iDreamPost

సైలెంట్ గా ఓటిటిలోకి వచ్చేసిన ‘ఆదిపురుష్’! ఎందులో చూడొచ్చంటే..

  • Author ajaykrishna Updated - 11:01 AM, Fri - 11 August 23
  • Author ajaykrishna Updated - 11:01 AM, Fri - 11 August 23
సైలెంట్ గా ఓటిటిలోకి వచ్చేసిన ‘ఆదిపురుష్’! ఎందులో చూడొచ్చంటే..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ఫస్ట్ టైమ్ రామాయణ ఇతిహసం నేపథ్యంలో చేసిన సినిమా ఆదిపురుష్. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద ప్రశంసల కంటే విమర్శలకు ఎక్కువగా గురైంది. కానీ.. ప్రభాస్ స్టార్డమ్ పరంగా కలెక్షన్స్ మాత్రం అదరగొట్టింది. ఈ సినిమాలో డార్లింగ్ ప్రభాస్.. సాక్ష్యాత్తు శ్రీరాముడి క్యారెక్టర్ లో ప్రేక్షకులను కనువిందు చేశాడు. సీత క్యారెక్టర్ లో బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్ నటించింది. అయితే.. జూన్ 16న వరల్డ్ వైడ్ థియేటర్స్ లో విడుదలైన ఆదిపురుష్.. ఓపెనింగ్ కలెక్షన్స్ మాత్రం ఎవరు ఎక్స్ పెక్ట్ చేయని విధంగా రాబట్టింది. కానీ.. మిక్సడ్ టాక్ వల్ల మెల్లగా కలెక్షన్స్ తగ్గుముఖం పట్టాయి.

కట్ చేస్తే.. ఆదిపురుష్ థియేట్రికల్ రన్ పూర్తయ్యే సమయానికి దాదాపు రూ. 450 కోట్లకు పైనే వసూల్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక సినిమా పూర్తిగా రామాయాణానికి భిన్నంగా ఉందంటూ విమర్శలు వచ్చాయి. అలాగే సినిమాలో హనుమాన్ క్యారెక్టర్ చేత కమర్షియల్ మాస్ డైలాగ్స్ చెప్పించడం.. విఎఫ్ఎక్స్ సరిగ్గా కుదరకపోవడం లాంటి మిస్టేక్స్ జరగడంతో సినిమాపై మరింత నెగిటివిటీ స్ప్రెడ్ అయ్యింది. అంతేగాక సినిమాని థియేటర్స్ లో ప్రదర్శించడం ఆపేయాలని కొందరు కోర్టు వరకు వెళ్లిన సందర్భాలు కూడా లేకపోలేదు. అయితే.. ఆదిపురుష్ మూవీ థియేటర్స్ లో నుండి వెళ్ళిపోయాక.. ఓటిటి రిలీజ్ ఎప్పుడు అవుతుందా అని ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్.

ఎట్టకేలకు సినిమా థియేటర్స్ లో విడుదలైన రెండు నెలల లోపే ఓటిటి స్ట్రీమింగ్ కి వచ్చేసింది. అదికూడా ఎలాంటి ప్రచారం లేకుండా స్ట్రీమింగ్ కి రావడం గమనార్హం. ఆదిపురుష్ మూవీ ఆగష్టు 11 నుండి స్ట్రీమింగ్ మొదలైంది. ఇది తెలిసి డార్లింగ్ ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. అదేంటీ ఎలాంటి సౌండ్ లేకుండా ఓటిటికి వచ్చేసింది అని. అయితే.. ఆదిపురుష్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి అమెజాన్ ప్రైమ్ వారు సొంతం చేసుకున్నారు. కాగా.. ప్రస్తుతం సినిమా స్ట్రీమింగ్ అవుతుండటంతో ఓటిటి ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో రావణాసురుడు లంకేశ్ పాత్రలో సైఫ్ అలీఖాన్.. హనుమాన్ గా దేవాదత్త నాగే నటించారు. మరి థియేటర్స్ లో ఆదిపురుష్ ని మిస్ అయినవారు హ్యాపీగా ఇంట్లో కూర్చొని అమెజాన్ ప్రైమ్ లో చూడవచ్చు. ఆదిపురుష్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి