iDreamPost

OTT Movie: OTT లోకి మలయాళ బ్లాక్ బస్టర్ “ఆడు జీవితం”.. స్ట్రీమింగ్ ఎక్కడంటే !

  • Published Apr 25, 2024 | 11:15 AMUpdated Apr 26, 2024 | 6:15 PM

కొత్త కొత్త సినిమాలన్నీ కూడా ఓటీటీ లోకి వచ్చేందుకు సిద్ధం అయిపోయాయి. దీనితో థియేటర్స్ లో ఈ సినిమాలను మిస్ అయిన ప్రేక్షకులు ఆయా సినిమాల ఓటీటీ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మరొక కొత్త సినిమా ఓటీటీ లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అయినట్లుగా టాక్ వినిపిస్తోంది.

కొత్త కొత్త సినిమాలన్నీ కూడా ఓటీటీ లోకి వచ్చేందుకు సిద్ధం అయిపోయాయి. దీనితో థియేటర్స్ లో ఈ సినిమాలను మిస్ అయిన ప్రేక్షకులు ఆయా సినిమాల ఓటీటీ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మరొక కొత్త సినిమా ఓటీటీ లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అయినట్లుగా టాక్ వినిపిస్తోంది.

  • Published Apr 25, 2024 | 11:15 AMUpdated Apr 26, 2024 | 6:15 PM
OTT Movie: OTT లోకి మలయాళ బ్లాక్ బస్టర్ “ఆడు జీవితం”.. స్ట్రీమింగ్ ఎక్కడంటే !

థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ టాక్ సంపాదించుకున్న సినిమాలన్నీ కూడా ఓటీటీ లోకి వచ్చేందుకు రెడీ అయిపోతున్నాయి. ఈ వారం అన్నీ కూడా ఓటీటీ లో అలాంటి చిత్రాలే రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా మరొక ,మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ ఓటీటీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు బజ్ నడుస్తోంది. మలయాళ సినిమాల ప్రభావం రాను రాను తెలుగు ప్రేక్షకుల మీద బాగానే ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఈ మధ్య కాలంలో మలయాళంలో వచ్చిన రెండు సినిమాలు కలెక్షన్స్ పరంగా కూడా వసూళ్లను బాగానే రాబట్టాయి. ఇక ఇప్పుడు మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ సంపాదించుకున్న “ఆడు జీవితం” సినిమా ఓటీటీ లోకి రానున్నట్లు టాక్ వినిపిస్తోంది. మరి ఈ సినిమా ఎప్పుడు ఏ ప్లాట్ ఫార్మ్ లో స్ట్రీమింగ్ కానుంది అనే విషయాలను చూసేద్దాం.

మలయాళంలో పృథ్విరాజ్ సుకుమారన్ నటించిన ఒక సర్వైవల్ థ్రిల్లర్ “ఆడు జీవితం”. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పటినుంచి.. ప్రేక్షకులలో భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఇక అంచనాలకు తగినట్టుగానే థియేటర్ లో రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా.. కేవలం 25 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్ల వసూళ్లను రాబట్టి.. సెన్సషనల్ రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పటివరకు అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రాలలో ఒకటిగా ఈ చిత్రం నిలిచిపోయింది. ఈ చిత్రానికి బ్లేస్సి దర్శకత్వం వహించారు. మార్చి 28 వ తేదీన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది ఈ చిత్రం. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ ఎంట్రీ పై భారీగా బజ్ నడుస్తుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో మే 10 నుంచి ఈ సినిమా హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై మేకర్స్ నుంచి ఇంకా అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

Malayalam Blockbuster Aadu Jivan into OTT

ఇక ఆడుజీవితం సినిమా కథ విషయానికొస్తే.. ఇది మొత్తం కూడా కేరళకు చెందిన నజీబ్ అనే వ్యక్తి కథ. ఈ సినిమాను కొన్ని వాస్తవ సంఘటనలను ఆధారంగా తీసుకుని తెరకెక్కించారు. ఈ సినిమాలో ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన నజీబ్ అనే వ్యక్తి ఎటువంటి ఇబ్బందులకు ఎదుర్కున్నాడు. అనే కథాంశంతో ఈ సినిమా కొనసాగుతుంది. ఈ సినిమాలో హీరో నటనకు ప్రత్యేక ప్రశంసలు దక్కాయి. థియేటర్స్ లో యూనానిమస్ హిట్ టాక్ సంపాదించుకున్న ఈ సినిమా ఓటీటీ లో కూడా ప్రేక్షకులను అలరిస్తుందని చెప్పడంలో.. ఏ మాత్రం సందేహం లేదు. మరి ఆడు జీవితం సినిమా ఓటీటీ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి .

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి