iDreamPost

Pallavi Prashanth: ప్రశాంత్ కి షాకిచ్చిన శివాజీ.. ఇలాంటి వెన్నుపోటు చూసుండరు!

Pallavi Prashanth: ప్రశాంత్ కి షాకిచ్చిన శివాజీ.. ఇలాంటి వెన్నుపోటు చూసుండరు!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 2.0 చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. హౌస్ లో పోటుగాళ్ల ఎంట్రీతో ఆట మరింత వేగం పుంజుకుంది. రెండు గ్రూపులు మధ్య పోరు కావడంతో అందరూ ప్రాణం పెట్టి ఆడుతున్నారు. అయితే అన్ని సీజన్స్ తో పోలిస్తే ఈ సీజన్ లో కాస్త ఆట ఉల్టా పుల్టాగా ఉన్న మాట ఒప్పుకోవాల్సిందే. టాస్కులు మాత్రమే కాదు.. బిగ్ బాస్ తరీఖాలో కూడా చాలా మార్పు కనిపిస్తోంది. ఈ సీజన్ లో పవరాస్త్రం కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు. అయితే హౌస్ మేట్ ని చేసి.. సరిగ్గా ఆడకపోతే పవరాస్త్రం లాగేసుకుంటాం అన్నారు. అలాగే శివాజీ పవరాస్త్రం తీసుకున్నారు. ఇప్పుడు అలాగే పల్లవి ప్రశాంత్ కెప్టెన్ బ్యాడ్జ్ ని కూడా లాగేసుకున్నారు.

బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్ అంటే ఇల్లుని చక్కదిద్దాలి. అన్ని బాధ్యతలు తీసుకోవాలి. అలా చేసినందుకు అతనికి ఇమ్యూనిటీ కూడా ఇస్తారు. అయితే కెప్టెన్ గా చేయడం అంత ఈజీ టాస్కు కాదు. హౌస్ లో ఉన్న వాళ్లు అందరినీ క్రమశిక్షణలో పెట్టాలి. అలా చేయలేకపోతే అతని కెప్టెన్సీ పోతుంది. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ది కూడా కెప్టెన్సీ పోయింది. అయితే కెప్టెన్ సరిగ్గా పనిచేయాలి అంటే హౌస్ లో ఉన్నవాళ్లు అతని మాటకు విలువ ఇవ్వాలి. కానీ, అది హౌస్ లో జరిగినట్లు కనిపించలేదు. పైగా బిగ్ బాస్ అడిగినప్పుడు అందరూ ప్రశాంత్ బ్యాడ్ కెప్టెన్ అంటూ చేతులు ఎత్తి ఓటు వేశారు. అయితే ఎంతమంది చేతులు ఎత్తినా ఆశ్చర్యం కలగలేదు.

ఒక్క శివాజీ చేయి లేపగానే అందరికీ ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఎందుకంటే ఇన్నాళ్లు రైతుబిడ్డ గెలవాలి, పల్లవి ప్రశాంత్ గెలవాలి అంటూ శివాజీ భారీ భారీ డైలాగులు చెప్పాడు. బలహీనుల వెంట తాను ఉంటాను చెప్పాడు. కానీ, ప్రశాంత్ కష్టపడి సాధించుకున్న కెప్టెన్సీని లాగేసుకుంటుంటే మాత్రం చేయి ఎత్తి ఓటువేశాడు. ఇది నిజంగా పల్లవి ప్రశాంత్ కు శివాజీ వెన్నుపోటు అనే చెప్పాలి. మొదటి నుంచి వాడితో ఎవరూ మాట్లాడటం లేదు, వాడిని టార్గెట్ చేస్తున్నారు అని శివాజీ చెప్పుకొచ్చాడు. అందుకే అతని పక్కన నిలబడుతున్నాను అన్నాడు. తీరా కష్టం వచ్చినప్పుడు మాత్రం వాడికి కెప్టెన్సీ చేయడం చేత కావట్లేదు అంటూ చేయి లేపి ఓటేశాడు. నమ్మిన వాళ్లు కూడా మోసం చేసేసరికి కన్నీళ్లు పెట్టుకుంటూ ప్రశాంత్ కెప్టెన్సీ టాస్కుని స్టోర్ రూమ్ లో పెట్టాడు. నిజానికి ఇందులో ప్రశాంత్ తప్పు ఎక్కడా కనిపించదు. ఎందుకంటే ప్రశాంత్ చెప్పిన పని చేయకుండా.. వాళ్లకి నచ్చిన పనులు చేసింది హౌస్ మేట్స్. పైగా పక్కకు వెళ్లి జోకులు కూడా వేసుకున్నారు.

చివరికి ప్రశాంత్ బ్యాడ్ కెప్టెన్ అని ముద్ర వేశారు. కొత్తగా వచ్చిన వాళ్లతో సహా అందరూ ప్రశాంత్ బ్యాడ్ కెప్టెన్ అంటూ చేతులు ఎత్తేశారు. నిజానికి వారిలో చాలా మంది ప్రశాంత్ ఆడిన దాంట్లో సగం ఆట కూడా ఆడలేదు. కానీ, ప్రశాంత్ బ్యాడ్ అనేశారు. బిగ్ బాస్ చేసిన ఈ పని ప్రశాంత్ కే మేలు చేస్తుంది. ఎందుకంటే రెండోవారం నామినేషన్స్ లో టార్గెట్ చేసినప్పుడు ప్రశాంత్ కు ఎక్కడ లేని ఆదరణ లభిచింది. ఇప్పుడు అన్యాయంగా కెప్టెన్సీ లాగేసుకునే సరికి ప్రేక్షకుల్లో ప్రశాంత్ పై సింపథీ మరింత పెరిగింది. ఈ దెబ్బతో పల్లవి ప్రశాంత్ మరోసారి హీరో అయ్యాడు అనే చెప్పాలి. పైగా శివాజీ మరోసారి డబుల్ గేమ్ స్ట్రాటజీ బయటపడింది అని కూడా చెప్పాలి. మరి.. ప్రశాంత్ కు శివాజీ వెన్నుపోటు పొడవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి