iDreamPost

మూవీ లవర్స్ కు గుడ్ న్యూస్.. రూ. 148కే 15GB, 15+ OTTలు ఫ్రీ!

  • Author Soma Sekhar Published - 04:58 PM, Thu - 27 July 23
  • Author Soma Sekhar Published - 04:58 PM, Thu - 27 July 23
మూవీ లవర్స్ కు గుడ్ న్యూస్.. రూ. 148కే 15GB, 15+ OTTలు ఫ్రీ!

ప్రస్తుత పోటీ ప్రపంచలో టెలికాం సంస్థలు వినియోగదారులను ఆకట్టుకునేందుకు వివిధ రకాల ప్లాన్ లను, ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఇక టెలికాం రంగంలోకి జియో ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చిందో.. అప్పటి నుంచి టెలికాం కంపెనీల భవిష్యత్తే మారిపోయింది. జియో నుంచి పోటీ తట్టుకునేందుకు ఎయిర్టెల్, వొడాఫోన్-ఐడియా, బిఎస్ఎన్ఎల్ లాంటి కంపెనీలు కస్టమర్లకు వివిధ రకాల ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ టెలికాం కంపెనీ ఎయిర్టెల్ తమ కస్టమర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. కేవలం రూ. 148కే 15 GB ఫ్రీ డేటాతో పాటుగా.. 15+ OTT లకు ఫ్రీ యాక్సెస్ ఇచ్చింది. ఈ ఆఫర్ కు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్ టెల్ తమ కస్టమర్లకు అదిరిపోయే కొత్త డేటా ప్యాక్ ను తీసుకొచ్చింది. ఈ ప్యాక్ మూవీ లవర్స్ ప్యాక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే? కేవలం రూ. 148 కే 15 GB ఫ్రీ డేటాతో పాటుగా 15+ ఓటీటీ ప్లాట్ ఫామ్ లకు ఫ్రీ యాక్సెస్ లభిస్తుంది. ఇది యాడ్-ఆన్ ప్లాన్. ప్రస్తుతం ఉన్న ప్రీపెయిడ్ ప్లాన్ పై కస్టమర్లు ఈ అద్భుతమైన ప్లాన్ ను పొందగలరని కంపెనీ తెలిపింది. అయితే ఈ ప్లాన్ లో టాక్ టైమ్ తోపాటుగా SMS ప్రయోజనాలు అందుబాటులో ఉండవని సంస్థ పేర్కొంది.

కాగా.. ఈ ప్యాక్ ద్వారా ఉచిత ఎక్స్ ట్రీమ్ ప్లే సబ్ స్క్రిప్షన్ ద్వారా కస్టమర్లు 15 ఓటీటీ యాప్ లకు యాక్సెస్ పొందుతారు. ఇప్పుడు ఆ ఓటీటీ యాప్ ల లిస్ట్ చూద్దాం. సోనీ లీవ్ ప్రీమియం, Eros Now, Hoichoi, Lionsgate Play, Fancode, ManoramaMAX లాంటి మరెన్నో ఓటీటీలను ఫ్రీగా చూడొచ్చు. అయితే కస్టమర్ 28 రోజుల వ్యాలిడిటీతో మాత్రమే ఈ ఓటీటీలకు యాక్సెస్ పొందుతారు. మరి ఎయిర్ టెల్ తీసుకొచ్చిన ఈ ఆఫర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: రోగి ప్రాణాలు కాపాడేందుకు 108 డ్రైవర్ సాహసం!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి