iDreamPost

హీరోయిన్ వరలక్ష్మి టమాటాల బ్యాగ్ దొంగతనం! వైరల్ అవుతున్న వీడియో!

  • Author ajaykrishna Updated - 12:00 PM, Thu - 3 August 23
  • Author ajaykrishna Updated - 12:00 PM, Thu - 3 August 23
హీరోయిన్ వరలక్ష్మి టమాటాల బ్యాగ్ దొంగతనం! వైరల్ అవుతున్న వీడియో!

దేశవ్యాప్తంగా ప్రస్తుతం టమాటా ధరలు ఏ రేంజ్ లో చర్చనీయంశంగా మారాయో తెలిసిందే. టమాటాలు ధరలు లేక రోడ్డుపై వదిలేసిన రోజుల నుండి.. ఇప్పుడు టమాటాలు అమ్ముకొని ఆర్థికంగా సేఫ్ అయిపోతున్నారు రైతులు. అయితే.. టమాటాలు ఇప్పుడు బేరాలు ఆడే విధంగా లేవని చెప్పాలి. ఏకంగా రూ. 200 లకు పైగా దూసుకుపోతున్నాయి ధరలు. ఇప్పటికే టమాటా ధరల గురించి డిబేట్స్, సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతూనే ఉన్నాయి. సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు టమాటా ధరలపై.. డిఫరెంట్ కాన్సెప్ట్ లతో వీడియోలు చేస్తూ పోస్టులు పెడుతున్నారు. ఇప్పుడదే బ్యాచ్ లో చేరిపోయింది నటి వరలక్ష్మి శరత్ కుమార్.

టాలీవుడ్ లో లేడీ విలన్ గా సూపర్ క్రేజ్ సంపాదించుకున్న వరలక్ష్మి.. తన టమాటాల కవర్ ఎవరో దొంగిలించారంటూ ఓ వీడియో పెట్టింది. ఆ వీడియో ప్రెజెంట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ.. ఆ వీడియోలో ఏముందంటే..? వరలక్ష్మీ వేరే అమ్మాయితో మాట్లాడుతూ.. తాను కొనుక్కున్న టమాటాల కవర్ ని, ఫోన్ ని గోడపై పెట్టింది. ఇంతలో గోడ మీద టమాటాలు, ఫోన్ గమనించిన ఓ దొంగ.. వెనక నుండి వచ్చి.. ఫోన్ ఎత్తుకెళ్లిపోతాడు. అది చూసిన వరలక్ష్మి ఫోనే కదా పోయిందని లైట్ తీసుకుంటుంది. ఆ తర్వాత దొంగ మళ్లీ వచ్చి.. ఈసారి ఫోన్ అక్కడే పెట్టేసి.. టమాటాల కవర్ ఎత్తుకెళ్లిపోయాడు. దీంతో టమాటాలు పోయాయని తెలుసుకొని వరలక్ష్మి తన ఫ్రెండ్ తో కలిసి దొంగను వెతకడం మొదలు పెడుతుంది.

ప్రస్తుతం వరలక్ష్మి చేసిన ఈ ఫన్నీ వీడియో.. టమాటాల విలువ తెలియజేస్తూ ఉందని నెటిజన్స్ కామెంట్స్ లో రియాక్ట్ అవుతున్నారు. ఇక దేశంలో ఎక్కడ చూసినా.. టమాటా ధరలు సామాన్యుల చేత కంటతడి పెట్టిస్తున్న విషయం విదితమే. ఆ ధరలు చూసి అసలు టమాటాలు లేకుండా వంట చేసుకోవడం అలవాటు చేసుకుంటున్నారు జనాలు. ఇదిలా ఉండగా.. వరలక్ష్మి శరత్ కుమార్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. నటుడు శరత్ కుమార్ కూతురుగా ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పటికి.. నటిగా తనని తాను ప్రూవ్ చేసుకుంటోంది. ముఖ్యంగా తెలుగులో విలన్ గా వరలక్ష్మికి మంచి గుర్తింపు లభించింది. ఇక వరలక్ష్మి చివరిగా తెలుగులో వీరసింహారెడ్డి మూవీలో మెరిసింది. మరి వరలక్ష్మి ఫన్నీ వీడియో గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

 

View this post on Instagram

 

A post shared by Varalaxmi Sarathkumar (@varusarathkumar)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి