iDreamPost

బిడ్డ కోసం విధిరాతని ఎదిరిస్తున్న అమ్మ కథ! సాయంగా అడుగేద్దామా?

Fund Raising For Premature Baby: జీవితంలో అందరూ సంతోషంగా ఉండాలనే అనుకుంటారు. కానీ, కొందరి జీవితాల్లో మాత్రం ఊహించని సంఘటనల దుఃఖమే తలుపు తడుతుంది. కానీ, చేయి చేయి కలిపితో ఆ దుఃఖాన్ని తరిమేయచ్చు.

Fund Raising For Premature Baby: జీవితంలో అందరూ సంతోషంగా ఉండాలనే అనుకుంటారు. కానీ, కొందరి జీవితాల్లో మాత్రం ఊహించని సంఘటనల దుఃఖమే తలుపు తడుతుంది. కానీ, చేయి చేయి కలిపితో ఆ దుఃఖాన్ని తరిమేయచ్చు.

బిడ్డ కోసం విధిరాతని ఎదిరిస్తున్న అమ్మ కథ! సాయంగా అడుగేద్దామా?

తలరాత బ్రహ్మ రాస్తాడు. దాన్ని మార్చగలిగే శక్తి ఎవ్వరికీ లేదంటారు. కానీ.., బిడ్డ ప్రాణాల మీదకి వస్తే అమ్మ చేసే పోరాటం ముందు ఏ దేవుడు నిలవలేదు. సృష్టి మొత్తం ఒకవైపు నిలిచినా.. చెంగు చాటున బిడ్డని దాచి, చివరి రక్తపు బొట్టు వరకు పోరాడుతుంది. అలాంటిది  పొత్తిళ్ళలో ఉన్న రోజుల బిడ్డకి ప్రాణాల మీదకి వస్తే.. తల్లి ఇంతటి ఆరాటం పడుతుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం హైదరాబాద్ లోని రెయిన్ బో ఆస్పత్రిలో 20 రోజులుగా ఓ అమ్మ ఇలాంటి యుద్ధాన్నే చేస్తోంది. కవలలకు జన్మనిచ్చిన ఆ తల్లి.. ఇప్పటికే ఓ బిడ్డని కోల్పోవడంతో,  మరో బిడ్డనైనా బతికించుకోవాలని పరితపిస్తోంది. కంటికి నిద్ర లేకుండా, కడుపుకి తిండి లేకుండా కూర్చొని.. తన బంగారు కొండని బతికించే సాయం ఎవరు చేస్తారా అని, నిస్సహాయ స్థితిలో దాతల కోసం ఎదురుచూస్తోంది.

ఒక తల్లికి ఊహించని కష్టం వచ్చింది. తన బిడ్డను కాపాడుకోవడం కోసం డొనేషన్స్ రూపంలో ఫండ్ రైజింగ్ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఆ తల్లి పేరు ఆలపాటి నందిని. ఆమెకు నెలలు నిండకుండానే ప్రసవం జరిగింది. పుట్టడంతోనే ఆ బిడ్డ అనేక ఆరోగ్య సమస్యలతో జన్మించింది. ఆ పసికందును బతికించుకోవాలి అంటే వైద్యం కోసం లక్షల్లో ఖర్చుచేయాల్సి వస్తోంది. ఆ కుటుంబం వారి శక్తి మేరకు వైద్యం కోసం ఖర్చు చేశారు. ఆ బిడ్డకు ప్రస్తుతం NICUలో చికిత్స అందిస్తున్నారు. చికిత్స కోసం, నిపుణులను సంప్రదించేందుకు ఇలా పూర్తి వైద్యం కోసం దాదాపు రూ.10 లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యలు తెలిపారు.

ఆ కుటుంబం వారికి స్తోమత ఉన్నంత వరకు ఆ బిడ్డను బతికించుకునేందుకు పోరాడారు. ఇప్పుడు వారి చేయి దాటిపోవడంతో.. సహాయం చేసే వారికోసం ఎదురుచూస్తున్నారు. ఆ బిడ్డ వైద్యం కోసం అయ్యే రూ.10 లక్షల కోసం డొనేషన్స్ రైజ్ చేస్తున్నారు. దాతల రూపంలో ఆ బిడ్డకు కావాల్సిన వైద్య ఖర్చులు అందితే తమ బిడ్డను బంతికించుకుంటాం అంటూ ప్రాథేయ పడుతున్నారు. ఎవరైనా ఆ చిన్నారికి సహాయం చేయాలి అనుకుంటే వారి బ్యాంకు వివరాలను అందజేశారు. అలాగే ఇంపాక్ట్ గురూ అనే యాప్ లో కూడా ఫండ్ రైజ్ చేస్తున్నారు.

దిక్కు లేని వారికి దేవుడే దిక్కు అంటారు. మరి.. ఆ దేవుడైనా ఏదో ఒక మనిషి రూపంలోనే కదా దిగి రావాల్సింది. అలా మనం ఎందుకు ముందడుగు వేయకూడదు. ఆ తల్లి పడే కడుపు కోతని మనం ఎందుకు ఆపకూడదు? ఆమె పెదవులపై మనమే ఎందుకు మళ్ళీ నవ్వులు పూయించకూడదు? ఒక్కసారి ఆలోచించండి. సామాన్యులుగా మనం చేసే సాయం చిన్నదే కావచ్చు. కానీ.., మానవత్వంతో అందరం కలిసి స్పందిస్తే.., ఒక చేతికి మరి చేయి తోడైతే.. ఆ చిన్నారి బతకొచ్చు. ఆ తల్లి కన్నీరు ఆగొచ్చు. మనది కాని కష్టాన్ని.. ఒక్కసారైనా భుజాన వేసుకుని మోస్తే కదా? సాయం చేయడంలో ఉండే ఆనందం తెలిసేది. ఇప్పుడు మనం ఆ పని చేద్దాం. మీకు తోచినంత అమౌంట్ ని ఆ చిన్నారి కోసం డొనేట్ చేయండి. మీకు సహాయం చేసే స్థోమత లేకపోవచ్చు. అలాగని ఊరికే ఉండాల్సిన అవసరం లేదు. ఈ వివరాలను మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారు సహాయం చేసేలా మీ వంతు ప్రయత్నం చేయచ్చు.

బ్యాంకు ద్వారా డొనేట్ చేయాలంటే:

  • బ్యాంక్ పేరు:RBL బ్యాంక్
  • అకౌంట్ నంబర్: 2223330084514354
  • అకౌంట్ నేమ్: బేబీ ఆఫ్ ఆలపాటి నందిని
  • ఐఎఫ్ఎస్సీ కోడ్: RATN0VAAPIS
  • యూపీఐ: supportnaish2@yesbankltd

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి