iDreamPost

చంద్రబాబు దుర్మార్గపు పాలనలో పవన్ పాత్ర ఉంది: మంత్రి అంబటి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల శాఖమంత్రి అంబటి రాంబాబు వైసీపీ కీలక నేతల్లో ఒకరు. ఆయన తరచూ ప్రతిపక్షాలపై తనదైన స్టైల్ విమర్శిస్తుంటారు. ముఖ్యంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ లపై ఓ రేంజ్ లో సెటైర్లు వేస్తుంటారు. తాజాగా మరోసారి వారిద్దరిపై మంత్రి కీలక వ్యాఖఅయలు చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల శాఖమంత్రి అంబటి రాంబాబు వైసీపీ కీలక నేతల్లో ఒకరు. ఆయన తరచూ ప్రతిపక్షాలపై తనదైన స్టైల్ విమర్శిస్తుంటారు. ముఖ్యంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ లపై ఓ రేంజ్ లో సెటైర్లు వేస్తుంటారు. తాజాగా మరోసారి వారిద్దరిపై మంత్రి కీలక వ్యాఖఅయలు చేశారు.

చంద్రబాబు దుర్మార్గపు పాలనలో పవన్ పాత్ర ఉంది: మంత్రి అంబటి

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టారు. అన్ని వర్గాల ప్రజలకు ఆర్థిక భరోసాను కల్పించాడు. విద్యా, వైద్యరంగలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. అయితే ప్రతిపక్ష టీడీపీ మాత్రం జగన్ పై అసత్య ప్రచారాలు, ఆరోపణలు చేస్తుందని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఇలా టీడీపీ నేతలు సీఎం జగన్ పై వ్యాఖ్యలు చేస్తుంటే..వారికి ధీటుగా వైసీపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. ఇప్పటికే పలువురు మంత్రులు చంద్రబాబు చేసే రాజకీయం అంత కుట్రలు, కుతంత్రాలేనంటూ, ఎందరోని మోసం చేశారంటూ దుయ్యబట్టారు. తాజాగా రాష్ట్ర నీటిపారుదల శాఖమంత్రి అంబటి రాంబాబు.. చంద్రబాబు, పవన్ లపై  ఫైర్ అయ్యారు. బాబు దుర్మార్గపు పాలనలో పవన్ పాత్ర ఉందన్నారు.

మంగళవారం తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం పెనకన మెట్ట గ్రామంలో మంత్రులు అంబటి రాంబాబు, తానేటి వనిత పర్యటించారు.  అక్కడ రూ.1.35 కోట్లలతో నిర్మించిన సీసీ రోడ్లు, రైతుభరోసా కేంద్రం, సచివాలయ భవనాన్ని మంత్రులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నారు. కాబట్టే మళ్లీ సీఎం గా జగనే కావాలని పేదల కోసం  ఆయన నిరంతరం ఆలోచిస్తున్నారని రాంబాబు అన్నారు. చంద్రబాబు మహిళలను మోసం చేశాడని, బంగారు రుణాలు మాఫీ అంటూ చేతులెత్తేశాడని తెలిపారు. చంద్రబాబు దుర్మార్గపు పాలనలో పవన్ కల్యాణ్ పాత్ర ఉందని అంబటి దుయ్యబట్టారు. సీఎం జగన్ ఇచ్చిన హామీలను అన్ని అమలు చేశారని, అభివృద్ధి ఫలాలు ప్రతి గ్రామానికి అందిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.

” వై ఏపీ నీడ్స్ జగన్ అని ప్రజల్లోకి వెళ్తున్నాం. ఏ రాష్ట్రాల్లో కూడా అమ్మఒడి లాంటి పథకం లేదు. పేదల కోసం శ్రమిస్తున్న సీఎం జగన్ రాష్ట్రానికి కావాలి. ఆయనే మరలా రాష్ట్రానికి సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. 2024లో పేదలకు,పెత్తందారులకు మధ్య ఎన్నిక జరుగుతుంది. పేదల తరపున పోటీ  చేసి గెలిచే వ్యక్తి సీఎం జగన్. పవన్ కల్యాణ్ చంద్రబాబును భుజానికి ఎత్తుకున్నా గెలిచేది జగనే” అని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.  ఇదే కార్యక్రమంలో హోంమంత్రి తానేటి వనిత ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి, అభివృద్ధి పనుల గురించి వివరించారు. పేదవారి కోసం జగనన్న కష్టపడుతున్నారు. కాబట్టే మరోసారి ఆయన సీఎం కావాలని ఆమె తెలిపారు. మరి.. చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి