iDreamPost

Akhil Akkineni : నాన్న రూట్లోనే వారసుడు కూడా

Akhil Akkineni : నాన్న రూట్లోనే వారసుడు కూడా

గత ఏడాది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో డీసెంట్ హిట్ అందుకున్న అఖిల్ ప్రస్తుతం ఏజెంట్ చేస్తున్న సంగతి తెలిసిందే. సైరా తర్వాత దర్శకుడు సురేందర్ రెడ్డి టేకప్ చేసిన ప్రాజెక్ట్ ఇదే. యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో స్పై థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ ఆగుతూ సాగుతూ వెళ్తోంది. స్క్రిప్ట్ లో ఏవో మార్పులు జరిగాయని అందుకే కొంత ఆలస్యమవుతోందనే వార్తలు వచ్చాయి కానీ యూనిట్ కానీ డైరెక్టర్ కానీ వాటిని ధ్రువీకరించలేదు. ఈ ఏడాది డిసెంబర్ కి రిలీజ్ టార్గెట్ పెట్టుకున్నారు. అసాధ్యం కాదు కానీ ఫిక్స్ చేసుకున్న ప్రకారం షెడ్యూల్స్ కనక పూర్తి చేస్తే నాన్నకు బాగా కలిసి వచ్చిన ఆ నెల సెంటిమెంట్ ని అఖిల్ కూడా వాడుకోవచ్చు.

ఇక అసలు విషయానికి వస్తే అఖిల్ బాలీవుడ్ డెబ్యూకి రంగం సిద్ధం చేయబోతున్నట్టు ముంబై టాక్. ఏజెంట్ పాన్ ఇండియా మూవీనే అయినప్పటికీ హిందీలో డబ్బింగ్ వెర్షన్ ఉంటుంది. దాన్ని స్ట్రెయిట్ కిందకు పరిగణించలేం. నిర్మాత కరణ్ జోహార్ అఖిల్ కోసమే ప్రత్యేకంగా ఓ సబ్జెక్టు సిద్ధం చేయిస్తున్నట్టు తెలిసింది. దర్శకుడు ఇంకా ఫైనల్ కాలేదు కానీ స్క్రిప్ట్ లాక్ అయ్యాక అతన్ని సెట్ చేయడం ఏమంత పెద్ద పని కాదు. పైగా ధర్మ ప్రొడక్షన్స్ అంటే నో చెప్పేవాళ్ళు ఎవరుంటారు. కాకపోతే ఏజెంట్ కంప్లీట్ చేయడానికి ఎంత లేదన్నా ఆరేడు నెలలు పడుతుంది కాబట్టి ఆలోగా ఈ పనులు సెట్ చేయొచ్చు.

ఇదంతా చూస్తుంటే అఖిల్ ఆలోచనా ధోరణి తండ్రి లాగే కనిపిస్తోంది. విక్రమ్ తో ఎంట్రీ ఇచ్చిన నాగ్ కేవలం ఐదేళ్లకే శివతో హిందీ సినిమాలు చేయడం మొదలుపెట్టారు. ద్రోహి, ఖుదా గవా, మిస్టర్ బేచారా, అంగారే, అగ్ని వర్ష, ఎల్ఓసి లాంటి చెప్పుకోదగ్గ చిత్రాలే చేశారు. అన్ని ఫలితాలు ఆశించినంత రాకపోవడంతో పూర్తిగా తెలుగుకే పరిమితమయ్యారు. అప్పుడు మన స్టార్లకు నేషన్ వైడ్ మార్కెట్ లేదు. ఇప్పుడు బాహుబలి, కెజిఎఫ్, పుష్పల సినిమాల పుణ్యమాని అది వచ్చేసింది. లుక్స్ లో అందంలో నార్త్ వాళ్లకు బాగా కనెక్ట్ అయ్యే అవకాశమున్న అఖిల్ కు సరైన కంటెంట్ పడాలే కానీ అక్కడా జెండా పాతేయొచ్చు. ఏజెంట్ తర్వాత ఇదే ఉంటుందేమో

Also Read : Bheemla Nayak : పవన్ సినిమాకు బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి