iDreamPost

Airtel Prices Hike : యూజర్లకు ఎయిర్‌టెల్ షాక్‌!

Airtel Prices Hike : యూజర్లకు ఎయిర్‌టెల్  షాక్‌!

జియోతో గట్టిపోటీని ఎదుర్కొంటున్న ఎయిర్‌టెల్ సంస్థ ఈ ఏడాది మరోసారి టారిఫ్‌ రేట్లను పెంచనున్నట్లు తెలుస్తోంది. అంటే యూజర్లకు భారీ షాక్ త‌ప్ప‌దు. ఈ ఏడాది తదుపరి విడత టారిఫ్‌ల పెంపుతో, ఏఆర్‌పీయూ అంటే ఒక వినియోగ‌దారుడి నుంచి వచ్చే సగటు ఆదాయం రూ.200 మార్కును దాటుతుంద‌ని టెలికం సంస్థ భారతి ఎయిర్‌టెల్‌ ఇండియా, దక్షిణాసియా ఎండీ గోపాల్‌ విఠల్ చెప్పారు.

ముందు రేట్లు త‌గ్గించిన టెలికాం కంపెనీలు నెమ్మ‌దిగా ఛార్జీల మోత‌మోగిస్తున్నాయి. ఈ పెరుగుద‌ల ఇక్క‌డితేనే ఆగేదిలా లేదు. వ‌చ్చే ఐదేళ్ల‌లో దీన్ని రూ.300కు పెంచుకునే అవకాశం ఉందని ఇన్వెస్టర్లతో కాన్ఫరెన్స్‌ కాల్‌లో ఆయన చెప్పారు. గతేడాది మార్చి క్వార్ట‌ర్ల్ లో రూ.145తో పోలిస్తే ఈ మార్చి క్వార్టర్‌లో ఎయిర్‌టెల్‌ ఏఆర్‌పీయూ రూ.178కి పెరిగింది. త్వ‌ర‌లో ఇది రూ.200 దాట‌నుంది. టెలికం కంపెనీలు రెండేళ్లుగా మొబైల్‌ కాల్స్, డేటాల ధరలను పెంచుతున్నాయి. త‌క్కువ డేటాను ఇవ్వ‌డం వ‌ల్ల వ‌చ్చిన న‌ష్టాల‌ను పూడ్చుకోవ‌డానికి ధ‌ర‌లు పెంచుతున్నాయ‌ని మార్కెట్ నిపుణులు అంటున్నా, చిప్‌ల కొరతతో స్మార్ట్‌ఫోన్ల రేట్లు పెరిగి విక్రయాలపై ప్రభావం పడిందని, దానివ‌ల్ల న‌ష్టాలు వ‌స్తున్నాయ‌న్న‌ది ఎయిర్ టెల్ మాట‌. ఇది తాత్కాలికమేనా? అవునంటోంది ఎయిర్ టెల్.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి