iDreamPost

వచ్చేస్తోంది అమెజాన్ ప్రైమ్ డే 2022 – బంపర్ డిస్కౌంట్లు కావాలా??

వచ్చేస్తోంది అమెజాన్ ప్రైమ్ డే 2022 – బంపర్ డిస్కౌంట్లు కావాలా??

ఆన్ లైన్ షాపింగ్ ప్రియులకు ఇది నిజంగా శుభవార్తే.. ఎందుకంటే వచ్చేవారం భారతదేశంలో అమెజాన్ ప్రైమ్ డే 2022 సేల్ ప్రారంభం కానుంది. జూలై 23న శనివారం ఉదయం 12:00 గంటలకు మొదలయ్యే ఈ సేల్.. మరుసటి రోజు జూలై 24న ముగుస్తుంది. ఇప్పుడు ఈ సేల్ లో అదిరిపోయే ఆఫర్లతో ముందుకొస్తున్నాయి టాప్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్లు.

 

వన్ ప్లస్

ఈ సేల్ లో రూ.37,999 ఉన్న వన్ ప్లస్ 9 సిరీస్ 5జీపై దాదాపు రూ.15,000 వరకు తగ్గింపు పొందవచ్చు. వన్ ప్లస్ 10ఆర్ 5జీ, వన్ ప్లస్ 10ప్రో 5జీపై 9 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ, కూపన్లపై రూ.4000, ఎక్స్ ఛేంజ్ పై  రూ.7000 వరకు తగ్గే అవకాశం ఉంది. వన్ ప్లస్ 10ఆర్ కూపన్లతో సహా రూ .34999కు , అదనపు బ్యాంక్ ఆఫర్లతో పాటు 4000 అదనపు ఎక్స్ ఛేంజ్ ను  పరిమితకాల ఆపర్ గా పొందండి.

 

షియోమీ

ఈ సేల్ లో షియోమీ ఫోన్లు దాదాపు 40 శాతం డిస్కౌంట్ తో లభ్యమవుతున్నాయి. రెడ్ మీ 9 సిరీస్ ను రూ.600 వరకు కూపన్ లతో  రూ.6,899 కే పొందండి. దీంతో పాటుగా రెడ్ మీ నోట్ 10టీ 5జీ, రెడ్ మీ నోట్ 10 ప్రో, రెడ్ మీ నోట్ 10 ప్రో, రెడ్ మీ నోట్ 10ఎస్ వంటి రెడ్ మీ నోట్ 10 సిరీస్ లపై వెంటనే అదనపు డిస్కౌంట్లతో  రూ.10,999 నుంచి పొందచ్చు. షియోమీ 11 లైట్, షియోమీ 11టీ ప్రో, షియోమీ 12 ప్రో వంటి మోడళ్ళ పైన దాదాపు రూ.6000 విలువైన కూపన్లతో అదనపు ప్రయోజనాలను పొందండి.

 

శాంసంగ్

శాంసంగ్ గెలాక్సీ ఎస్ 21 ఎఫ్ఈపై 30 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. ఇతర మోడల్స్ పైన గొప్ప డిస్కౌంట్ రైట్లను సైతం పొందే అవకాశం ఉంది. శాంసంగ్ గెలాక్సీ ఎం52 5జీపై దాదాపు రూ.15,000 తగ్గింపు. శాంసంగ్ గెలాక్సీ ఎం53 5జీపై రూ.8,000 వరకు, శాంసంగ్ గెలాక్సీ ఎం33 5జీపై రూ.8,000 వరకు తగ్గింపుతో లభ్యమవుతున్నాయి.

 

రియల్ మీ

రియల్ మీ ఫోన్లపై ఈసారి రూ .6000 వరకు డిస్కౌంట్లు పొందే అవకాశం ఉంది. నార్జో 50 5జి, నార్జో 50 ప్రో , నార్జో 50 ఎ ప్రైమ్ వంటి మోడల్స్ రూ .11499 నుంచే పొందచ్చు. వీటితో పాటు తక్షణ డిస్కౌంట్లను సైతం రియల్ ఫోన్ల ద్వారా పొందచ్చు.

 

యాపిల్ ఐఫోన్లు

ఇక అందరూ ఎదురు చూసే ఐఫోన్లపై రూ.20,000 వరకు తగ్గింపు లభిస్తోంది. ఐఫోన్ 13, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ లపై గొప్ప డీల్స్ ను అందిస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి