iDreamPost

ఇలాంటి దినేషులు తన రాష్ట్రంలో ఉండకూడదనే జగన్ గారి ఆలోచన.

ఇలాంటి దినేషులు తన రాష్ట్రంలో ఉండకూడదనే జగన్ గారి ఆలోచన.

పశ్చిమ గోదావరి జిల్లా నక్కవారి పాలెంలో మధ్యానికి బానిసై తమ వారు ప్రాణాలు కోల్పొతున్నారని తమ ఉరిలో మధ్యందుకాణం ఉండటానికి వీలేదని ఊరిలో ఉన్న మహిళలు అంతా ఏకమై నినదించారు. ఇలా నక్కవారి పాలెం ఉద్యమమే కాదు దూబగుంట రోసమ్మ దగ్గర నుంచి చివటంలో అచ్చాయమ్మ వరకు ఈ మధ్యం మహమ్మారి తమ జీవితాలను నాశనం చేస్తుందని మొత్తుకున్నా గత ప్రభుత్వాలు పాలకులు వారి మాటని పెడ చెవిన పెడుతూనే వచ్చాయి. ఇలా ఒక్క ఆంద్రప్రదేశ్ లోనే కాదు , దేశంలోనే బడుగు బలహీన మధ్యతరగతి కుటుంభాలకు మధ్యం అనేది ఒక మహమ్మారి. తమిళనాడు లో దినేష్ అనే 9వ తరగతి విధ్యార్ధి తండ్రి మధ్యానికి బానిసైతే తట్టుకోలేక , నా చావు తో అయిన మధ్యాన్ని నిషేదిస్తారని ఆశిస్తున్న అని తమిళనాడు ముఖ్యమంత్రికి లేఖ రాసి ఆత్మహత్య చేసుకొన్నాడంటే మధ్యం అనేది సామాన్యుల జీవితాలను ఎంతలా కుదిపేస్తుందీ అర్ధం చేసుకోవచ్చు.

మధ్యం సగటు బడుగు జీవి జీవితాన్ని ఎలా చిదిమేస్తుందో చెప్పటానికి ఇప్పటికే అనేక అధ్యయనాలు అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకి దేశంలో దాదాపు 16 కోట్ల మందికి మద్యం అలవాటు ఉన్నట్లు అందులో 6 శాతం ఆంధ్ర ప్రదేశ్‌లో ఉనట్టు ఒక అద్యాయనం స్పష్టం చేసింది. ప్రపంచంలో ప్రతి 20 మరణాల్లో ఒకటి మద్యపానం వల్ల సంభవిస్తున్నాయని నివేదికలు చెబుతున్నాయి. ప్రజల ప్రాణాలను హరిస్తూ కుటుంబాలకు కుటుంభాలనే సర్వ నాశనం చేస్తున్న ఇలాంటి మహమ్మారిని గుజరాత్, మిజోరం, నాగాలాండ్, బీహార్ రాష్ట్రాల్లో మాదిరి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పూర్తిస్థాయిలో నిషేధం విధించే వరకు అనేక చర్యలు తీసుకుంటాము అని జగన్ తాను రాజకీయ ఆరంగేట్రం చేసిన దగ్గరనుండి చెప్పుకుంటూనే వస్తున్నారు.

అందులో భాగంగా తాను ముఖ్యమంత్రి గా భాద్యతలు చేపట్టగానే జగన్ కొత్తగా మద్యం పాలసీని ప్రకటించారు, మొదట 4,380గా ఉన్న మద్యం దుకాణాల సంఖ్యను 20 శాతం తగ్గించడంతో పాటు వైన్ షాపుల వేళలు కూడా మార్పు చేశారు, ఉదయం 11 నుంచి రాత్రి 8 గంటల వరకూ దుకాణాలు తెరిచి ఉంచేందుకు మాత్రమే అనుమతులు ఇచ్చారు, పర్మిట్ రూంలను, గ్రామాల్లో బెల్ట్ షాపులు కూడా పూర్తిగా తొలగించారు. ధరలను అమాంతం పెంచేసారు, ప్రభుత్వం నిర్వహించే మద్యం దుకాణాల్లో 16,000 కొత్త ఉద్యోగులను తీసుకుని అక్రమ మధ్యం అమ్మకాలకి అడ్డుకట్ట వేశారు. దీంతో ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ కొత్త మద్యం పాలసీ వలన మందుబాబులకు నిజoగానే జగన్ చెప్పిన విధంగా షాక్ కొట్టింది , దీనికి నిదర్శనంగా రాష్ట్రంలో భారీగా మద్యం అమ్మకాలు తగ్గాయి.

2018 నవంబర్‌లో 29 లక్షల 62 వేల కేసుల లిక్కర్‌ను విక్రయించగా.. 2019 నవంబర్‌ వచ్చేసరికి అవి 22 లక్షల 31 వేల కేసులకు అమ్మకం పడిపొయింది, అంటే ప్రభుత్వం విధానం వలన 24 శాతం మద్యం అమ్మకాలు పడిపోయినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక బీర్ల అమ్మకాల విషయానికి వస్తే 2018 నవంబర్‌లో 17 లక్షల 80 వేల కేసులు అమ్ముడుపోగా, 2019 నవంబర్‌ వచ్చేసరికి అవి 8 లక్షల 13 వేల కేసులను మాత్రమే విక్రయించారు. దీంతో 54 శాతం బీర్ల అమ్మకాలు కూడా భారిగా తగ్గుముఖం పట్టాయి. ఇది ముఖ్యమంత్రి జగన్ మద్యం మహమ్మారిపై సాదించిన తొలి విజయం అని చెప్పవచ్చు. \

అయితే తాజాగా లాక్ డౌన్ సడలింపు నిర్ణయంతో కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా మద్యం ఉత్పత్తికి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో రాష్ట్రంలో మద్యం షాపులు తెరుచుకున్నాయి, అయితే మధ్యం అమ్మకాలకు ప్రభుత్వం కొన్ని మార్గనిర్దేశాలను తప్పనిసరిగా పాటించాలని సూచించింది ప్రతి రోజూ ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మద్యం అమ్మకాలకు అనుమతించినట్లు, మద్యం షాపుల వద్ద గుంపులుగా ఉండటానికి వీల్లేదని, తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలని, ఒక్కో విడతలో కేవలం ఐదుగురినే అనుమతిస్తామని, మాస్క్‌ లేనిదే మద్యం దుకాణాల దగ్గరకు వచ్చేందుకు అనుమతి లేదని, కంటైన్మెంట్‌ జోన్ల బయట మాత్రమే మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చామని, అలాగే రాష్ట్రంలో మద్యం ధరలను 25 శాతం మేరకు పెంచినట్లు, రానున్న రోజుల్లో మద్యం దుకాణాల సంఖ్య ఇరవై ఐదు శాతం తగ్గించాలని నిర్ణయం తీసుకునట్టు చెప్పుకొచ్చారు.

ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న మధ్యం పాలసీ నిర్ణయాలతో మద్యానికి మందుబాబులు దూరమవుతునట్టు మధ్యం అమ్మకాల పట్టిక చెబుతుంటే ఇప్పుడు ప్రభుత్వం నిర్దేశించిన ఈ పరిమితులతో మధ్యం తాగే వారు ధరను దృష్టిలో పెట్టుకుని మితిమీరి సేవించకుండా ఉండటంతో పాటు, మధ్యం అమ్మకాలు కూడా మరింత గణనీయంగా తగ్గే అవకాశం ఉందని, అలాగే మద్య పాన ప్రియులకు అన్ని రకాల బ్రాండ్లు అందుబాటులో ఉండే అవకాశం లేదని, దీంతో జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు దశల వారీగా మధ్యాన్ని నిషేదిస్తూ, రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో మధ్య నిషేధం విదించేలా అడుగులు పడుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.

అయితే ప్రతిపక్షాలు మాత్రం బడుగు బలహీన మధ్యతరగతి కుటుంభాల్లో మధ్యం వలన జరుగుతున్న నష్టాన్ని పట్టించుకోకుండా జగన్ ప్రభుత్వం మధ్యం ధరలు పెంచి పెదవాడి జేబుకు చిల్లు పెడుతున్నాడని , అన్ని బ్రాండ్లు అందుబాటులో లేకుండా చేసి అన్యాయం చేస్తున్నాడని విమర్శలు చేస్తున్నారు. తమిళనాడు లో జరిగిన దినేష్ లాంటి ఘటనలు తన రాష్ట్రంలో ఉండకూడదని జగన్ గారు ఆలోచిస్తుంటే తెలుగుదేశం వాళ్ళకి జగన్ గారి పాలనలో పేదవాడి ఉల్లాసానికి పెగ్గులు ఆ పెగ్గులులో రకాలు , అందుకు అయ్యే ఖర్చులు ఎక్కువ అయ్యాయి అని మాత్రమే కనపడటం విచారకరం. పేదలు తాగుడు వదలాలి కుటుంభం తో సంతోషంగా గడపాలి అనే ఆలోచనలో ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుంది, ప్రతిఒక్కరు రాజకీయాలను పక్కకు పెట్టి తమ సామాజిక భాద్యతగా సహకరిస్తేనే పేదవాడి జీవితం నుండి ఈ మధ్యం మహమ్మారిని తరిమెయ్యగలం అని గ్రహించాల్సిన ఆవస్యకత ఎంతైనా ఉంది…

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి