iDreamPost

నటి ప్రగతి కొత్త అవతారం.. వామ్మో ఇలా మారిపోయింది ఏంటి!

  • Published Jul 19, 2023 | 11:29 AMUpdated Jul 19, 2023 | 11:29 AM
  • Published Jul 19, 2023 | 11:29 AMUpdated Jul 19, 2023 | 11:29 AM
నటి ప్రగతి కొత్త అవతారం.. వామ్మో ఇలా మారిపోయింది ఏంటి!

నటి ప్రగతి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి.. ప్రస్తుతం క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా రాణిస్తోంది. ఐదు పదుల వయసులో కూడా కుర్ర హీరోయిన్లకు ధీటుగా అందంతో మతి పొగొడుతుంది ప్రగతి. ఇక ప్రగతి అందానికి, మరీ ముఖ్యంగా ఆమె హెయిర్‌ స్టైల్‌కి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. లాక్‌డౌన్‌ నుంచి సోషల్‌ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటున్నారు ప్రగతి. మరీ ముఖ్యంగా ఫిట్‌నెస్‌ వీడియోలు షేర్‌ చేస్తూ.. వామ్మో ఈ ఏజ్‌లో ఏం ఎనర్జీ అని అందరూ ఆశ్చర్యపోయేలా చేస్తున్నారు. అంతేకాక ఫిట్‌గా ఉండటానికి వయసుతో సంబంధంలేదని నిరూపిస్తున్నారు ప్రగతి. వర్కౌట్‌ వీడియోలు, డ్యాన్స్‌ వీడియోలు షేర్‌ చేస్తూ.. సోషల్‌ మీడియాలో హల్చల్‌ చేస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా ప్రగతి షేర్‌ చేసిన వీడియో చూసిన జనాలు ఆశ్చర్యపోతున్నారు. బాబోయ్‌ ఈ రేంజ్‌ ట్రాన్స్‌ఫర్‌మేషన్‌ ఏంటి అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు నెటిజనులు. ఇంతకు ఏం జరిగింది అంటే..

ప్రస్తుతం ప్రగతి ఓవైపు సినమాలు చేస్తూ.. మరో వైపు జిమ్‌ వీడియోలతో సోషల్‌ మీడియాలో హల్చల్‌ చేస్తున్నారు. అయితే చాలా మంది ఎందుకు ఈ ఏజ్‌లో ఇంత భారీ వర్కౌట్స్‌ చేస్తున్నారు.. కేవలం ఫిట్‌గా ఉండటం కోసం మాత్రమేనా.. వేరే కారాణాలు ఉన్నాయా అనే అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. అయితే ఈ ప్రశ్నలన్నిటికి తాజాగా సమాధానమిచ్చారు ప్రగతి. ప్రస్తుతం ఆమె షేర్‌ చేసిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఇన్ని రోజులు ప్రగతి జిమ్‌లో ఇంతలా క‍ష్టపడింది ఎందుకన్నది ఈ వీడియో చూస్తే క్లారిటీ వస్తుంది. పవర్‌ లిఫ్టర్‌గా మారి.. అందరికి భారీ ఇచ్చారు నటి ప్రగతి. ఇందుకు సంబంధించిన వీడియోని పోస్ట్‌ చేయడంతో ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది. దీనిలో ప్రగతి నయా గెటప్‌ చూసి అందరూ షాక్‌ అవుతున్నారు.

వీడియో షేర్‌ చేసిన ప్రగతి.. ‘‘కొత్త ప్రయాణం ప్రారంభమైంది. రెండు నెలల ముందు వరకు.. నా జీవితం ఇలాంటి మలుపు తిరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు. పవర్‌ లిఫ్టింగ్‌లో నా ప్రయాణం మొదలు. రెండు నెలల క్రితం ఈ జర్నీ ప్రారంభమైంది.. చాలా చాలా దూరం వెళ్లాల్సి ఉంది. ప్రస్తుతం నా స్కోర్‌ 250.. నా లక్ష్యం చాలా పెద్దది. దాన్ని చేరుకునే వరకు విశ్రమించను’’ అనే క్యాప్షన్‌తో పోస్ట్‌ చేసిన ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ప్రగతి కొత్త ప్రయాణానికి ఆల్‌ ది బెస్ట్‌ చెబుతున్నారు ఆమె అభిమానులు. మీరు ఎందరికో స్ఫూర్తి అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన ప్రగతి డిగ్రీ చదువుతుండగా.. ఓ తమిళచిత్రంలో అవకాశం వచ్చింది. అది మంచి విజయం సాధించడంతో.. వరుసగా ఏడు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. అలానే ఒక మలయాళ చిత్రంలో కూడా యాక్ట్‌ చేసింది. వివాహం తర్వాత సినిమాలకు బ్రేక్‌ ఇచ్చింది. బాబీ సినిమాతో సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించింది ప్రగతి. ఆ తర్వాత సినిమాలోల​ అత్త, అమ్మ, పాత్రలు చేస్తూ.. సీరియల్స్‌లో కూడా నటిస్తూ.. చాలా బీజీగా మారింది. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో కూడా చాలా యాక్టీవ్‌గా ఉంటున్నారు ప్రగతి.

 

View this post on Instagram

 

A post shared by Pragathi Mahavadi (@pragstrong)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి