iDreamPost

సిమెంట్ ఫ్యాక్టరీలో ప్రమాదం.. ఐదుగురు కార్మికులు మృతి!

సిమెంట్ ఫ్యాక్టరీలో ప్రమాదం.. ఐదుగురు కార్మికులు మృతి!

సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులో ఘోర ప్రమాదం జరిగింది. సింమెంట్ ఫ్యాక్టరీలో ప్రమాదం సంభవించి మొత్తం ఐదుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. క్షతగాత్రులను చికిత్స కోసం దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఒక్కసారిగా స్థానికులు ఉలిక్కి పడ్డారు. కాంక్రీట్ పని చేస్తుండగా లిఫ్టు ఒక్కసారిగా కూలిపోయింది. దాంతో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మందికి గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. లిఫ్ట్ దాదాపు 600 అడుగుల ఎత్తు నుంచి పడినట్లు సమాచారం. అంత ఎత్తు నుంచి కిందపడి కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.

ఐదుగురు చనిపోగా.. ముగ్గురు మృతదేహాలను వెలికి తీశారు. మరో ఇద్దరి మృతదేహాలు బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. శిథిలాల కింద మరి కొంతమంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఫ్యాక్టరీలో కొత్తగా నిర్మిస్తున్న యూనిట్-4 వద్ద ఈ ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. గతకొన్నాళ్లుగా ఈ యూనిట్ నిర్మాణం జరుగుతోంది. అయితే ఈ యూనిట్ నిర్మాణం కోసం సంస్థ వద్ద ఎలాంటి అనుమతులు కూడా లేవని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రమాద బాధితులు ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి