iDreamPost

ఆ దమ్మేదీ రాధాకృష్ణ ..??

ఆ దమ్మేదీ రాధాకృష్ణ ..??

సిలోన్ కంచు , సినీ మంచు రెండూ రీమిక్స్ చేసి తయారు చేసిన జైలు గంట లాంటి గొంతుతో పదే పదే దమ్మున్న ఛానెల్, దుమ్ము రేపే ఛానెల్ అని డబ్బా కొట్టుకొనే వేమూరి రాధాకృష్ణ ఏబీఎన్ చానల్ దమ్ము దుమ్ములో కలిసిందేమోనని ఈ రోజు ఆ ఛానెల్, పత్రిక చూసిన పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

గతంలో ఆంధ్రజ్యోతిలో ఎంతో మంది పై ఎన్నోన్నో సంచలన ఆరోపణలు చేస్తూ కధనాలు రాధా కృష్ణ సారథ్యంలో వెలువడ్డాయని వారు గుర్తు చేస్తున్నారు. నిర్దిష్ట సాక్ష్యం లేకపోయినా ఆంతరంగిక వర్గాల సమాచారంతో , విశ్వసనీయ వర్గాలు వెల్లడించిన అంశాలతో , పలువురు విశ్లేషకుల అభిప్రాయాల మేరకు అంటూ కధనాలు వండి వార్చిన ఏబీఎన్ ఛానెల్, పేపర్ ఈ రోజు ఎందుకు మూగబోయాయని రాధా కృష్ణ ను ప్రశ్నిస్తున్నారు.

14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి , పలు రంగాల్లో ప్రపంచానికి దిశా నిర్దేశం చేసిన నాయకుడు చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి శ్రీనివాస్ నివసించే కంచుకోట అపార్ట్మెంట్ ప్లాట్ లో ఇంకా మరికొన్నిచోట్ల ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు జరిపారు. రెండు వేల కోట్లు దారి మళ్లించారని గుర్తించాం అంటూ పత్రికా ప్రకటన ఇస్తే అది రాధా కృష్ణకు సరిగ్గా కనపడనట్లు తూతూ మంత్రంగా వార్త రాయడంపై పరిశీలకులు ఆశ్చర్యపోతున్నారు. రాధా కృష్ణ కు వయసైపోయి దృష్టి వినికిడి శక్తి తగ్గిపోయి పేర్లు వినపడలేదేమో అని అనుమానిస్తున్నారు.

రాధా కృష్ణ దీర్ఘ దృష్టికి ప్రపంచంలో ఎవరైనా కనపడతారు. ఆయన సుదీర్ఘ కర్ణాలకి ఎవరి ఆంతరంగిక చర్చలైనా వినపడతాయి గాని ఒక్క బాబు గారి వార్తలు తప్పా అనే నానుడి నిజమని నేటికి ససాక్ష్యంగా నిరూపితమైంది అని ప్రజలు తీర్మానించుకుంటున్నారు.

అప్పట్లో జగన్ కోళ్ల ఫారం యజమాని లాంటి వాడు, ప్రజలని బ్రాయిలర్ కోళ్లలా భావించి పెంచి కోసుకుతింటాడు.. అంటూ అత్యంత క్రూరంగా విశ్లేషించిన మానసిక విశ్లేషకులు నేడు ఏమయ్యారని రాధా కృష్ణను ప్రజలు, రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.

వాచీ , ఉంగరం , తాడు బొంగరం లేవని చెప్పుకు తిరిగే చంద్రబాబు పీఎస్ వద్దే రెండు వేల కోట్లు దొరికితే.. దొరకనివి ఇంకెంత ఉంటాయో అనే అంచనాలు ఆంధ్రజ్యోతి పత్రిక, ఛానెల్ లో ఎందుకు వేయలేదోనని చర్చించుకుంటున్నారు.

ప్రతి ఏడాది చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యుల ఆస్తుల చిట్టా అబద్దాలతో ప్రకటించినప్పుడు తాటికాయ అంత అక్షరాలతో పెపంచ నిజాయితీ పరుల ఆస్తుల ప్రకటన చూడండి అని కధనాలు గుప్పించే రాధా కృష్ణ పత్రికలో.. ఈ రోజు రాసిన వార్తలో ఈ వ్యక్తి బాబు గారి పీఎస్, ఇతని దగ్గరే రెండు వేల కోట్లు దొరికితే బాబు గారి దగ్గర ఎన్ని లక్షల కోట్లు ఉండొచ్చోనన్న ఎస్టిమేషన్ స్లిప్పు రాయలేదేందుకని ప్రశ్నిస్తున్నారు.

1360 కోట్ల పెట్టుబడుల కేసును అందులో చాలా మంది పెట్టుబడి దారులు లాభాలతో ఉపసంహరించుకున్న విషయాన్ని విస్మరించి మసిపూసి లక్ష కోట్లు దోచాడు…ఇడుపులపాయలో దాచాడు అన్నరాధా కృష్ణ ఈ రోజు బాబు గారి ఇల్లు, కార్యాలయాల్లో సోదా చేస్తే ఇంకెంత అక్రమ ఆస్తి బయటపడుతుందో అని వ్యాఖ్యానాలు ఎందుకు చేయలేదని ఆలోచిస్తున్నారు.

లోటస్ పాండ్ లో ఇంటిని గోడలు స్కాన్ చేశారని, అంగుళం అంగుళం టేపులతో కొలిచారని, 70 గదులున్నాయని, మినీ బార్లు ఉన్నాయని పుంఖానుపుంఖాలుగా కధనాలు రాసిన రాధా కృష్ణ పత్రికలో బాబు గారి ఇంటి గురించి రాయరెందుకు..? అనే ప్రశ్న సంధిస్తున్నారు. కుటుంబ సభ్యులు, ఆంతరంగిక సిబ్బంది తప్ప పార్టీ ముఖ్యులు, బంధువులు, అన్యులు కన్నెత్తి చూడలేని పెద్ద కంచుకోట లాంటి బాబు గారి భవనంలో సోదాలు చేయాలని , అక్రమాలని వెలుగులోకి తేవాలని రాధా కృష్ణ నినదించరెందుకు ..?

రాధా కృష్ణ కు చంద్రబాబు అంటే భయమా, భక్తా, ప్రేమా, విశ్వాసమా ? అనేది ప్రజలకు, పరిశీలకులకు అర్ధం కాకుండా ఉంది.

ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు , ప్రజాస్వామ్యానికి మీడియా మూల స్తంభం అని చెప్పుకునే రాధా కృష్ణ తన మీడియా విశ్వసనీయత నిరూపించుకొనే సమయం ఆసన్నమైనది.

ఐటీ సోదాల్లోని నిజానిజాలు వారి పేర్లు నిర్భీతిగా వెల్లడించాలని, ఇంకా సోదాలకు దొరకని ఆస్తులు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం తో రాధా కృష్ణ బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉంది.

దొరికిన రెండు వేల కోట్లతో పాటు దొరకనివి మొత్తం లెక్కగట్టి ప్రపంచానికి రాధా కృష్ణ వెల్లడించాలి. లేదా అందరూ బహిరంగంగా అంటున్నట్టు రాధా కృష్ణ దమ్ము , ధైర్యం, లేపే దుమ్ము అన్నీ బాబు గారి విజనరీని అనుసరించి, వారి కోసం, వారి అవసరాల కోసం మాత్రమే పని చేస్తాయని, వారికి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడాల్సి వచ్చిన విశ్వసనీయ పెట్ లాగా తోక ఊపుతూ కుయ్ కుయ్ మని మూలగడమే తప్ప భౌ మంటూ అరిచి పట్టించే పని చేయవని ఒప్పుకోవాలని సూచిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి