iDreamPost

సూపర్ వైజర్ వేధింపులు తాళలేక రీసెర్చ్ స్కాలర్ ఆత్మహత్యాయత్నం

సూపర్ వైజర్ వేధింపులు తాళలేక రీసెర్చ్ స్కాలర్ ఆత్మహత్యాయత్నం

సూపర్ వైజర్ వేధింపులు భరించలేక మహిళా రీసెర్చ్ స్కాలర్ ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని అలీఘర్ లో జరగ్గా.. ఆలస్యంగా వెలుగుచూసింది. అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయానికి చెందిన రీసెర్చ్ స్కాలర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. ఈ ఘటనపై విచారణ చేసేందుకు ఇద్దరు వైస్ ఛాన్సలర్ తో కూడిన కమిటీని వేశారు. నబీలా ఖానమ్ అనే యువతి ఎఎమ్ యూకు చెందిన జవహర్ లాల్ నెహ్రూ వైద్య కళాశాలలో ఇంటర్ డిసిప్లినరీ బ్రెయిన్ రీసెర్చ్ సెంటర్లో పరిశోధనలు చేస్తోంది.

ప్రాజెక్ట్ థీసిస్ కు సంబంధించి సూపర్ వైజర్ నబీలా పై ఒత్తిడి తేవడంతో.. ఆమె ఆదివారం (మే22) రాత్రి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అపస్మారక స్థితిలో ఉన్న నబీలాను వెంటనే కళాశాల ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. నబీలా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఎఎమ్ యూ అధికార ప్రతినిధి ఉమర్ పీర్జాద్ వెల్లడించారు. నబీలా ఖానమ్ ను సూపర్ వైజర్ ఏ విధమైన ఒత్తిడికి గురిచేశారో, ఆమె ఎందుకు ఆత్మహత్యాయత్నం చేసిందో.. కమిటీ విచారణలో తేలాల్సి ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి