iDreamPost

వాళ్లు నా పేరు లేకుండా ఏమి చేయట్లేరు.. అనసూయ ట్వీట్ వైరల్!

  • Author ajaykrishna Published - 08:22 AM, Sat - 15 July 23
  • Author ajaykrishna Published - 08:22 AM, Sat - 15 July 23
వాళ్లు నా పేరు లేకుండా ఏమి చేయట్లేరు.. అనసూయ ట్వీట్ వైరల్!

స్టార్ యాంకర్, నటి అనసూయ గురించి పరిచయం అవసరం లేదు. కొన్నేళ్లపాటు టీవీ స్క్రీన్ పై అలరించిన ఈ భామ.. గ్లామరస్ యాంకర్ గా మంచి పేరు తెచ్చుకుంది. తన అందం, డాన్సింగ్ స్కిల్స్ తో ప్రేక్షకులకు బాగా దగ్గరైన అనసూయ.. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంటరై నటిగా బిజీ అయిపోయింది. చేతినిండా సినిమా అవకాశాలు రావడంతో అనసూయ.. కొంతకాలంగా బుల్లితెరకు దూరంగా ఉంటుంది. అయితే.. సోషల్ మీడియాలో అనసూయ గురించి ఎప్పుడూ ఏదొక రచ్చ నడుస్తూనే ఉంటుంది. కొన్నాళ్ళుగా వివాదాలకు ఏమాత్రం భయపడకుండా డేరింగ్ గా వాదనలకు దిగుతోంది అమ్మడు. ఎవరినైనా సోషల్ మీడియాలో వెంటనే కడిగిపారేయడం అనసూయకు అలవాటే.

ఎలాంటి గొడవలైనా తనంతట తానే స్వయంగా సాల్వ్ చేసుకునే అనసూయ.. ఈసారి ట్విట్టర్ లో మరో బాంబు పేల్చింది. ‘తన పేరు లేకుండా ఏమి డిస్కషన్ జరగదని.. కనీసం ఏమి మాట్లాడలేకపోతున్నారు’ అని ట్వీట్ చేసి హాట్ టాపిక్ గా మారింది. దీంతో అనసూయ ట్వీట్ ఎవరిని ఉద్దేశించి పెట్టిందంటూ సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. అనసూయ ట్వీట్ చేస్తూ.. “వావ్! నేను నిజంగా చాలా ఇంపార్టెంట్ అయ్యాను. నా ప్రమేయం ఉన్నా లేకపోయినా.. నాకు సంబంధం ఉన్నా లేకపోయినా.. నా పేరు తీయకుండా ఒక్క డిస్కషన్ కూడా జరగట్లేదంటే.. నా మీద ఎంతలా ఆధారపడి ఉన్నారో అర్ధం అవుతుంది. నా పేరు లేకుండా పాపం ఏది చెప్పలేకపోతున్నారు” అని చెప్పుకొచ్చింది.

దీంతో అసలు అనసూయ ఎందుకు ఈ ట్వీట్ పెట్టిందో.. ఎవరి గురించి పెట్టిందో అర్ధం కాక.. ‘మళ్లీ ఏమైంది?, మీతో మళ్లీ ఎవరు పెట్టుకున్నారు?’ అంటూ అడుగుతున్నారు నెటిజన్స్. అయితే.. అనసూయ ఇలాంటి ట్వీట్స్ పెట్టడం కొత్త కాదు. గతంలో కూడా పేర్లు మెన్షన్ చేయకుండా.. ఇండైరెక్ట్ గా ట్వీట్స్ పెట్టి దుమారం రేపిన విషయం తెలిసిందే. రీసెంట్ గా ఓ హీరో కొత్త సినిమా పోస్టర్ విషయంలోను అనసూయ రియాక్ట్ అయితే.. అది కాస్త కాంట్రవర్సీకి దారి తీసి సదరు హీరో ఫ్యాన్స్ అనసూయపై మండిపడ్డారు. అందులోనూ సినిమాల రిలీజ్ రోజు లేదా రిలీజ్ కి ముందురోజు అనసూయ ట్వీట్స్ పెడుతుండటం గమనార్హం. మరి అనసూయ లేటెస్ట్ ట్వీట్ పై మీ అభిప్రాయాలు కామెంట్స్ లో తెలపండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి