iDreamPost

60 ఏళ్ల వయసులో సీనియర్ కాంగ్రెస్ నేత పెళ్లి

60 ఏళ్ల వయసులో సీనియర్ కాంగ్రెస్ నేత పెళ్లి

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, కేంద్ర మాజీ మంత్రి ముకుల్ వాస్నిక్ తన స్నేహితురాలు రవీనా ఖురానాను ఫైవ్ స్టార్ హోటల్‌లో ఒక ప్రైవేట్ కార్యక్రమంలో వివాహం చేసుకున్నారు. కాగా 60 ఏళ్ల వయసులో ముకుల్ వాస్నిక్ తన చిరకాల మిత్రురాలిని వివాహమాడటం విశేషం. ఈ వివాహానికి పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు హాజరయ్యారు. ఈ వివాహంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అహ్మద్ పటేల్ పాల్గొన్నారు.

రాహుల్ గాంధీ రాజీనామా తరువాత కాంగ్రెస్ అధ్యక్ష పదవికి సీనియర్ కాంగ్రెస్ నాయకుడైన ముకుల్ వాస్నిక్ పేరు వెలుగులోకి వచ్చింది. ముకుల్ వాస్నిక్ 1984 లో జరిగిన ఎన్నికల్లో బుల్దానా లోక్ సభ నియోజక వర్గం నుండి గెలిచి పార్లమెంట్ లో అడుగుపెట్టారు. 25 సంవత్సరాల వయసులోనే పార్లమెంటులో అడుగుపెట్టిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించారు.

కాగా ముకుల్ వాస్నిక్ రాజకీయ ప్రయాణం గెలుపు ఓటముల మధ్యే కొనసాగింది.1984 నుండి జరిగిన ఎన్నికల్లో గెలుపు తరువాత ఓటమి, ఓటమి తరువాత గెలుపు అన్నట్లుగా ఆయన పయనం కొనసాగింది. కాగా 2009 లో చివరగా రాంటెక్ లోక్ సభ నియోజకవర్గం నుండి గెలిచిన ముకుల్ వాస్నిక్ 2014 లో జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 2019 లో పోటీ చేయలేదు.

తన చిరకాల మిత్రురాలైన రవీనా ఖురానాను వివాహమాడిన ముకుల్ వాస్నిక్ కు పలువురు రాజకీయ నేతలు అభినందనలు తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి