iDreamPost
android-app
ios-app

వీడియో: పట్టాలపై పడిపోయిన బుడ్డొడు.. హీరోలా వచ్చి కాపాడిన యువకుడు!

  • Published Aug 13, 2023 | 4:18 PM Updated Updated Aug 13, 2023 | 4:18 PM
  • Published Aug 13, 2023 | 4:18 PMUpdated Aug 13, 2023 | 4:18 PM
వీడియో: పట్టాలపై పడిపోయిన బుడ్డొడు.. హీరోలా వచ్చి కాపాడిన యువకుడు!

అప్పడప్పుడు మనం చేసే చిన్న చిన్న పొరపాట్లే మనల్ని ప్రమాదంలోకి తీసుకెళ్తుంటాయి. చివరికి ప్రాణాలు కూడా పోతుంటాయి. ఇక రెప్పపాటును కొందరు సాయం చేయడం వల్ల తిరిగి బతికి బట్ట కడుతుంటాము. అచ్చం ఇలాగే ఓ బాలుడు రైల్వే స్టేషన్ లో తల్లితో పాటు నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇక మరి కొద్ది క్షణాల్లో రైలు వస్తుందనగా ఆ చిన్నోడు రైలు పట్టాలపై పడిపోయాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన ఓ యువకుడు హీరోలా వచ్చి ఆ బాలుడి ప్రాణాలను రక్షించాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది.

ఓ మహిళ తన కుమారుడితో పాటు ఓ రైల్వే స్టేషన్ లో నడుచుకుంటూ వెళ్తుంది. అలా వెళ్తున్న సమయంలో మరి కొద్ది క్షణాల్లో రైలు వస్తుందనగా ఆ బుడ్డోడు ప్రమాదవశాత్తు రైలు పట్టాలపై పడిపోయాడు. రైలు వచ్చే సమయంలోనే కొడుకు పడిపోవడంతో ఆ తల్లి కాపాడండి అంటూ పెద్దగా కేకలు వేసింది. దీంతో వెంటనే మరోక ప్లాట్ ఫామ్ పై ఉన్న ఓ యువకుడు దీన్ని చూసి అప్రమత్తమయ్యాడు.

ఇక హీరోలా వచ్చి కళ్లు మూసి తెరిచేలోపు పట్టాలపై పడిపోయిన ఆ బుడ్డోడిని రక్షించాడు. ఈ దృశ్యాలన్నీ రైల్వే స్టేషన్ లో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఇదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్స్ సినిమా స్టైల్ ఆ చిన్నారిని బలె రక్షించాడు. సూపర్ భయ్యా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందనేది మాత్రం ఇంకా తెలియరాలేదు.

ఇది కూడా చదవండి: వీడియో: బాలికపై ఆవు దాడి.. కొమ్ములతో కుమ్ముతూ..

Jojobet GirişbetparkGrandpashabetgrandpashabetGrandpashabetMeritkingCasibomCasibomcasibomjojobet günceldeneme bonusu veren sitelerMadridbetMadridbetMadridbetJojobetnakitbahisJojobetjojobetjojobetgrandpashabetcasibomcasibomcasibomcasibomcasibom girişholiganbetjojobetbetciojojobetcasibomJojobetbetcio