iDreamPost

హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందంతో అజిత్ కూతురు!

  • Author singhj Published - 07:13 PM, Sat - 12 August 23
  • Author singhj Published - 07:13 PM, Sat - 12 August 23
హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందంతో అజిత్ కూతురు!

ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండా చిత్ర పరిశ్రమలో నెగ్గుకురావడం అంటే అంత ఈజీ కాదు. ఇండస్ట్రీలో టాప్ హీరోలుగా కొనసాగుతున్న వారిలో చాలా మంది హీరోలు వారసులుగా వచ్చినవారే. వారసత్వాన్ని కొనసాగించడం కూడా ఈజీ కాదు. వారసులుగా ఎంట్రీ ఇచ్చిన అందరూ సక్సెస్ కాలేదు. కొంతమంది మాత్రమే తమను తాము నిరంతరం మెరుగుపర్చుకుంటూ, మంచి సినిమాలతో ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు. వారసత్వంతో సంబంధం లేకుండా సొంత ప్రతిభతో ఒక్కో ఛాన్స్​ను వినియోగించుకుంటూ పరిశ్రమలో విజయవంతమైన వారూ ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు కోలీవుడ్​ స్టార్ హీరో అజిత్.

ఒక్కో సినిమాతో తన కెరీర్​ను జాగ్రత్తగా మలచుకున్నారు అజిత్. మొదట్లో ఎక్కువగా ప్రేమ కథలు, కుటుంబ కథా చిత్రాల్లో నటించిన ఈ స్టార్ హీరో.. ఆ తర్వాత మాస్, యాక్షన్ మూవీస్ చేయడం మొదలుపెట్టారు. ఆయన స్టార్​డమ్ పెరగడానికి మాస్ మూవీసే కారణం. అటు తమిళంతో పాటు తెలుగులోనూ ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు అజిత్. మిగిలిన స్టార్స్​లా ఆయన సోషల్ మీడియాలో ఫ్యాన్స్​తో టచ్​లో ఉండరు. ఇంటర్నెట్​కు దూరంగా ఉండే అజిత్.. కాస్త ఫ్రీ టైమ్ దొరికినా బైక్ వేసుకొని టూర్లకు వెళ్లిపోతారు.

అజిత్​ సోషల్ మీడియాకు దూరంగా ఉన్నా ఆయన భార్య షాలిని మాత్రం ఇటీవలే ఇన్​స్టాగ్రామ్​లోకి ఎంట్రీ ఇచ్చారు. తాజాగా ఆమె తన ఫ్యామిలీ లేటెస్ట్ ఫొటోలను అందులో షేర్ చేశారు. ఈ ఫొటోల్లో అజిత్ కూతురు అనౌష్క స్పెషల్ ఎట్రాక్షన్ అయ్యారు. తండ్రి పక్కనే నిలుచున్న అనౌష్క ఎంతో అందంగా, చూడముచ్చటగా కనిపిస్తున్నారు. ఈ ఫొటోలను చూసిన అభిమానులు.. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందంతో ఉన్న అనౌష్కను చూసి వావ్ అంటున్నారు. తల్లి షాలిని కంటే అనౌష్క మరింత అందంగా ఉన్నారని కామెంట్స్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Shalini Ajithkumar (@shaliniajithkumarofficial)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి