iDreamPost

ట్విస్టుల మీద ట్విస్టులు.. అఖిల్ ‘ఏజెంట్’ ఓటీటీ రిలీజ్ మళ్లీ వాయిదా!

  • Author singhj Published - 03:27 PM, Thu - 28 September 23
  • Author singhj Published - 03:27 PM, Thu - 28 September 23
ట్విస్టుల మీద ట్విస్టులు.. అఖిల్ ‘ఏజెంట్’ ఓటీటీ రిలీజ్ మళ్లీ వాయిదా!

అక్కినేని వారసుడు అఖిల్​కు యూత్​ ఆడియెన్స్​లో మంచి క్రేజ్ ఉంది. ఆయన లుక్స్, డ్యాన్స్, స్టైల్​కు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. కానీ దీనికి తగ్గట్లు ఆయనకు హిట్స్ పడట్లేదు. ఎన్ని చిత్రాలు చేసినా ఒక్కటీ బ్లాక్​బస్టర్ హిట్ కాలేదు. స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే సరసన నటించిన ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’ మాత్రం మంచి విజయాన్ని సాధించింది. భారీ బడ్జెట్​తో తెరకెక్కిన ‘ఏజెంట్’ మూవీ అఖిల్​ను కోలుకోలేని దెబ్బ తీసింది. ఈ ఫిల్మ్ ఆయన కెరీర్​లో అట్టర్ ఫ్లాప్​గా నిలిచింది. ఈ చిత్రం రిలీజై ఐదు నెలలైంది. అయినా ఇంకా ఓటీటీలోకి రాలేదు.

మామూలుగా సినిమాలు విడుదలైన ఆరేడు వారాల్లో ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. కొన్ని హిట్ మూవీస్ అయితే రిలీజైన మూడ్నాలుగు వారాల్లోనే డిజిటల్ స్ట్రీమింగ్​కు రావడం గమనార్హం. కానీ ‘ఏజెంట్’ మాత్రం విడుదలై ఐదు నెలలైనా ఇంకా ఓటీటీలోకి రాలేదు. ఇప్పటికే పలుమార్లు ఓటీటీలోకి వస్తుందని వార్తలు వచ్చాయి. కానీ అవేవీ నిజం కాలేదు. ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందంటూ ఇటీవల స్వయంగా మూవీ మేకర్స్​ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా విషయంలో మరో ట్విస్టు వచ్చింది.

విశాఖపట్నంకు చెందిన డిస్ట్రిబ్యూటర్ బత్తుల సత్యనారాయణ (వైజాగ్ సతీష్) ‘ఏజెంట్’ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ విషయంలో అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించారు. ఈ చిత్ర నిర్మాత అనిల్ సుంకర తనను మోసం చేశారంటూ హైదరాబాద్ సివిల్ కోర్టులో సతీష్ కంప్లయింట్ చేశారు. ఈ కేసులో వాదనలు విన్న న్యాయస్థానం సెప్టెంబర్ 29న ‘ఏజెంట్’ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కాకుండా స్టే విధించింది. దీంతో ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కోసం ఆశగా ఎదురుచూసిన అఖిల్​ అభిమానులు నిరాశకు గురవుతున్నారు.

ఇదీ చదవండి: ప్రభాస్ సరసన శ్రీలీల.. కాదనేలక నిజం చెప్పేసిన దర్శకుడు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి