iDreamPost

Ananya Nagalla: పెళ్లిపై అనన్య నాగళ్ల షాకింగ్ కామెంట్స్.. ఇండస్ట్రీ వ్యక్తిని చేసుకోనంటూ..!

  • Published Mar 13, 2024 | 6:35 PMUpdated Mar 13, 2024 | 6:35 PM

టాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య నాగళ్ల సినిమా సినిమాకు తన ఇమేజ్​ను మరింత పెంచుకుంటున్నారు. త్వరలో ‘తంత్ర’ అనే చిత్రంతో ఆమె ఆడియెన్స్​ను పలకరించనున్నారు. ఈ బ్యూటీ మ్యారేజ్ మీద షాకింగ్ కామెంట్స్ చేశారు.

టాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య నాగళ్ల సినిమా సినిమాకు తన ఇమేజ్​ను మరింత పెంచుకుంటున్నారు. త్వరలో ‘తంత్ర’ అనే చిత్రంతో ఆమె ఆడియెన్స్​ను పలకరించనున్నారు. ఈ బ్యూటీ మ్యారేజ్ మీద షాకింగ్ కామెంట్స్ చేశారు.

  • Published Mar 13, 2024 | 6:35 PMUpdated Mar 13, 2024 | 6:35 PM
Ananya Nagalla: పెళ్లిపై అనన్య నాగళ్ల షాకింగ్ కామెంట్స్.. ఇండస్ట్రీ వ్యక్తిని చేసుకోనంటూ..!

టాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య నాగళ్లకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమె చేసింది తక్కువ సినిమాలే అయినా.. వాటిల్లో బాగా యాక్ట్ చేసి తానేంటో ప్రూవ్ చేసుకున్నారు. ‘మల్లేశం’ చిత్రంతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు ఈ బ్యూటీ. ఇందులో తన అందంతో, నటనతో అందర్నీ మెస్మరైజ్ చేశారు. ఈ క్రమంలో ఆమెకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. అయితే అనన్యకు మంచి ఫేమ్ తెచ్చింది మాత్రం పవర్​స్టార్ పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’ మూవీనే. ఇందులో ఆమె యాక్టింగ్​కు మంచి మార్కులు పడ్డాయి. బలమైన పాత్రలో ఆమె నటించిన తీరుకు ఆడియెన్స్ నుంచి ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న అనన్య.. ‘తంత్ర’ ఫిల్మ్​తో మరోమారు ప్రేక్షకుల్ని పలకరించనున్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తన పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

ప్రస్తుతం తనకు బాయ్​ ఫ్రెండ్ లేడన్న అనన్య నాగళ్ల.. లవ్ మ్యారేజ్ లేదా అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటానా అనేది కాలమే నిర్ణయిస్తుందని చెప్పారు. ఒకవేళ ప్రేమ పెళ్లి చేసుకుంటే మాత్రం ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిని మాత్రం అస్సలు చేసుకోబోనని స్పష్టం చేశారు. ‘మ్యారేజ్ గురించి ఇప్పుడేమీ ఆలోచించడం లేదు. ఒకవేళ లవ్ మ్యారేజ్ చేసుకుంటే మాత్రం ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిని చేసుకోను. చిత్ర పరిశ్రమలో ఉన్న కొందరికి పెళ్లి తర్వాత భార్య మీద ప్రేమ తగ్గిపోతుంది. ఇండస్ట్రీలో వివాహేతర సంబంధాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. మ్యారేజ్ తర్వాత వాడుకొని వదిలేస్తారు. అందుకే నేను పరిశ్రమలో కొనసాగుతున్న వారిని పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదు. అయితే ఇక్కడ ఉన్నవారు కొందరు ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్నారు. వాళ్ల ఆలోచన, మెచ్యూరిటీ, లైఫ్​ మీద ఉన్న అండర్​స్టాండింగ్ అంతా వేరు. ఈ జనరేషన్ వాళ్లకు అవేమీ లేవు’ అని అనన్య చెప్పుకొచ్చారు.

Ananya nagalla about her marriage

ఇండస్ట్రీలో ప్రస్తుత తరం వారికి జీవితం మీద పెద్దగా అవగాహన లేదని.. అందుకే ఇక్కడి వాళ్లపై తనకు అంతగా నమ్మకం లేదన్నారు అనన్య. ఇప్పుడు ఉన్న యువతలో సీరియస్​నెస్ అనేది లేదంటూ మ్యారేజ్ మీద తన అభిప్రాయాలను నిక్కచ్చిగా చెప్పేశారామె. తనకు కాబోయే వరుడు ఎలా ఉండాలో కూడా ఆ ఇంటర్వ్యూలో అనన్య తెలిపారు. అతడికి కచ్చితంగా గడ్డం ఉండాలని.. ఎత్తు, రంగు గురించి పెద్దగా పట్టించుకోనని, నిజాయితీగా ఉంటే చాలని ఆమె చెప్పుకొచ్చారు. ఇక, అనన్య యాక్ట్ చేసిన లేటెస్ట్ ఫిల్మ్ ‘తంత్ర’ మార్చి 15వ తేదీన బిగ్ స్క్రీన్స్​లో రిలీజ్ కానుంది. ఈ మూవీని డైరెక్టర్ శ్రీనివాస్ గోపిశెట్టి రూపొందించారు. హారర్ జోనర్​లో తెరకెక్కిన ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్, ట్రైలర్ సినిమా మీద భారీగా అంచనాలను పెంచేసింది. మరి.. పెళ్లిపై అనన్య చేసిన వ్యాఖ్యల మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Netflixలోకి 11 ఆస్కార్లు గెలిచిన చిత్రం.. ఒక్క ఫైట్ తో ప్రపంచాన్నే ఉపేశారు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి