iDreamPost

అమీతుమీ డీల్స్ – కాయిన్స్ తో గేమ్స్

అమీతుమీ డీల్స్ – కాయిన్స్ తో గేమ్స్

మొన్న ఎలిమినేషన్లకు నామినేషన్లను ఖరారు చేసిన బిగ్ బాస్ కొత్తగా వెరైటీ టాస్కులతో ఎవరు కెప్టెన్ గా వ్యవహరించాలి ఎవరు బయటికి వెళ్ళాలి అనేదాని మీద గట్టి ఫోకస్ పెట్టాడు. గత కొద్దిరోజులుగా కార్యక్రమం చప్పగా సాగుతోందన్న కామెంట్స్ కు బదులిచ్చేలా మంచి మసాలా జత చేసే ప్రయత్నం జరిగింది. అమితుమీ పేరుతో ఇచ్చిన టాస్కులు పార్టిసిపెంట్స్ రెండు బృందాలుగా విడిపోయారు. రెడ్ టీమ్ పేరుతో ఉన్న అరియనా జట్టులో అభిజిత్, మెహబూబ్, లాస్య, అవినాష్, మోనాల్ లు ఉన్నారు. బ్లూ టీమ్ పేరుతో ఉన్న అఖిల్ జట్టులో హారిక, నోయల్, దివి, కుమార్, అమ్మ జశేఖర్ ఉన్నారు. సోహైల్ ఈ టాస్కుకి కో ఆర్డినేటర్.

రెండు టీమ్ లకు బిగ్ బాస్ నుంచి సమానమైన సంఖ్యలో కాయిన్స్ అందాయి. ఇందులో గెలవాలంటే బిగ్ బాస్ తో ఎవరైతే ఎక్కువ డీల్స్ కుదుర్చుకుని ఎక్కువ గోల్డ్ కాయిన్స్ ఖర్చు పెడతారో వాళ్ళు విజేతగా నిలుస్తారు. అంటే కాయిన్స్ తక్కువగా ఉన్న వాళ్ళు విన్నర్స్ అన్నమాట. ఇందులో భాగంగా మొత్తం 6 డీల్స్ ఇచ్చాడు బిగ్ బాస్.
మొదటి డీల్ లో ఎవరైనా ఒక సభ్యుడు 10 కాయిన్స్ చెల్లింది ఒంటిమీద బట్టలను ముక్కలుగా కత్తిరించుకోవాలి. దీన్ని కుమార్ సాయి దిగ్విజయంగా పూర్తి చేశాడు. రెండో డీల్ లో 20 కాయిన్స్ చెల్లించి ఎవరైనా సభ్యుడు ఒంటి మీద బట్టలు తప్పించి మిగిలిన వస్తువులన్నీ బయటికి పంపేయాలి. ఇందులో అభిజిత్ నెగ్గాడు.

మూడో డీల్ లో 25 కాయిన్స్ ఇచ్చి ఓ అమ్మాయి మెడదాకా జుత్తు కత్తిరించుకుని ఎరుపు రంగును వేయించుకోవాలి. హారిక వాళ్ళన్నయ్యకు సారీ చెబుతూ ఏడుస్తూ తన కురులు కొంత త్యాగం చేసింది. ఈ కటింగ్ ప్రోగ్రాం నోయెల్ చేశాడు. నాలుగో డీల్ లో 20 కాయిన్స్ చెల్లింది ఇసుక మూటను నిర్దేశించిన మార్క్ కిందకు వెళ్లకుండా గట్టిగా పట్టుకోవాలి. కుమార్ సాయి నొప్పి భరించలేక కేకలు పెడుతూనే పదిహేను నిమిషాల పాటు పట్టుకుని నిలిచాడు. ఐదో డీల్ లో 20 కాయిన్స్ చెల్లించి ఓ సభ్యుడు పంపే వస్తువులతో రెండు గ్లాసుల డ్రింక్ తయారు చేసుకుని తాగాలి. లాస్య చకచకా ఈ పని పూర్తి చేసేసింది. ఆరో డీల్ లో 20 కాయిన్స్ చెల్లించి పొట్టిగా కనిపించే జ్యుట్ బట్టలు వేసుకోవాలి. దీనికి మోనాల్ ఎక్కువ ఆలోచించకుండా ఆ రూపంలో దర్శనమిచ్చేసింది. మొత్తం రెండు టీమ్ లు సరిసమానంగా మూడేసి డీల్స్ చేసి ఈ రోజు డ్రామాకి రంగం సిద్ధం చేశాయి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి