iDreamPost

Acharya : మెగా మూవీకి గట్టి పోటీనే కానీ

Acharya : మెగా మూవీకి గట్టి పోటీనే కానీ

నిన్న సూర్య కొత్త సినిమా ఎతర్కుమ్ తునిన్ధవన్ విడుదల తేదీని వచ్చే ఏడాది ఫిబ్రవరి 4కి ప్రకటించిన సంగతి తెలిసిందే. పాండి రాజ్ దర్శకత్వం వహించిన ఈ ఊర మాస్ విలేజ్ డ్రామాలో సూర్యని సరికొత్త అవతారంలో చూడబోతున్నట్టు ఇప్పటికే టాక్ ఉంది. పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో హెవీ ఎమోషనల్ కథలను తెరక్కికిస్తాడని పేరున్న పాండిరాజ్ ఇందులో కూడా అదే రిపీట్ చేయబోతున్నట్టు పోస్టర్లు చూస్తేనే అర్థమైపోతుంది. అదే రోజు మెగాస్టార్ చిరంజీవి ఆచార్య కూడా రిలీజ్ డేట్ లాక్ చేసుకుని ఉంది. ఈ అనౌన్స్ మెంట్ వచ్చి కూడా నెల దాటుతోంది. మరి సూర్య మూవీ వల్ల ఆచార్యకు ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా అనే కోణంలో అభిమానులు ఆలోచిస్తున్నారు.

ప్రాక్టికల్ గా చూసుకుంటే ఆచార్యకు ఇదసలు పోటీనే కాదు. ఎందుకంటే సూర్య థియేట్రికల్ మార్కెట్ గతమంత ఘనంగా లేదు. చాలా కాలం నుంచే ఓపెనింగ్స్ తగిపోయాయి. ఈ నేపథ్యంలో చాలా క్రేజ్ ఉన్న ఆచార్యకు థ్రెట్ ఇవ్వడం జరగని పని. ఆలా అని తక్కువ అంచనా వేయలేం కానీ స్క్రీన్ల విషయంలో బిజినెస్ పోటీలో రెండింటి మధ్య చాలా వ్యత్యాసం అయితే ఉంటుంది. ఒక చిక్కు మాత్రం ఉంది. ఆచార్యని బలంగా తీసుకెళ్లాలనుకుంటున్న కర్ణాటక, కేరళలో వసూళ్ల పరంగా కొంత ప్రభావం ఉండొచ్చు. సూర్యకు అక్కడ ఫాలోయింగ్ ఉంది కాబట్టి పంచుకోవడాలు తప్పకపోవచ్చు. ముఖ్యంగా మల్లు వుడ్ లో.

అసలు ఇంతకీ ఇలా జనవరి నుంచి ఏప్రిల్ దాకా రిలీజులు ఫిక్స్ చేసుకున్న సినిమాలన్నీ చెప్పిన టైంకి వస్తాయా రావా అంటే గ్యారెంటీగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. ముందైతే ప్రకటనలు ఇచ్చేస్తున్నారు కానీ ఎప్పటికప్పుడు జరుగుతున్న పరిణామాలు చాలా మార్పులకు దారి తీస్తున్నాయి. ఇప్పటికీ డిసెంబర్ లో రావాల్సిన సినిమాల గురించే పూర్తి క్లారిటీ రావడం లేదు. అలాంటిది ఇక ఫిబ్రవరి గురించి చెప్పేదేముంటుంది. సూర్య మూవీ గురించి కాకపోయినా ఇతరత్రా కారణాల వల్ల ఆచార్య ముందుకో వెనక్కో జరగొచ్చనే టాక్ కూడా ఫిలిం నగర్ లో ఉంది. ఇదంతా ఎలా ఉన్నా డిసెంబర్ మూడో వారం నుంచి కనీసం రెండు భారీ సినిమాల మధ్య క్లాష్ తప్పేలా లేదు. ప్రేక్షకులకు ఆప్షన్లు పెరుగుతాయి కానీ నిర్మాతలకే లేనిపోని టెన్షన్లు

Also Read : Bunty Aur Babli 2 : 16 ఏళ్ళ తర్వాత వచ్చిన సీక్వెల్ ఎలా ఉంది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి