iDreamPost

Actress Kalyani : డైరెక్టర్ గా మారనున్న కబడ్డీ కథానాయిక

Actress Kalyani : డైరెక్టర్ గా మారనున్న కబడ్డీ కథానాయిక

ఎన్నో ఏళ్ళ క్రితం అంటే రెండు దశాబ్దాల క్రితం ఎంట్రీ ఇచ్చిన కళ్యాణి గుర్తుందిగా. హోమ్లీ హీరోయిన్ గా అప్పట్లో సౌందర్య తర్వాత ఈమెకే ఎక్కువ గుర్తింపు ఉండేది. కాకపోతే పెద్ద హీరోలతో చేసే అవకాశం రాకపోవడం వల్ల స్టార్ లీగ్ కు చేరుకోలేక మీడియం రేంజ్ లో ఆగిపోయింది. అయినప్పటికి తనకు మంచి హిట్స్ పడ్డాయి. డెబ్యూ మూవీ శేషుని మినహాయిస్తే ఆ తర్వాత వచ్చిన కబడ్డీ కబడ్డీ, పెదబాబు, పందెం, లక్ష్యం లాంటి చెప్పుకోదగ్గ సినిమాలు ఉన్నాయి. రవితేజతో చేసిన ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు సూపర్ హిట్ కాగా దొంగోడు అంచనాలు అందుకోలేకపోయింది. వెంకటేష్ వసంతం గట్టిగా ఆడినా అందులో తను చేసింది గ్లామర్ పాత్ర కాదు.

ఎప్పుడూ స్కిన్ షోకు ఎస్ చెప్పని కళ్యాణిని ఆ తర్వాత ఫ్లాపులు పలకరించడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారడం, వైవాహిక జీవితంలో చోటు చేసుకున్న మార్పులు తదితర కారణాల వల్ల కొంత గ్యాప్ తీసుకుంది. దర్శకుడు సూర్య కిరణ్ తో వివాహం జరిగాక ఏవో కారణాల వల్ల ఇద్దరూ విడిపోయిన సంగతి తెలిసిందే. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం కళ్యాణి దర్శకురాలిగా మారబోతోంది. చేతన్ చీతూ హీరోగా కెకె ప్రొడక్షన్స్ బ్యానర్ మీద యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా దీన్ని రూపొందించబోతున్నారు. ఇది పాన్ ఇండియా టచ్ లోనే ఉండబోతోంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదల చేస్తారు. క్యాస్టింగ్ ఫైనల్ చేసే పనిలో ఉన్నారు.

టాలీవుడ్ లో లేడీ డైరెక్టర్స్ లో ఎక్కువ కాలం కొనసాగిన వాళ్ళు తక్కువ. పేర్లు చెప్పమంటే ఠక్కున గుర్తొచ్చేది విజయనిర్మల గారు ఒక్కరే. గిన్నిస్ రికార్డు సాధించిన ఆవిడ తర్వాత ఇంకెవరు ఆ స్థాయిలో గుర్తింపుని తెచ్చుకోలేకపోయారు. సంజనా రెడ్డి, లక్ష్మి సౌజన్య, గౌరీ రోణంకి లాంటి వాళ్ళు ప్రయత్నాలు చేశారు కానీ ఆశించిన ఫలితాలు అందుకోలేకపోయారు. సక్సెస్ మాత్రమే మాట్లాడే ఇండస్ట్రీలో మహిళా దర్శకులు తమ ఉనికిని చాటుకోవడం ఒక ఛాలెంజ్ లాంటిది. పైగా సినిమా నిర్మాణం అంటేనే సవాళ్లతో కూడుకున్నది. మరి కళ్యాణి ఇందులో ఎలా నెగ్గుకొస్తారో వేచి చూడాలి. చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి డైరెక్టర్ దాకా అన్ని ప్రస్థానాలు చవి చూశారు

Also Read : Ghani : బాబాయ్ కోసం వెనక్కు వెళ్ళక తప్పదు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి