iDreamPost

క్యాన్సర్‌తో పోరాడుతున్న నటి.. అప్పుడు నిర్లక్ష్యం చేశానంటూ..

పరిశ్రమకు చెందిన పలువురు హీరోయిన్లు అరుదైన వ్యాధులు బారిన పడుతున్నారు.. పడ్డారుు. సమంత మయోసైటిక్, రేణు దేశాయ్ గుండె సంబంధిత సమస్యలతో పోరాడుతున్నారు. గతంలో మనీషా, పోనాలి బింద్రే వంటి వారు క్యాన్సర్ ను జయించారు.

పరిశ్రమకు చెందిన పలువురు హీరోయిన్లు అరుదైన వ్యాధులు బారిన పడుతున్నారు.. పడ్డారుు. సమంత మయోసైటిక్, రేణు దేశాయ్ గుండె సంబంధిత సమస్యలతో పోరాడుతున్నారు. గతంలో మనీషా, పోనాలి బింద్రే వంటి వారు క్యాన్సర్ ను జయించారు.

క్యాన్సర్‌తో పోరాడుతున్న నటి.. అప్పుడు నిర్లక్ష్యం చేశానంటూ..

సినీ పరిశ్రమలో పలువురు హీరోయిన్లు అనారోగ్య సమస్యలతో పోరాడుతున్నారు. టాలీవుడ్ స్టార్ నటి సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడిన సంగతి విదితమే. అలాగే పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి రేణు దేశాయ్ సైతం.. మయో కార్డియల్ బ్రిడ్జింగ్ అనే వ్యాధి ఉన్నట్లు వెల్లడించారు. ఇది తనకు పుట్టుకతోనే వచ్చిందని అన్నారు. అలాగే ఈ హంసా నందిని క్యాన్సర్ రాగా, నటి కమ్ సింగ్ మమతా మోహన్ దాస్ బొల్లి వ్యాధిలో బాధపడ్డారు. గతంలో మనీషా కొయిరాలా, సోనాలి బింద్రే, లిస్సారే, టాలీవుడ్, కోలీవుడ్ నటి గౌతమి కూడా క్యాన్సర్ బాధితులే. వీరంతా చికిత్స తీసుకుని.. ప్రాణాలతో తిరిగి బయటపడ్డారు. ఇప్పుడు మరో నటికి ఈ మహమ్మారి సోకింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది.

పలు సీరియల్స్, షోస్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ పాపులర్ టీవీ నటి డాలీ సోహి క్యాన్సర్‌తో పోరాడుతోంది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో పంచుకుంది. క్యాన్సర్‌తో ఆమె ఎలా ఫైట్ చేస్తుందో వెల్లడించింది. అందులో గుండుతో ఉన్న ఫోటోను చూసి చాలా మంది షాక్ అయ్యారు. ’ మీ ప్రేమ ప్రార్థనలు పంపినందుకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు, జీవితం రోలర్ కోస్టర్ లా మారింది. కానీ పోరాడే శక్తి ఉన్నప్పుడు ప్రయాణం సులభం అవుతుంది. ఈ జర్నీలో సర్వైవ్ అవ్వాలనుకుంటున్నారా, బాధితులు అవ్వాలనుకుంటున్నారా. అది మీ ఛాయిస్’ అంటూ పేర్కొంది. డాలీ సోషి కలాష్, క్కుసుమ్, దేవోన్ కే దేవ్, మహాదేవ్, కుంకుమ భాగ్య, బాబి, హిట్లర్ దీదీ వంటి సీరియల్స్ లో కనిపించింది.

ప్రస్తుతం ఆమె పరిణీతిలో నటిస్తుంది. సిందూర్ కీ కీమత్, పియా అభిమాని, ఝనక్ వంటి సీరియల్లో కూడా కనిపిస్తోంది. ఇప్పుడు ఆమె చికిత్స తీసుకుంటుంది. కీమో థెరపీ రెండవ సెషన్‌కు సిద్ధమైతుంది. 6-7 నెలల క్రితం లక్షణాలు ఉన్నట్లు గుర్తించానని, కానీ నిర్లక్ష్యం చేశానంటూ పేర్కొంది. కానీ నొప్పి ఎక్కువ కావడంతో గైనకాలజిస్ట్‌ని కలవగా.. పరీక్షలు చేసి.. గర్భాశయాన్ని తీసివేయాలని చెప్పారని, ఆ తర్వాత మరిన్నీ పరీక్షలు చేసి గర్భాశయ క్యాన్సర్ అని డిక్లేర్ చేసినట్లు చెప్పారు. ఈ విషయం తెలిసి బాధపడ్డానని, బలంగా ఉండడం తప్ప వేరే మార్గం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయం గురించి తన 14 ఏళ్ల కూతురు అమీలియాతో మాట్లాడటం కష్టమనిపించదన్నారు. ఆమె క్యాన్సర్ తో పోరాడుతున్నట్లు తెలిసి.. పలువురు త్వరగా కోలుకోెవాలని సందేశాలు పెడుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి