iDreamPost

6 రాష్ట్రాలకు విజయ్ హెల్పింగ్ హ్యాండ్

6 రాష్ట్రాలకు విజయ్ హెల్పింగ్ హ్యాండ్

తమిళ స్టార్ హీరో విజయ్ కొంత ఆలస్యంగానే అయినా కరోనా సహాయ చర్యలకు తన వంతు విరాళం బాగానే అందించాడు. అయితే అందరిలాగా తమ రాష్ట్రానికే లేదా పిఎం కేర్స్ కో పరిమితం కాకుండా తనను ఆదరిస్తున్న 6 రాష్ట్రాలకు సొమ్ముని ప్రకటించాడు. వివరాల్లోకి వెళ్తే మాతృ రాష్ట్రం తమిళనాడుకు 50 లక్షలు, కేరళకు 10 లక్షలు, కర్ణాటకకు 5 లక్షలు, ఆంధ్రప్రదేశ్ కు 5 లక్షలు, తెలంగాణకు 5 లక్షలు, పాండిచ్చేరికి 5 లక్షలు ఆయా ముఖ్యమంత్రుల రిలీఫ్ ఫండ్ కు అందజేయబోతున్నాడు.

ఇవి కాకుండా ప్రైమ్ మినిస్టర్ కేర్స్ కి 25 లక్షలు, కార్మికుల సంక్షేమం కోసం ఫెఫ్సీకి 25 లక్షలు ఇలా 1 కోటి 30 లక్షలు తన వంతు సహాయంగా అందజేశాడు. నిజానికి ఇంత ఆలోచనతో ఎవరూ చేయలేదని చెప్పొచ్చు. ఒకరికే మొత్తాన్ని ఇవ్వకుండా ఇలా సమానత్వం పాటించడం విశేషం. సోషల్ మీడియాలో అప్పుడే అభిమానులు దీన్ని ట్రెండింగ్ లో పెట్టడం మొదలెట్టేశారు. విజయ్ కొత్త సినిమా మాస్టర్ విడుదలకు సిద్ధంగా ఉన్నది. కార్తీతో ఖైదీ తీసి అన్ని బాషల సినిమా ప్రేమికులను తనవైపు చూసేలా చేసుకున్న లోకేష్ కనగరాజ్ దీనికి దర్శకుడు. తెలుగు డబ్బింగ్ కూడా సిద్ధం చేశారు.

ఏప్రిల్ 9 రిలీజ్ కు ప్లాన్ చేసుకుంటే కరోనా రూపంలో బ్రేక్ పడింది. ఇప్పుడు పరిస్థితి నార్మల్ అయితే విజయ్ బర్త్ డే రోజు అయిన జూన్ 22 విడుదల చేయాలనీ యూనిట్ ప్లానింగ్ లో ఉంది. విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తుండటంతో మాస్టర్ మీద భారీ అంచనాలు ఉన్నాయి. తుపాకీ, అదిరింది, విజిల్ లాంటి మూవీస్ వల్ల విజయ్ కు తెలుగులో డీసెంట్ మార్కెట్ ఉంది. మాస్టర్ తో కనక అది బలపడితే ఇక్కడా గట్టిగా జెండా పాతొచ్చు. అయితే తెలుగులోనూ స్ట్రెయిట్ సినిమాల తాకిడి అధికంగా ఉన్న నేపథ్యంలో మాస్టర్ ఏ స్లాట్ దక్కించుకుంటాడో చూడాలి. ఒకవేళ జూన్ 22కి సాధ్యపడకపోతే ఆగస్ట్ 15కి ప్లాన్ చేస్తారట

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి