iDreamPost

బిజినెస్ పార్టనర్ ని పెళ్లాడిన హీరోయిన్! వైరల్ గా మారిన ఫోటోలు!

  • Author ajaykrishna Published - 03:02 PM, Tue - 29 August 23
  • Author ajaykrishna Published - 03:02 PM, Tue - 29 August 23
బిజినెస్ పార్టనర్ ని పెళ్లాడిన హీరోయిన్! వైరల్ గా మారిన ఫోటోలు!

పెళ్లిళ్ల సీజన్ వచ్చిందంటే చాలు.. సెలబ్రిటీలైనా, సామాన్యులైనా వివాహ బంధంలో అడుగు పెట్టేందుకు రెడీ అవుతుంటారు. ముఖ్యంగా సెలబ్రిటీల పెళ్లిళ్ల విషయాలు ఫ్యాన్స్ కి ఎల్లప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. ఇప్పటికే చాలా మంది ఇండస్ట్రీకి చెందిన ముద్దుగుమ్మలు లవ్, అరేంజ్ ఇలా ఎవరికి కుదిరిన రీతిలో వారు మూడు ముళ్ళు వేయించుకుంటూ ఒక్కటి అవుతున్నారు. ఈ క్రమంలో తాజాగా మరో హీరోయిన్ పెళ్లి చేసుకొని అందరిని సర్ప్రైజ్ చేసింది. తనతో పాటు బిజినెస్ లో పార్టనర్ అయిన బెస్ట్ ఫ్రెండ్ ని పెళ్లాడింది ఈ భామ. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే.. హర్షిక పూనచ.

ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోవచ్చు. కానీ.. తెలుగులో కూడా హీరోయిన్ గా కొన్ని సినిమాలు చేసింది. కర్ణాటకలో పుట్టి పెరిగిన హర్షిక.. 2008లో PUC అనే మూవీతో హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించింది. అక్కడినుండి 2009లో ఏడుకొండల వాడ వెంకటరమణ అందరు బాగుండాలి అనే సినిమాతో తెలుగు డెబ్యూ చేసింది. 2010లో తమస్సు అనే కన్నడ సినిమాకు సపోర్టింగ్ యాక్ట్రెస్ గా కర్ణాటక స్టేట్ ఫిల్మ్ అవార్డు అందుకుంది. ఆ తర్వాత కన్నడలో చాలా బిజీగా చాలా సినిమాలలో నటించిన హర్షిక.. అదే ఊపులో తమిళ, మలయాళం, భోజ్ పురి ఇండస్ట్రీలలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.

హర్షిక తన 15 ఏళ్ళ వయసులోనే హీరోయిన్ గా మారింది. దాదాపు పదిహేనేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న ఈ భామ.. దాదాపు 30 సినిమా వరకు నటించింది. తెలుగులో చివరిగా 2016లో ‘అప్పుడు అలా ఇప్పుడు ఇలా’ అనే సినిమా చేసి.. తెలుగు సినిమాలు చేయలేదు. ఇదిలా ఉండగా.. హర్షిక ఓవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు ‘గ్లామ్ గాడ్ ఫ్యాషన్’ అనే కంపెనీ రన్ చేస్తోంది. ఫ్యాషన్ షోస్ లాంటివి ఈ కంపెనీ నిర్వహిస్తుంటుంది. ఈ కంపెనీలో పార్టనరే భువన్. ఇప్పుడు అతడినే పెళ్లి చేసుకుంది హర్షిక. కొన్నాళ్ళుగా బిజినెస్ లో బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉన్న వీరిద్దరూ ఆగష్టు 26న.. కొడగు సంప్రదాయంలో పెళ్లి చేసుకున్నారు. ఇక వీరి పెళ్లికి పలువురు ప్రముఖులు హాజరు కాగా.. ప్రస్తుతం పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి సెలబ్రిటీల పెళ్లి గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

 

View this post on Instagram

 

A post shared by Harshika Poonacha (@harshikapoonachaofficial)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి