iDreamPost

‘అల’వోకగా ఆల్ టైం రికార్డు – ఫస్ట్ వీక్ కలెక్షన్

‘అల’వోకగా ఆల్ టైం రికార్డు – ఫస్ట్ వీక్ కలెక్షన్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందిన అల వైకుంఠపురములో బాక్స్ ఆఫీస్ వద్ద సునామి సృష్టిస్తోంది. ఇప్పటికే ఫస్ట్ వీక్ నాన్ బాహుబలి రికార్డులు సొంతం చేసుకున్న ఈ సినిమా రెండో వారంలోకి అడుగు పెట్టె లోపే 100 కోట్ల షేర్ సాధించి కొత్త రికార్డులను టార్గెట్ చేస్తోంది. తెలుగు రాష్ట్రాలే కాదు ఓవర్సీస్ లోనూ దుమ్ము దులుపుతున్న బన్నీ మూవీకి ఇప్పట్లో బ్రేకులు పడేలా లేవు. త్రివిక్రమ్ దర్శకత్వ ప్రతిభకు తోడు అతని మాటల మాయాజాలానికి ప్రేక్షకులు విపరీతంగా కనెక్ట్ అవుతున్నారు. సంక్రాంతి పండగ మొదటి వారం మొత్తం ప్రతి చోటా హౌస్ ఫుల్ బోర్డులు పడ్డాయంటే దానికి కారణం ఇదే. మాములుగా మాస్ తక్కువ కనెక్ట్ అయ్యే త్రివిక్రమ్ సినిమాలకు భిన్నంగా అల వైకుంఠపురములో అందరిని మెప్పిస్తోంది.

కొన్నేళ్ళ క్రితం పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది వేవ్ మళ్ళి కనిపిస్తోందని ట్రేడ్ సైతం వసూళ్ళ పట్ల పిచ్చ హ్యాపీగా ఉంది. యూనిట్ తరఫున ఈ రోజు అధికారిక పోస్టర్ కూడా వచ్చేసింది. అందులో నూటా నాలుగు కోట్ల షేర్ గా పేర్కొన్నారు. పాటలు, నేపధ్య సంగీతం, ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్, కథలో ఉన్న టెంపో ఇవన్ని కలగలిసి త్రివిక్రమ్ బన్నీలు ఎంతో కసిగా ఎదురు చూసిన విజయాన్ని బంగారు పళ్ళెంలో అందజేసింది. ఫైనల్ రన్ పూర్తయ్యాక అల వైకుంఠపురములో ఆల్ టైం టాప్ 3లో ఉండటం దాదాపు ఖాయమే. లెక్కల పరంగా సరిలేరు నీకెవ్వరు సైతం ఇలాంటి ఫిగర్స్ తోనే పబ్లిసిటీ వేగాన్ని పెంచింది. ఎవరు రైట్ అనేది పక్కన పెడితే తెలుగు ప్రేక్షకులకు మాత్రం రెండు సినిమాలు ఫుల్ మీల్స్ లా నిలిచాయి.

ఏరియా వారి మొదటి వారం వసూళ్లు :

ఏరియా  షేర్ 
నైజాం  24.20cr
సీడెడ్  13.70cr
ఉత్తరాంధ్ర  12.10cr
గుంటూరు  7.20cr
క్రిష్ణ  6.50cr
ఈస్ట్ గోదావరి  6.55cr
వెస్ట్ గోదావరి  6.20 cr
నెల్లూరు  2.90cr
ఆంధ్ర+తెలంగాణా  79.35cr
కర్ణాటక + ROI  9.50cr
ఓవర్సీస్  13cr
ప్రపంచవ్యాప్తంగా 101.85cr

– ఆల్ టైం రికార్డు మొదటి వారం కలెక్షన్స్ లో (నాన్ బాహుబలి)

(GST రిటర్న్స్ మినహా)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి