iDreamPost

యూట్యూబ్‌లో​ లీకైన ఆదిపురుష్‌.. గంటల వ్యవధిలోనే మిలియన్ల కొద్ది వ్యూస్‌!

  • Published Jul 10, 2023 | 10:19 AMUpdated Jul 10, 2023 | 10:19 AM
  • Published Jul 10, 2023 | 10:19 AMUpdated Jul 10, 2023 | 10:19 AM
యూట్యూబ్‌లో​ లీకైన ఆదిపురుష్‌.. గంటల వ్యవధిలోనే మిలియన్ల కొద్ది వ్యూస్‌!

ఈ ఏడాది ఇప్పటి వరకు భారీ అంచనాల మధ్య విడుదలైన చిత్రం ఏదైనా ఉందంటే.. అది పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ నటించిన ఆదిపురుష్‌ చిత్రం. ఓంరౌత్‌ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ఎన్ని వివాదాలు రాజేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రామాయణాన్ని ఓంరౌత్‌ భ్రష్టు పట్టించాడని హిందూ సంఘాలు పెద్ద ఎత్తున మండి పడ్డాయి. అనేక ఫిర్యాదులు కూడా నమోదయ్యాయి. ఇన్ని వివాదాల నడుమ విడుదలైన ఈ చిత్రం.. నేటి కూడా థియేటర్స్‌లో కొనసాగుతూనే ఉంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్‌ రాముడి పాత్రలో, కృతి సనన్‌.. జానకిగా.. సైఫ్‌ అలీఖాన్‌ రావణుడిగా నటించారు.

భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం జూన్‌ 16న ప్రేక్షకుల ముందుకు వచ్చి.. మిక్స్డ్‌ టాక్‌ తెచ్చుకుంది. కలెక్షన్లపరంగా కూడా పెద్దగా రాణించలేదని ట్రేడ్‌ వర్గాల సమాచారం. ఇక సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనే.. ఆదిపురుష్‌ పైరసీ కాపీ ఆన్‌లైన్‌లో దర్శనం ఇచ్చింది. ఇక తాజాగా ఆదిపురుష్‌ చిత్రానికి మరో భారీ షాక్‌ తగిలింది. ఈ సినిమా హెచ్‌డీ ప్రింట్‌ యూట్యూబ్‌లో లీకైనట్లు సమాచారం.

యూట్యూబ్ ప్లాట్‌ఫామ్‌లో ‘ఆదిపురుష్’ చిత్రం లీక్ అయిందనే వార్తలు గుప్పుమన్నాయి. ఈ సినిమా హెచ్‌డీ క్వాలిటీ ప్రింట్‌ యూట్యూబ్‌లో చూడటానికి అందుబాటులో ఉందనే వార్త నిమిషాల్లో వైరల్‌ అయ్యింది. దాంతో ఆదిపురుష్‌ సినిమా చూడని వారు.. చూసినవారు ఒక్కారిగా యూట్యూబ్‌ మీద దాడి చేశారు. దాంతో గంటల వ్యవధిలోనే ఈ చిత్రం.. మిలియన్ల కొద్ది వ్యూస్‌ సంపాదించింది. కేవలం గంటల వ్యవధిలోనే 2.3 మిలియన్ల మందికి పైగా ఈ సినిమా చూశారు. ఆ తర్వాత కాసేపటికే.. ఆదిపురుష్‌ ప్రింట్‌ను తొలగించినట్లు సమాచారం.

‘ఆదిపురుష్’ సినిమాలోని డైలాగ్‌లు, పాత్రల రూపానికి సంబంధించి చాలా వివాదాలను ఎదుర్కొంది. భారీ ఎత్తున విమర్శలు రావడంతో.. దర్శకనిర్మాతలు ఈ సినిమా డైలాగ్స్‌లో మార్పులు చేసినప్పటికీ.. సినిమాపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత తగ్గలేదు. తాజాగా ఈ సినిమా డైలాగ్ రైటర్ మనోజ్ ముంతాషిర్ ఈ సినిమా వల్ల ప్రజల మతపరమైన మనోభావాలు దెబ్బతింటాయని ట్వీట్ చేస్తూ క్షమాపణలు చెప్పారు.

ఈ సందర్భంగా మనోజ్ ముంతాషిర్ ఇలా రాసుకొచ్చాడు “ఆదిపురుష్ సినిమా వల్ల ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని నేను అంగీకరిస్తున్నాను. నా సోదరులు, సోదరీమణులు, పెద్దలు, గౌరవనీయులైన రుషులు, శ్రీరాముడి భక్తులందరికీ నేను నా చేతులు జోడించి మరీ.. క్షమాపణలు చేబుతున్నారు. బజరంగ్‌ బలి భగవాన్‌ మనల్ని ఆశీర్వదిస్తాడు మన దేశానికి ఎనలేని సేవ చేసే శక్తిని ప్రసాదిస్తాడు’’ అంటూ ట్వీట్‌ చేశాడు.దీనిపై కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి