iDreamPost

వద్దన్నా బలవంతంగా ఆ పని చేయించారు! కాస్టింగ్ కౌచ్ పై నటి వ్యాఖ్యలు!

  • Author ajaykrishna Published - 09:31 AM, Tue - 18 July 23
  • Author ajaykrishna Published - 09:31 AM, Tue - 18 July 23
వద్దన్నా బలవంతంగా ఆ పని చేయించారు! కాస్టింగ్ కౌచ్ పై నటి వ్యాఖ్యలు!

ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి ఇప్పటిదాకా ఎంతోమంది ముద్దుగుమ్మలు మాట్లాడారు. ఎన్నో సంచలన వ్యాఖ్యలు చేసి చర్చలకు దారితీశారు. ఇండస్ట్రీలో అడుగు పెట్టాక.. లైంగికంగా వేధింపులకు గురైనవారు, బాధించబడ్డవారు.. ఇలా అందరు మీటూ ఉద్యమంలో భాగంగా రియాక్ట్ అయ్యారు.. అవుతున్నారు. ఇప్పటివరకు ఎంతోమంది నటిమణులకు సంబంధించి విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. హాలీవుడ్ మొదలుకొని.. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని వుడ్ లకు చెందిన హీరోయిన్స్, లేడీ ఆర్టిస్ట్ లు తమ బాధలను బయట పెట్టే ప్రయత్నాలు చేశారు. అయితే.. కాస్టింగ్ కౌచ్ రచ్చ అప్పుడే అయిపోలేదు.

ఏదొక ఇండస్ట్రీలో రోజుకో నటి దీనిపై పెదవి విప్పుతున్నారు. ఇదే బాటలో తాజాగా బాలీవుడ్ నటి రతన్ రాజపుత్ చేరింది. తన కెరీర్ లో ఫేస్ చేసిన కాస్టింగ్ కౌచ్ మూమెంట్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. మీటూ ఉద్యమం జోరులో ఉన్నప్పుడు మాట్లాడలేకపోయిన రతన్.. ఇప్పటికైనా తాను మాట్లాడకపోతే మళ్లీ మాట్లాడే అవకాశం రాదని ముందుకొచ్చింది. ఈ సందర్బంగా రతన్ మాట్లాడుతూ.. “ఇండస్ట్రీలో జరుగుతున్న చీకటి కోణాలను యంగ్ స్టర్స్ తెలుసుకోవాలి. సినీ, టీవీ పరిశ్రమలలో కొందరు కామాంధులు ఉన్నారు. వారి వల్ల మిగతా వారికి కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది. ఇప్పుడు నా లైఫ్ లో జరిగింది చెప్తాను” అని ఇలా చెప్పుకొచ్చింది రతన్.

‘ఒకసారి ఓ ఆడిషన్ కి ముంబైలోని ఓషివారా సబర్బ్ హోటల్ కి వెళ్లాను. ఆ రోజు ఆడిషన్ బాగానే జరిగింది. డైరెక్టర్ కి మీ టాలెంట్ నచ్చింది.. నెక్స్ట్ ఆయనతో మీటింగ్ పై ఫ్లోర్ లో అని చెప్పారు. అక్కడికి వెళ్ళాక వద్దని చెప్పినా.. నాతో బలవంతంగా ఓ కూల్ డ్రింక్ తాగించారు. అది తాగాక సెకండ్స్ లోనే తేడాగా అనిపించింది. ఆ తర్వాత మరో ఆడిషన్ కోసం వేరే ప్లేస్ చెప్పారు. అక్కడికి వెళ్లి చూస్తే.. రూమ్ దారుణంగా ఉంది. అక్కడ ఎవరివో బట్టలన్నీ గందరగోళంగా పడి ఉన్నాయి. ఆ పక్కనే ఓ అమ్మాయి స్పృహ లేకుండా పడిపోయి ఉంది. ఆమె మత్తులో ఉందని అర్థమైంది. అయితే.. అక్కడికి నేను ఓ అబ్బాయిని వెంట తీసుకెళ్లాను. ఇక్కడికి బాయ్ ఫ్రెండ్ ని ఎందుకు తీసుకొచ్చావ్ అని సీరియస్ అయితే.. మా అన్నయ్య అని చెప్పాను వాళ్ళు సైలెంట్ అయ్యారు. అప్పటికే నాకు అక్కడి వాతావరణం అర్థమై.. అక్కడినుండి ఎస్కేప్ అయి బయటపడ్డాను’ అని తెలిపింది రతన్. ప్రెజెంట్ రతన్ మాటలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి కాస్టింగ్ కౌచ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి