iDreamPost

రష్మి జబర్దస్త్ కు గుడ్ బై చెప్పనుందా? అసలు విషయం..

  • Author Soma Sekhar Published - 02:39 PM, Fri - 6 October 23
  • Author Soma Sekhar Published - 02:39 PM, Fri - 6 October 23
రష్మి జబర్దస్త్ కు గుడ్ బై చెప్పనుందా? అసలు విషయం..

టెలివిజన్ రంగంలో ఎన్నో కామెడీ షోలు, రియాలిటీ షోలు ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాయి. కానీ అందులో కొన్ని షోలు మాత్రమే ట్రెండ్ ను సృష్టిస్తాయి. అలా తెలుగు బుల్లితెరపై ట్రెండ్ ను సృష్టించిన షో ఏదైనా ఉందంటే? అది జబర్దస్త్ అనే చెప్పాలి. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను కడుపుబ్బా నవ్వించే ఏకైక షోగా జబర్దస్త్ పేరుగాంచింది. ఇక ఈ షో సూపర్ హిట్ కావడంతో ఎక్స్ ట్రా జబర్దస్త్ కూడా స్టార్ట్ చేశారు మేకర్స్. ఆ షో కూడా సూపర్ హిట్ అయ్యింది. ఈ షోకు రష్మి యాంకరింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జబర్దస్త్ కు యాంకర్ రష్మి గుడ్ బై చెప్పనుందని టాక్ వినిపిస్తోంది.

యాంకర్ రష్మి.. ఇటు యాంకర్ గా అటు నటిగా తన కెరీర్ ను ఫుల్ స్వింగ్ లో ఉండేలా చూసుకుంటోంది. ఇటీవలే మెగాస్టార్ నటించిన భోళా శంకర్ లో మెరిసింది రష్మి. ఇక తన యాంకరింగ్ తో తెలుగు ప్రేక్షకుల మనసులు కొల్లగొట్టింది ఈ చిన్నది. అదీకాక సుధీర్-రష్మి జోడీకి ప్రత్యేకించి ఫ్యాన్ బేస్ ఉందన్న సంగతి మనందరికి తెలియనిది కాదు. ఇదిలా ఉండగా.. తాజాగా రష్మికి సంబంధించిన ఓ వార్త వైరల్ గా మారింది. త్వరలోనే రష్మి ఎక్స్ ట్రా జబర్దస్త్ కు గుడ్ బై చెప్పనుందంట. దానికి కారణం ప్రస్తుతం ఆమెకు సినిమాల్లో వరుసగా ఆఫర్లు రావడమేనట. ఇటు మూవీలకు, అటు జబర్దస్త్ షోకు డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో రష్మి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక ఈ వార్త తెలిసినప్పటి నుంచి రష్మి ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. జబర్దస్త్ లో కామెడీతో పాటు రష్మి గ్లామర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. జబర్దస్త్ నుంచి కొన్ని నెలల కిందట అనసూయ తప్పుకున్న విషయం తెలిసిందే. అనసూయ సైతం ఇలాగే సినిమాల్లో బిజీగా ఉండటంతో జబర్దస్త్ నుంచి తప్పుకుంది. దీంతో కొన్ని రోజులు పాటు రష్మినే జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలకు యాంకరింగ్ చేసింది. ప్రస్తుతం జబర్దస్త్ యాంకర్ గా సౌమ్యారావు కొనసాగుతున్న విషయం తెలిసిందే. మరి జబర్దస్త్ నుంచి తప్పుకుంటోందన్న వార్తలపై రష్మి ఏవిధంగా స్పందిస్తుందో వేచిచూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Rashmi Gautam (@rashmigautam)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి