఇద్దరు తండ్రీ కొడుకుల మధ్య ప్రేమకు సంబంధించిన కథతో ఈ సినిమాను సందీప్ రెడ్డి తనదైన స్టైల్​లో తెరకెక్కించారు. అటు హిందీతో పాటు ఇటు తెలుగులోనూ ఈ మూవీ బిగ్ హిట్​గా నిలిచింది. ‘యానిమల్​’లో నటించిన యాక్టర్స్​లో కొంతమంది బాగా పాపులర్ అయ్యారు. అలాంటి వారిలో ఒకడైన మన్​జోత్ సింగ్​ ఒక అమ్మాయిని కాపాడాడు.

తాను చదువుకుంటున్న కాలేజ్​లో ప్రాణాలు తీసుకోవాలని డిసైడ్ అయిన ఓ 18 ఏళ్ల యువతిని కాపాడాడు మన్​జోత్. బిల్డింగ్​ పైనుంచి దూకేందుకు ఆమె ప్రయత్నించింది. ఈ సమయంలో అక్కడే ఉన్న మన్​జోత్ పక్క గోడ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాడు. దూకుతున్న యువతి చేతిని గట్టిగా పట్టుకున్నాడు. దీంతో అతడికి సాయం చేసేందుకు మరికొందరు యువకులు అక్కడికి చేరుకున్నారు. వారి హెల్ప్​తో ఆ యువతిని మన్​జోత్ పైకి తీసుకొచ్చాడు. ప్రాణాలు తీసుకోవాలనుకున్న యువతిని ‘యానిమల్’ యాక్టర్ కాపాడిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మన్​జోత్ ధైర్య సాహసాలకు, హెల్ప్ చేయాలనుకునే గుణాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. ఇలాంటి వాళ్ల అవసరం సమాజానికి ఎంతో ఉందని ప్రశంసిస్తున్నారు.

animal actor

కాగా, మన్​జోత్ అమ్మాయిని కాపాడిన వీడియో ఇప్పటిది కాదు. అది అతడి కాలేజ్​ టైమ్​లోది. గ్రేటర్ నోయిడాలోని శారదా యూనివర్సిటీలో ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్​ చదువుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఆ టైమ్​లో అతడు కాపాడిన అమ్మాయిని తర్వాత శారదా హాస్పిటల్​లో చేర్పించారు. తల్లితో గొడవ కారణంగానే ఆమె ప్రాణాలు తీసుకోవాలని భావించింది. అయితే లాస్ట్ మూమెంట్​లో మన్​జోత్ వచ్చి రక్షించడంతో బతికిపోయింది. అనంతరం ఆ అమ్మాయికి కౌన్సెలింగ్ ఇప్పించారు. ఇక, అమ్మాయిని కాపాడినందుకు గానూ అప్పటి ఢిల్లీ సిఖ్ కమ్యూనిటీ ప్రెసిడెంట్ మంజీత్ సింగ్ జీకే మన్​జోత్​ను మెచ్చుకున్నారు. అంతేగాక సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్​కు ప్రిపేర్ అయ్యేందుకు అతడికి అయ్యే మొత్తం ఖర్చుల్ని భరిస్తామని హామీ ఇచ్చారు. మరి.. ‘యానిమల్’ యాక్టర్ సాహసంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఈ యాడ్‌లో త్రిష కాకుండా.. ఓ స్టార్ హీరో ఉన్నాడు.. గుర్తు పట్టారా..?

 

View this post on Instagram

 

A post shared by Tellychakkar Official ® (@tellychakkar)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి