iDreamPost

Banned: IPL ఫ్రాంచైజీలకు భారీ షాక్.. ముగ్గురి బౌలర్లపై 2 ఏళ్లు నిషేధం!

ముగ్గురు క్రికెటర్లపై రెండేళ్ల పాటు విదేశీ లీగ్ లు ఆడకుండా నిషేధం విధించింది ప్రముఖ క్రికెట్ బోర్డు. మరి ఆ ప్లేయర్లు ఎవరు? వారు చేసిన తప్పేంటి? ఇప్పుడు తెలుసుకుందాం.

ముగ్గురు క్రికెటర్లపై రెండేళ్ల పాటు విదేశీ లీగ్ లు ఆడకుండా నిషేధం విధించింది ప్రముఖ క్రికెట్ బోర్డు. మరి ఆ ప్లేయర్లు ఎవరు? వారు చేసిన తప్పేంటి? ఇప్పుడు తెలుసుకుందాం.

Banned: IPL ఫ్రాంచైజీలకు భారీ షాక్.. ముగ్గురి బౌలర్లపై 2 ఏళ్లు నిషేధం!

ఐపీఎల్ 2024 సీజన్ ఎన్నో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఇప్పటికే పాండ్యా, రోహిత్ కెప్టెన్సీ వివాదం ముగియనే లేదు.. ఇంతో మరో న్యూస్ ఐపీఎల్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ వార్త ఐపీఎల్ ఫ్రాంచైజీలకు భారీ షాకనే చెప్పాలి. ముగ్గురు క్రికెటర్లపై రెండేళ్ల పాటు విదేశీ లీగ్ లు ఆడకుండా నిషేధం విధించింది ప్రముఖ క్రికెట్ బోర్డు. మరి ఆ ప్లేయర్లు ఎవరు? వారు చేసిన తప్పేంటి? వారిపై బ్యాన్ విధించడం కారణంగా ఐపీఎల్ లో ఏ ఫ్రాంచైజీలు నష్టపోతాయో? ఇప్పుడు తెలుసుకుందాం.

ఆఫ్గానిస్తాన్ జట్టుకు చెందిన స్టార్ బౌలర్లు నవీన్ ఉల్ హక్, ఫజల్ హక్ ఫారూకీ, ముజీబ్ ఉర్ రహ్మన్ లకు ఊహించని షాక్ ఇచ్చింది ఆఫ్గాన్ క్రికెట్ బోర్డు. ఈ ముగ్గురు ప్లేయర్లను విదేశీ లీగ్ ల్లో ఆడటాన్ని రెండేళ్ల పాటు నిషేధం విధించింది. దీంతో పాగు వీరి సెంట్రల్ కాంట్రాక్టుల విషయంలో త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటామని ఆఫ్గాన్ క్రికెట్ బోర్డ్ ప్రకటించింది. ముజీబ్, నవీన్, ఫారూకీ జాతీయ జట్టును కాదని ఎక్కువగా ఫ్రాంచైజీ క్రికెట్ కే ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటున్న కారణంగా క్రికెట్ బోర్డ్ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించేందుకు ఓ విచారణ కమిటీని కూడా నియమించింది.

ఈ విచారణలో భాగంగా జాతీయ జట్టు ప్రయోజనాలకు భంగం కలిగించే విధంగా ఈ ముగ్గురు వ్యవహరించాని తేలితే.. వారి సెంట్రల్ కాంట్రాక్ట్ ను సంవత్సరం పాటు రద్దు చేసేందుకు ఆఫ్గాన్ క్రికెట్ బోర్డ్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆఫ్గాన్ బోర్డ్ తీసుకున్న నిర్ణయంతో.. ఐపీఎల్ ఫ్రాంచైజీలకు భారీ దెబ్బ పడనుంది. ఐపీఎల్ 2024 మినీ వేలంలో ముజీబ్ ను రూ. 2 కోట్లకు కేకేఆర్ కొనుగోలు చేయగా.. లక్నో నవీన్ ఉల్ హక్ ను 2023వేలంలో 50 లక్షలకు కొనుగోలు చేసి.. తాజాగా వేలానికి ముందు అతడిని రిటైన్ చేసుకుంది. ఇక పేసర్ ఫజల్ పారూకీని సన్ రైజర్స్ హైదరాబాద్ రూ. 50 లక్షలు వెచ్చించి రిటైన్ చేసుకుంది. ఇప్పటికే ఈ ముగ్గురు విదేశీ లీగ్ లు ఆడకుండా నిషేధం విధిస్తున్నామని ప్రకటన విడుదల చేసింది ఆఫ్గాన్ బోర్డ్. మరి ఆఫ్గాన్ క్రికెట్ బోర్డ్ తీసుకున్న ఈ షాకింగ్ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి