iDreamPost

ఇలా అయితే సక్సెస్ రావడం కష్టమే! గోపీ కాస్త మారాలి!

గోపీచంద్‌ విలన్‌గా చేసింది కొన్ని సినిమాలే అయినా.. ఆయన విలనిజానికి కంటూ ఓ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. ఆయన హీరోలతో పోటా పోటీగా నటించి మాస్‌ ప్రేక్షకుల్ని మెప్పించారు.

గోపీచంద్‌ విలన్‌గా చేసింది కొన్ని సినిమాలే అయినా.. ఆయన విలనిజానికి కంటూ ఓ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. ఆయన హీరోలతో పోటా పోటీగా నటించి మాస్‌ ప్రేక్షకుల్ని మెప్పించారు.

ఇలా అయితే సక్సెస్ రావడం కష్టమే! గోపీ కాస్త మారాలి!

తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోగా ఎంట్రీ ఇచ్చి.. తర్వాత విలన్‌గా సత్తా చాటిన అత్యంత కొద్ది మంది హీరోల్లో గోపీ చంద్‌ ఒకరు. 2001లో వచ్చిన ‘తొలివలపు’ సినిమాతో హీరోగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారాయన. మొదటి సినిమాతోటే ప్రేక్షకుల్ని మెప్పించారు. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి కలెక్షన్లనే రాబట్టంది. అయితే, రెండో సినిమాతో విలన్‌ అవతారం ఎత్తారు. మరుసటి ఏడాది విడుదలైన ‘ జయం’ సినిమాలో విలన్‌గా కనిపించారు. ‘తొలివలపు’ సినిమాలో కరుణ, ప్రేమను కురిపించిన ఆయన..

‘జయం’ సినిమాలో క్రూరత్వం, ఓ రేంజ్‌ విలనిజాన్ని పండించారు. ఈ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసింది. బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టించింది. ఆ తర్వాత వచ్చిన నిజం, వర్షం సినిమాల్లో విలన్‌గా నటించి తెలుగు నాట పిచ్చ పాపులారిటీ తెచ్చుకున్నారు. గోపీచంద్‌ విలన్‌గా నిజంలో మహేష్‌ బాబుతో చేసినా.. వర్షంలో ప్రభాస్‌తో చేసినా.. ఆ సినిమాల్లో హీరోలకు పోటీగా నటించారు. గోపీచంద్‌తో నటించటం అంటే.. ఢీ అంటే ఢీ అన్నట్లుగా ఉండేది. వర్షం సినిమా తర్వాత ఆయన విలనిజానికి స్వప్తి పలికారు.

హీరోగా సినిమాలు చేయటం మొదలుపెట్టారు. 2004లో వచ్చిన యజ్ఞం సినిమాతో మళ్లీ హీరోగా మారారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా.. గోపీచంద్‌ నటనకు మంచి మార్కులుపడ్డాయి. సినిమాకు సినిమాకు మధ్య తన పాత్రలో వేరియేషన్స్‌ చూపిస్తూ గోపీ చంద్‌ సినిమాలు చేస్తూ ఉన్నారు. నటన, గ్లామర్‌ అన్ని రకాలుగా గోపీచంద్‌ క్లాస్‌ కటౌట్‌ ఉన్న మాస్‌ హీరో అని చెప్పొచ్చు. గోపీచంద్‌ హీరోగా ఇప్పటి వరకు పాతికకు పైగా సినిమా చేశారు.

అయితే, వీటిలో కొన్ని మాత్రమే హిట్‌గా నిలిచాయి. ఇండస్ట్రీలో తనకంటూ ఓ ఫ్యాన్‌ బేస్‌ ఉన్న గోపీ కంటెంట్‌ విషయంలో తప్పు చేస్తున్నారన్నది సినీ విమర్శకుల అభిప్రాయం. ఆయన తీసిన సినిమాలో ఎక్కువ శాతం విఫలం అవ్వటానికి కారణం.. సరైన కంటెంట్‌ లేకపోవటం.. కొత్త దనం లోపించటమే అని వారు చెబుతున్నారు. మాస్‌ ఇమేజ్‌ ఉన్నా కూడా గోపీ దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం​ చేయటం లేదని అంటున్నారు. కంటెంట్‌ విషయంలో దిద్దుబాటు​ చర్యలు చేపడితే…

ఇండస్ట్రీలో గోపీచంద్‌ను ఢీకొట్టడం ఎవ్వరి తరమూ కాదంటున్నారు. కాగా, గోపీచంద్‌ తాజాగా రామబాణం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. ప్రస్తుతం ఆయన భీమా అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం శరావేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. గోపీచంద్‌ ఈ సినిమాపైనే ఆశలన్నీ పెట్టుకున్నారు. ఇక, భీమా గోపీచంద్‌ కెరీర్‌కు ఏమాత్రం సాయం చేస్తుందో వేచి చూడాల్సిందే.. మరి, గోపీచంద్‌ కంటెంట్‌ విషయంలో తప్పు చేస్తూ.. ప్లాపులు మూటగట్టుకోవటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి