iDreamPost

వామ్మో.. బాబు సెక్యూరిటీ అంత పని చేయబోయారా..?

వామ్మో.. బాబు సెక్యూరిటీ అంత పని చేయబోయారా..?

విశాఖ ఎయిర్‌ పోర్టులో చంద్రబాబును అడ్డుకున్న ప్రజలపై బాబు సెక్యూరిటీ కాల్పులు జరపబోయారా..? తృటిలో విశాఖ ప్రజలు తప్పించుకున్నారా..? అంటే అవుననే అంటున్నారు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ. చంద్రబాబును అడ్డుకున్న మూకపై ఎన్‌ఎస్‌జీ కమాండోలు ఒక దశలో ఫైర్‌ ఓపెన్‌ చేయబోయారంటూ.. ఆంధ్ర జ్యోతి రాధా కృష్ణ ఈ రోజు తన పత్రికలో రాసుకొచ్చారు. ఈ విషయాన్ని భద్రతా సిబ్బంది కేంద్ర దృష్టికి తీసుకెళ్లారట. కేంద్రం కూడా ఆరా తీసిందట. ఈ విషయంపై డీజీపీని కేంద్రం వివరాలు అడిగి తెలుసుకుందట.

ఈ వర్తాను చూసిన విశ్లేషకులు.. గోరంతను కొండత చేసి రాయడంలోనూ, చూపడంలోనూ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తర్వాతే ఎవరైనా అని వ్యాఖ్యానిస్తున్నారు. మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్న చంద్రబాబుకు అటు రాయలసీమలోనూ ప్రజల నుంచి నిరసన ఎదురైంది. తాజాగా ఉత్తరాంధ్రలోనూ అదే రిపీట్‌ అయింది. ముందు రోజు నుంచే ఉత్తరాంధ్ర ప్రజలు, ప్రజా సంఘాలు బాబు పర్యటనను అడ్డుకుంటామని ప్రకటనలు చేశాయి. సోషల్‌ మీడియాలోనూ ప్రచారం జరిగింది. తమ ప్రాంతానికి కార్యనిర్వాహక రాజధాని వస్తుంటే.. దాన్ని వ్యతిరేకిస్తే ఎవరైనా ఏం చేస్తారు..? అడ్డుకుంటారా..? లేక రా.. రామ్మని స్వాగత సత్కారాలు చేస్తారా..? విశాఖ ఎయిర్‌ పోర్టులో ప్రజలు మొదట అడ్డుకున్నారు.. ఆ తర్వాత చంద్రబాబే దాదాపు 4 గంటల పాటు రోడ్డుపై భైఠాయించారని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు.

ప్రజలపై కాల్పులు జరపడం అంటే.. చాలా ఈజీలాగా కనిపిస్తున్నట్లుగా ఉంది రాధాకృష్ణకు. లేదా బాబును అమెరికా ప్రెసిడెంట్‌ ట్రంప్‌తో పోల్చుకుని ఆ విధంగా ఊహించుకుంటున్నారేమో గానీ.. భద్రతా సిబ్బంది మాత్రం ఒక దశలో కాల్పులు మొదలు పెట్టాల్సి వచ్చిందంటూ.. ఘటన తీవ్రత ఏ స్థాయిలో ఉందో చెప్పే ప్రయత్నం చేశారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బాబు గత ప్రభుత్వ హాయంలో బషీర్‌బాగ్‌లో రైతులపై కాల్పులను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఆ నాడు రైతులపై కాల్పులు జరిపినట్లే.. ఈ రోజు విశాఖకు తనను రానీయకుండా అడ్డుకున్న ఉత్తరాంధ్ర ప్రజలపై బాబు కాల్పులు జరిపించాలని భావించారా..? అందుకే రాధాకృష్ణ తన పత్రికలో అలా రాసుకున్నారేమోనని వ్యాఖ్యానిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి