iDreamPost

Jyothi: ఆ స్టార్ డైరెక్టర్ పైటతీసి బెడ్ పై పడుకోమన్నారు! నటి జ్యోతి షాకింగ్ కామెంట్స్..

  • Author Soma Sekhar Published - 11:47 AM, Wed - 14 June 23
  • Author Soma Sekhar Published - 11:47 AM, Wed - 14 June 23
Jyothi: ఆ స్టార్ డైరెక్టర్ పైటతీసి బెడ్ పై పడుకోమన్నారు! నటి జ్యోతి షాకింగ్ కామెంట్స్..

సినిమా అనే రంగుల ప్రపంచంలో తమ టాలెంట్ ను నిరూపించుకోవడానికి ఎంతో మంది ఆరాటపడుతుంటారు. తమను తాము వెండితెరపై చూసుకునే క్రమంలో ఎన్నో కష్టాలను వారు ఎదుర్కొవాల్సి వస్తుంది. ఇక ఇండస్ట్రీలో మహిళా నటీమణులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య క్యాస్టింగ్ కౌచ్. ఈ క్యాస్టింగ్ కౌచ్ పై గతంలోనే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం జరిగిన విషయం మనందరికి తెలిసిందే. తాజాగా క్యారెక్టర్ ఆర్టిస్టు జ్యోతి చేసిన కామెంట్స్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. ఓ స్టార్ డైరెక్టర్ తనను చీరపైట విప్పి బెడ్ పై పడుకొమన్నాడు అంటూ సంచలన ఆరోపణలు చేసింది. మరిన్ని వివరాల్లోకి వెళితే..

క్యారెక్టర్ ఆర్టిస్టు జ్యోతి.. ఇండస్ట్రీలో బోల్డ్ పాత్రలకు పెట్టింది పేరు. తనదైన బోల్డ్ నెస్ తో పరిశ్రమలో తనకంటూ ఓ మార్క్ ను క్రియేట్ చేసుకుంది. అదీకాక బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చి మరింత గుర్తింపు సంపాదించుకుంది. అయితే ఈమె పాపులర్ అయ్యింది మాత్రం ఎవడి గోలవాడిదే సినిమాతోనే అని చెప్పాలి. ఆ సినిమాలోని ‘సమర్పించేసుకుంటాను’ అనే ఒకేఒక్క డైలాగ్ తో ఫేమస్ అయ్యింది. ఇక తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ స్టార్ డైరెక్టర్ సెట్ లో పైటతీసి బెడ్ పై పడుకోమన్నారు అంటూ సంచలన కామెంట్స్ చేసింది. ఆ స్టార్ డైరెక్టర్ ఎవరంటే? ఈవీవీ సత్యనారాయణ.

ఇంతకీ అసలు విషయం ఏంటంటే? ఈవీవీ డైరెక్ట్ చేసిన ఓ సినిమాలో ఓ సీన్ కోసం పైటతీసి బెడ్ పై పడుకోమన్నారట. ఈ సీన్ జ్యోతికి నచ్చలేదని తెలిపింది. సెట్లో అందరి ముందు అలాంటి సీన్ చేయడానికి ఆమెకు ఇబ్బందిగా అనిపించిదట. దాంతో డైరెక్టర్ ను రిక్వెస్ట్ చేసి ఈ సీన్ మర్చమని కోరింది. దానికి ఈవీవీ ఒప్పుకోకపోవడంతో.. ఆ సెట్ నుంచి బయటకి వచ్చేసిందట జ్యోతి. ఇక అప్పటి నుంచి ఆయన సినిమాలో నటించలేదని తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు జ్యోతి. అయితే జ్యోతి కామెంట్స్ పై నెటిజన్లు పలు విధాలుగా స్పందిస్తున్నారు. ఈవీవీ లాంటి గొప్ప డైరెక్టర్ పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని కొందరు అంటే.. చనిపోయిన వ్యక్తిపై ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదు అంటూ మరికొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి