iDreamPost

Acharya & Sarkaru Vaari Paata : ఔను అందుకే వాళ్ళు తేదీలు మార్చుకున్నారు

Acharya & Sarkaru Vaari Paata : ఔను అందుకే వాళ్ళు తేదీలు మార్చుకున్నారు

నిన్న ఉన్నట్టుండి ఆచార్య విడుదల తేదీని ప్రకటించడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుంది. మహేష్ బాబు అభిమానులు షాక్ తిన్నారు. కారణం గతంలో అదే డేట్ ని సర్కారు వారి పాటకి లాక్ చేయడమే. దీంతో మెగాస్టార్ సూపర్ స్టార్ క్లాష్ తప్పదేమో అనుకున్న వాళ్ళు లేకపోలేదు. కానీ వాస్తవానికి మహేష్ టీమ్ నుంచి క్లారిటీ తీసుకున్నాకే ఆచార్యని ఏప్రిల్ 1కి ఫిక్స్ చేశారని తెలిసింది. ఇంకా నలభై శాతం దాకా షూటింగ్ పెండింగ్ ఉండటం, కోవిడ్ అటాక్, అన్నయ్య రమేష్ బాబు కాలం చేయడం లాంటి పరిణామాల దృష్ట్యా హడావిడిగా షూటింగ్ వద్దని మహేష్ దర్శకుడు పరశురామ్ కి సూచించడంతో నెమ్మదించారని తెలిసింది.

ఈ లెక్కన సర్కారు వారి పాట సమ్మర్ కి రావడం కూడా అనుమానమే. ఆగస్ట్ రిలీజ్ ని టార్గెట్ చేస్తున్నారని తెలిసింది. మహేష్ ఫ్యాన్స్ మాత్రం మైత్రి మీద బాగా గుస్సాగా ఉన్నారు. తమ హీరో సినిమా కన్నా బాగా వెనుకబడి ఉన్న పుష్ప పార్ట్ 1ని అంత వేగంగా పూర్తి చేసినప్పుడు దీనికి కనీసం అప్ డేట్స్ అయినా సరిగా ఇవ్వలేకపోవడం ఏమిటనేది వాళ్ళ కంప్లయింట్. సో ఇప్పటికైతే ఎలాంటి పాటలు కానీ టీజర్లు కానీ వచ్చే అవకాశం లేనట్టే. కొత్త డేట్ ని కన్ఫర్మ్ చేసుకున్నాక అప్పుడు ప్రమోషన్లు మొదలుపెడతారు. మహేష్ కరోనా నుంచి పూర్తిగా కోలుకుని నెగటివ్ తెచ్చేసుకున్నాడు కానీ తిరిగి ఎప్పటి నుంచి షూట్ లో పాల్గొనేది తెలియాల్సి ఉంది

ఇక ఉగాదిని లక్ష్యంగా పెట్టుకుని ఏప్రిల్ 1 వస్తున్న ఆచార్య రెండు నెలలు ఆలస్యం అవుతున్నా అంతకన్నా ఆప్షన్ ప్రస్తుతానికి లేదు. ఒమిక్రాన్ తాలూకు భయాలన్నీ తొలగిపోయి, దేశమంతా మళ్ళీ సాధారణ పరిస్థితులు నెలకొంటే తప్ప ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ లాంటి సినిమాలు రాలేవు. పుష్ప ఫలితం చూశాక ఆచార్య కూడా పాన్ ఇండియా రిలీజ్ ని గట్టిగానే ప్లాన్ చేసుకుంటోంది. ట్రిపులార్ దెబ్బకు చరణ్ కు నార్త్ లోనూ ఇమేజ్ వచ్చేసింది కాబట్టి మాస్ కంటెంట్ ఉన్న ఆచార్యకు అక్కడ మంచి రన్ ని ఆశించొచ్చు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పూజా హెగ్డే, కాజల్ అగర్వాల్ హీరోయిన్లు కాగా సోను సూద్ విలన్ గా చేశాడు

Also Read : Super Machi : సూపర్ మచ్చి రిపోర్ట్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి