iDreamPost

రోగి ప్రాణాలు కాపాడేందుకు 108 డ్రైవర్ సాహసం!

రోగి ప్రాణాలు కాపాడేందుకు 108 డ్రైవర్ సాహసం!

కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వానలు కురుస్తోన్నాయి. పలు గ్రామాలు, పట్టణాలు చెరువులను తలపిస్తున్నాయి. కృష్ణా, గోదావరి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇక పలు జాతీయ రహదారులులపై వరద నీరు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది.  భారీగా కురుస్తున్న వానలకు జనాలు భయాందోళనకు గురవుతున్నారు. ఇలాంటి నదులు ఉప్పొంగి ప్రవహిస్తుంటే.. ఓ 108 వాహన డ్రైవర్  సాహసం చేశారు. రోగి ప్రాణాలను కాపాడేందుకు తన ప్రాణాలను ఫణంగా పెట్టారు. ఇక ఈఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఎన్టీఆర్ జిల్లాలో వత్సవాయికి చెందిన డయాలసిస్ తో బాధ పడుతున్న బాబురావుకు వైద్యం అత్యవసరమైంది. దీంతో బాబురావు కుటుంబ సభ్యులు వెంటనే 108 వాహనానికి సమాచారం అందించారు. దీంతో క్షణాల్లో108 వాహనం వత్సాయి గ్రామానికి వచ్చింది. ఇక అక్కడి నుంచి పెనుగంచిప్రోలు మీదుగా జగ్గయ్యపేటకు బాబురావును తరలిస్తున్నారు. ఈ క్రమంలోనే భారీ వర్షాలతో పెనుగంచిప్రోలు వంతెనపై నుంచి వరద ప్రవహిస్తోంది. దీంతో అటుగా వెళ్తున్న వాహనాల రాకపోకల్ని పోలీసులు నిలిపివేశారు. అలానే వీరి వాహనం కూడా పెనుగంచి ప్రోలు బ్రిడి వద్దకు చేరుకుంది. అక్కడ  బ్రిడ్జిపై నుంచి ప్రవహిస్తున్న వరద ప్రవాహం 108 డ్రైవర్ కి కనిపించింది.

మిగిలిన వాహనాల మాదిరిగానే ఈ 108 వాహనాన్ని కూడ  పోలీసులు అక్కడే ఆపేశారు. అయితే రోగి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. దీంతో ఎలాగైన ఆ రోగికి చికిత్స అందించి.. ప్రాణాలు కాపాడాలని ఆ డ్రైవర్ భావించాడు. దీంతో  సదరు డ్రైవర్ సాహసం చేసి భారీగా వరద నీరు ప్రవహిస్తున్న వంతెనపై  నుంచి వాహనాన్ని చాకచక్యంగా దాటించారు.  అక్కడి నుంచి జగ్గయ్యపేటకు రోగి బాబురావును సురక్షితంగా చేర్చారు. రోగి పరిస్థితిని అర్థం చేసుకున్నాడు కాబట్టే.. ఈ 108 వాహన డ్రైవర్ సాహసోపేతంగా వ్యవహరించాడు. అలానే సరైన సమయానికి రోగిని ఆస్పత్రికి చేర్చారు. దీంతో డ్రైవర్‌‌పై స్థానికులు ప్రశంసలు కురిపించారు. మరి.. సాహసం చేసిన ఈ 108 డ్రైవర్ పై మీ ప్రశంసలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: వీడియో: వానల దెబ్బకు బిల్డింగ్ ఎక్కిన ఆంబోతు..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి