iDreamPost

Telangana Congress: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్!

రాజ్యసభ ఎన్నికల హడావుడి ప్రారంభమైంది. మొత్తం 56 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ నుంచి 3 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి పోటీ చేసే అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది.

రాజ్యసభ ఎన్నికల హడావుడి ప్రారంభమైంది. మొత్తం 56 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ నుంచి 3 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి పోటీ చేసే అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది.

Telangana Congress: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్!

రాజ్యసభకు తెలంగాణ నుంచి పోటీ చేసే అభ్యర్థలను కాంగ్రెస్ ప్రకటించింది. బుధవారం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అభ్యర్థులను ప్రకటించింది. రేణుక చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ తెలంగాణ నుంచి రాజ్యసభకు పోటీ చేసే అభ్యర్థులుగా కాంగ్రెస్ ప్రకటించింది. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కుమారుడే అనిల్ కుమార్ యాదవ్. అలానే ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత రేణుక చౌదరిని కూడా కాంగ్రెస్ రాజ్యసభకు పంపనున్నారు. మొత్తంగా తొలిసారి అనిల్ కుమార్ యాదవ్ పెద్దల సభలో అడుగుపెట్టనున్నారు.

తెలంగాణ నుంచి కూడా మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్న సంగతి తెలిసిందే. వద్దిరాజు రవిచంద్ర, బడులు లింగయ్య యాదవ్, జోగినపల్లి సంతోష్ పదవి కాలం త్వరలో ముగియనుంది. దీంతో ఆయా స్థానాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. అయితే ప్రస్తుతం  తెలంగాణలో ఉన్న పార్టీ సంఖ్య బలం దృష్టా కాంగ్రెస్ కు రెండు స్థానాలు, బీఆర్ఎస్ కి ఒక్క స్థానం వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా కాంగ్రెస్ పార్టీ  తెలంగాణ నుంచి రాజ్యసభకు పోటీ చేసే ఇద్దరు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. వారిలో ఒకరు సీనియర్ నేత రేణుక చౌదరి కాగా, మరోకరు యువకుడు అయినా అనిల్ కుమార్ యాదవ్  ఉన్నారు. అలానే కర్ణాటక, మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ అభ్యర్థులను కూడా కాంగ్రెస్ పార్టీ  ప్రకటించింది.  కర్ణాటక నుంచి అజయ్ మాకెన్, సయ్యద్ నాసిర్ హుస్సెన్, చంద్రశేఖర్ లను ఎంపిక చేసింది. మధ్యప్రదేశ్ నుంచి అశోక్ సింగ్ ను ఏఐసీసీ ఎంపిక చేసింది. వీరందరూ గురువారం నామినేషన్ వేయనున్నారు. బీఆర్ఎస్ ఇంకా తమ రాజ్యసభ అభ్యర్థిని ప్రకటించలేదు.

ఇటీవలే రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. 15 రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా 56 రాజ్యసభ స్థానాలకు ఈ ఎన్నికల నోటిఫికేషన్ సీఈసీ విడుదల చేసింది. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 6 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఏపీ నుంచి 3, తెలంగాణ నుంచి 3 స్థానాలకు రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. అత్యధికంగా యూపీ నుంచి 10 రాజ్యసభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. బిహార్ 6, మహారాష్ట్రలో 6, పశ్చిమ బెంగాల్ 5, మధ్యప్రదేశ్ 5, గుజరాత్ 4 కర్ణాటకలో 4, ఒడిశా, రాజస్థాన్ లో మూడే చొప్పున స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. హర్యానా, ఛత్తీస్ గఢ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లో ఒక్కో రాజ్యసభ స్థానానికి పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 27న రాజ్యసభ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ పోలింగ్ జరగనుంది. ఓటింగ్ పూర్తయిన తర్వాత అదే రోజు సాయంత్ర 5 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి