iDreamPost

మెట్రో రైల్ ప్రాజెక్టు పేరు మారుస్తూ జీవో జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

మెట్రో రైల్ ప్రాజెక్టు పేరు మారుస్తూ జీవో జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

తాజాగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.జగన్ ప్రభుత్వం అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరును ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్‌గా మారుస్తూ జీవో విడుదల చేసింది. రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో చేపట్టిన మెట్రో ప్రాజెక్టుల పాలన సౌలభ్యం కోసం పేరు మార్చినట్లు జీవోలో ప్రభుత్వం పేర్కొంది.విశాఖ మెట్రో ప్రాజెక్ట్‌కు కూడా అమరావతి మెట్రో రైల్ ప్రాజెక్ట్ పేరే ఉండటం వలన పేరు మార్చినట్లు ప్రకటించారు. గతంలో కూడా దేశంలో వివిధ రాష్ట్రాలలో మెట్రో రైల్ ప్రాజెక్ట్‌ల పేర్లు మార్చినట్లు ఏపీ గవర్నమెంట్ తెలిపింది. నాగపూర్ మెట్రో ప్రాజెక్ట్ పేరును మహారాష్ట్ర మెట్రో రైల్ ప్రాజెక్ట్ లిమిటెడ్‌గా మార్పు చేసిన సంగతిని జీవోలో ఉదాహరించారు.

లక్నో మెట్రో ప్రాజెక్ట్ పేరును ఉత్తరప్రదేశ్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ లిమిటెడ్‌గా మార్చారని తెలిపింది. విభజిత ఆంధ్రప్రదేశ్ లో 2014లో అధికారం చేపట్టిన తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రంలో మెట్రో రైలు ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టే ప్రయత్నాలు ప్రారంభించింది. అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరుతో అమరావతి, విజయవాడ,విశాఖపట్నం నగరాలలో మెట్రో నిర్మాణం చేపట్టాలని భావించింది.కానీ మెట్రో ప్రాజెక్టు నిర్మాణ పనులపై కొంత కసరత్తు చేసినప్పటికీ నాటి తెదేపా ప్రభుత్వం పనులు ప్రారంభించలేదు. 2019 ఎన్నికలలో అఖండ విజయంతో అధికారం చేపట్టిన జగన్ ప్రభుత్వం ఈ మెట్రో ప్రాజెక్ట్‌ నిర్మాణంపై దృష్టి సారించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి