iDreamPost

Andarivaadu : కొందరికే నచ్చిన అందరివాడు – Nostalgia

Andarivaadu : కొందరికే నచ్చిన అందరివాడు – Nostalgia

శిఖరమంత ఇమేజ్ ఉన్న స్టార్ హీరోలతో చేస్తున్నప్పుడూ ఏదీ తేలికగా తీసుకోకూడదు. వాళ్లకు ఇమేజ్ ఉంది కదా ఫ్యాన్స్ చూస్తారు కదాని కమర్షియల్ లెక్కలకు అతీతంగా ఏదైనా చేస్తే ప్రేక్షకులు నిర్మొహమాటంగా తిప్పి కొడతారు. ఇది ఎవరికైనా వర్తిస్తుంది. 2005. దర్శకుడు శీను వైట్లకు ఇండస్ట్రీలో మంచి పేరు వచ్చేసింది. ‘ఆనందం’ సూపర్ హిట్ తర్వాత సొంతం, ఆనందమానందమాయేలు ఫ్లాప్ అయినా రవితేజ ‘వెంకీ’ని డీల్ చేసిన తీరు అందరు హీరోలను ఆకట్టుకుంది. ముఖ్యంగా అందులో ఎంటర్ టైన్మెంట్ కి జనాలే కాదు మెగాస్టార్ కూడా ఫిదా అయ్యారు. అంతే ఆలస్యం చేయకుండా శ్రీనుకు కబురు పెట్టారు ఓ సినిమా చేద్దామని. అంతే ప్రాజెక్ట్ సెట్.

రచయిత భూపతిరాజా అంటే చిరంజీవికి మంచి గురి. తనకు ముఠామేస్త్రి లాంటి కథలను ఇచ్చిన గౌరవం ఉంది. అందుకే శ్రీను వైట్లతో మూవీ అనుకోగానే ఆయన స్టోరీకి కబురు వెళ్ళింది. తండ్రి కొడుకుల సెంటిమెంట్ తో మంచి మసాలా కమర్షియల్ స్క్రిప్ట్ సిద్ధం చేశారు. కోన వెంకట్ సంభాషణలు అందించారు. శంకర్ దాదా ఎంబిబిఎస్ తో అభిమానుల మనసులు కొల్లగొట్టిన దేవిశ్రీ ప్రసాద్ ట్యూన్స్ సిద్ధం చేశారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మాణంలో బడ్జెట్ పది కోట్లకు పైగానే అయ్యింది. అంతకు ముందు చిరుతో ఛాన్స్ మిస్ అయిన టబు తండ్రి చిరంజీవికి జోడిగా ఎంపిక కాగా కొడుకు సరసన బాలీవుడ్ నుంచి రిమి సేన్ ను తీసుకొచ్చారు

తాగుడుకి విపరీతమైన బానిసైన తండ్రికి, ఎంతో బాధ్యతగా జర్నలిస్ట్ ఉద్యోగం చేస్తున్న కొడుక్కు మధ్య ఎమోషనల్ కం ఎంటర్ టైన్మెంట్ డ్రామాగా దీన్ని శ్రీను వైట్ల రూపొందించారు. అయితే రెండు పాత్రలు తండ్రికొడుకులుగా కాకుండా అన్నదమ్ముల్లా కనిపించడం ఒక మైనస్ కాగా సెకండ్ హాఫ్ మొత్తం సునీల్ ఓవర్ కామెడీతో పాటు గోవిందరాజులు తాగుడు చుట్టే కథను సాగదీయడంతో ప్రేక్షకులకు అందరివాడు నచ్చలేదు. పాటలు కొంత వరకు పర్వాలేదనిపించినా బెస్ట్ ఆల్బమ్ కాలేకపోయింది. 2005 జూన్ 4న భారీ ఓపెనింగ్స్ తో విడుదలైన అందరివాడు టైటిల్ కు తగ్గట్టుగా కాక కొందవరివాడుగా ఫలితం దక్కించుకుంది

Also Read : Jeevana Jyothi : శోభన్ వాణిశ్రీల అభినయానికి మెచ్చుతునక – Nostalgia

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి