iDreamPost

తెలివిగా తప్పుకుంటున్న ఏజెంట్

తెలివిగా తప్పుకుంటున్న ఏజెంట్

ఆ మధ్య సంక్రాంతికే విడుదల చేస్తామని ఏజెంట్ టీమ్ ఒక పోస్టర్ ని రిలీజ్ చేసింది కానీ నిజానికి ఆ మాటకు కట్టుబడే ఉద్దేశం లేదని ఫ్రెష్ అప్డేట్. అఖిల్ కెరీర్ లోనే హయ్యెస్ట్ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ భారీ స్థాయిలో ప్యాన్ ఇండియా రేంజ్ లో రూపొందింది. సైరా నరసింహారెడ్డి తర్వాత దర్శకుడు సురేందర్ రెడ్డి చాలా సమయం ఖర్చు పెట్టి మరీ ఈ స్క్రిప్ట్ ని తీర్చిదిద్దారు. ఇలాంటి కీలకమైన ప్రాజెక్టుని రిలీజ్ డేట్ కోసం రిస్క్ లో పెట్టకూడదనే ఉద్దేశంతో పొంగల్ రేస్ నుంచి తప్పించడం లాంఛనమే. ఆది పురుష్ వాయిదా ముందే ఊహించింది కానీ చిరు బాలయ్యలలో ఒకరు డ్రాప్ అయితే అప్పుడు ఏజెంట్ వచ్చే ఛాన్స్ ఉండేది.

Revealed: Major Highlight of Agent

వాల్తేర్ వీరయ్య, వీరసింహారెడ్డిలు వెనక్కు తగ్గే సూచనలు ఏ మాత్రం లేకపోవడంతో ఏజెంట్ వాటితో తలపడేందుకు ఇష్టపడటం లేదు. పైగా విజయ్ వారసుడు, అజిత్ తునివులు తమిళనాడు కేరళలో అత్యధిక థియేటర్లను ఆక్రమించుకోబోతున్నాయి. అలాంటప్పుడు ఆ రాష్ట్రాల్లో ఏజెంట్ కి స్క్రీన్లు దొరకడం పెద్ద రిస్క్ అవుతుంది. దానికి బదులు శివరాత్రికి ఫిబ్రవరి 16 తేదీ పరిశీలనలో ఉందట. ప్రస్తుతానికి ఆ స్లాట్ లో కిరణ్ అబ్బవరం వినరో భాగ్యము విష్ణుకథ, ధనుష్ సర్ లు కన్ఫర్మ్ చేసుకున్నాయి. వాటిని ఏజెంట్ సీరియస్ గా తీసుకోడు కాబట్టి మంచి ఓపెనింగ్స్ ని టార్గెట్ చేసుకోవచ్చు. పోస్ట్ ప్రొడక్షన్ ఒక కొలిక్కి వచ్చాక అఫీషియల్ కన్ఫర్మేషన్ రావొచ్చు.

Vaartha Online Edition ముఖ్యాంశాలు -అఖిల్ అక్కినేని `ఏజెంట్` ఆగస్టు 12న రిలీజ్

మొత్తానికి టాలీవుడ్ రిలీజుల పరిణామాలు అనూహ్యంగా మారుతున్నాయి. ఆది పురుష్ ఏకంగా ఏడు నెలలు పోస్ట్ పోన్ చేశాక సలార్ కూడా ఇరకాటంలో పడింది. డిసెంబర్ లోనూ పెద్దగా సందడి ఉండకపోవచ్చు జనవరి చివరి వారంలో షారుఖ్ ఖాన్ పఠాన్ ఉంది కాబట్టి సంక్రాంతి నుంచి మొదలుపెడితే రిపబ్లిక్ డే దాకా మధ్యలో ఉండే స్లాట్లు ఖాళీగా ఉండబోతున్నాయి. ఏజెంట్ లో మమ్ముట్టి ప్రధాన పాత్ర చేయడంతో మల్లువుడ్ లోనూ దీనికి మంచి క్రేజ్ ఉంది. ఎప్పుడో ఆరేళ్ళ క్రితం ఇండస్ట్రీకి వచ్చిన అఖిల్ కు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రూపంలో ఒక డీసెంట్ హిట్ ఉంది తప్ప ఇంకా మేజర్ బ్రేక్ త్రూ రాలేదు. అందుకే ఫ్యాన్స్ ఆశలన్నీ ఈ ఏజెంట్ మీదే ఉన్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి