iDreamPost

ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత!

  • Published Feb 03, 2024 | 10:13 AMUpdated Feb 03, 2024 | 10:13 AM

హాలీవుడ్ లో ప్రిడేటర్ లాంటి యాక్షన్ భరిత చిత్రాల్లో నటించి తనదైన మార్క్ చాటుకున్న ప్రముఖ నటుడు ఇక లేరు

హాలీవుడ్ లో ప్రిడేటర్ లాంటి యాక్షన్ భరిత చిత్రాల్లో నటించి తనదైన మార్క్ చాటుకున్న ప్రముఖ నటుడు ఇక లేరు

  • Published Feb 03, 2024 | 10:13 AMUpdated Feb 03, 2024 | 10:13 AM
ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత!

గత కొంతకాలంగా సినీ పరిశ్రమలో తీవ్ర విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకరి తర్వాత ఒకరు సెలబ్రెటీలు చనిపోతున్నారు. నటీనటులు, దర్శక, నిర్మాతలు ఇతర టెక్నికల్ రంగాలకు చెందిన వారు చనిపోవడంతో వారి కుటుంబాల్లోనే కాదు.. వారిని ఎంతగానో అభిమానించే అభిమానులు సైతం విషాదంలో మునిగిపోతున్నారు. చాలా వరకు హార్ట్ ఎటాక్, రోడ్డు ప్రమాదాలు, వయోభారం ఇతర కారణాల వల్ల సెలబ్రెటీలు కన్నుమూస్తున్నారు. హాలీవుడ్ లో ప్రముఖ నటి చితా రివేరా కన్నుమూసిన విషాదం నుంచి కోలుకోకముందే మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు కన్నుమూశారు. వివరాల్లోకి వెళితే..

హాలీవుడ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రఖ్యాత అమెరికన్ నటుడు, దర్శకుడు, మాజీ అమెరికన్ ఫుట్‌బాల్ లైన్‌బ్యాకర్, కార్ల్ వెదర్స్ (76 ) కన్నుమూసినట్లు ఆయన కుటుంబ సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు. న్యూ ఓర్లీన్స్ లో 1948 జన్మించిన వెదర్స్.. దాదాపు ఐదు దశాబ్దాల పాటు సినీ ఇండస్ట్రీ, టెలివిజన్ రంగంలో పనిచేశారు. హాలీవుడ్ లో దాదాపు 75 చిత్రాల్లో నటించారు. కార్ల్ వెదర్స్ ఎక్కువగా యాక్షన్, కామెడీ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నారు. రాకీ, ప్రిడేటర్, హ్యాపీ గిల్మోర్, యాక్షన్ జాక్సన్, అరెస్టెడ్ డెవలప్‌మెంట్ ఇలా ఎన్నో యాక్షన్ భరిత చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు వెదర్స్.

ఇటీవల ‘స్టార్ వార్స్’ స్పిన్-ఆఫ్ సిరీస్ లో నటించాడు. ‘ది మాండలోరియన్’లో బుల్లితెరపై కనిపించాడు.. ఈ డ్రామా సిరీస్‌లో అత్యుత్తమ అతిథి నటుడిగా ప్రైమ్‌టైమ్ ఎమ్మీ అవార్డుకు ఎంపికయ్యాడు. వెదర్స్ 2019 లో ‘టాయ్ స్టోరీ 4’ లో కంబాట్ కార్ల్ పాత్రకు వాయిస్ ఓవర్ ఇచ్చారు. వెండితెరపై నే కాదు.. బుల్లితెరపై వచ్చిన ‘స్ట్రీట్ జస్టిస్’, ‘కాలనీ’,‘ది షీల్డ్’, ‘చికాగో జస్టిస్’,‘బ్రదర్స్’, ‘క్లోజ్ ఎన్‌కౌంటర్స్ ఆఫ్ ది థర్డ్ కైండ్’,‘డెత్ హంట’,‘ది కమ్‌బ్యాక్స్’ లో నటించారు. ఆయన మృతిపై సినీ ప్రముఖులు నివాళులర్పించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి